.
బీబీసీ… ఇది ఓ పక్కా భారత వ్యతిరేక మీడియా సంస్థ… లక్ష ఉదాహరణలు… ఏ చైనావంటి ప్రభుత్వమో అయితే దాన్ని నిషేధించి, కఠినంగా వ్యవహరించేది… కానీ మనది భారత దేశం కదా… అలాంటివేమీ మనకు చేతకావు…
ఈ మాట అనడానికి నేనేమీ సందేహించడం లేదు… బీబీసీని చాన్నాళ్లుగా గమనించాకే… మోడీ వెన్నెముక లేని ధోరణిని గమనించాకే ఓ అంచనాకు వచ్చి వెలిబుచ్చుతున్న అభిప్రాయం… ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి…
Ads
వాడికి హఠాత్తుగా హిందూ మహా సముద్రంలోని అగలెగ అనే చిన్న ద్వీపం కనిపించింది… అది ఇండియా స్ట్రాటజిక్ నౌకాస్థావరం అయిపోతోందట… బీబీసీకి గుండె చెదిరిపోయింది… ఏదో పిచ్చి స్టోరీ రాసుకొచ్చింది… అయ్యో, అయ్యో, ఎంత అన్యాయం అన్నట్టుగా శోకాలు పెడుతున్నట్టుగా ఉంది ఆ స్టోరీ…
చైనా ఏకంగా దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలే నిర్మిస్తోంది… అమెరికా, రష్యా తదితర దేశాలన్నీ తక్కువ కావు… అక్కడికి ఇండియా తనకంటూ ఓ స్ట్రాటజిక్ స్థావరం ఏర్పాటు చేసుకుంటుంటే, అదొక అంతర్జాతీయ నేరం అన్నట్టుగా ఓ స్టోరీ రాసుకొచ్చింది…
తన భారత వ్యతిరేకతను మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది… పక్కా ఇండియన్ కమ్యూనిస్ట్, లిబరల్, సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్లలాగే..!
అక్కడ ఉన్నదే 350 మంది… ఎవరూ మూలవాసులు కారు… ఎక్కడి నుంచో వచ్చి ఉంటున్నారు… ఎవరికీ అక్కడి భూమిపై ఏ హక్కూ లేదు… ఇండియా కూడా అక్రమంగా ఏమీ కబ్జా చేయలేదు… ఆ దీవి ఓనర్ మారిషస్ నుంచి లీజుకు తీసుకుంది… అంతర్జాతీయ రాజకీయాల్లో, వ్యూహాత్మక అడుగుల్లో సర్వసాధారణం ఇలాంటివి…
బీబీసీ వాడు రాసుకొస్తాడు… అందరూ ముక్కలైన హృదయాలతో దీవిని వీడి వెళ్లాల్సి వస్తోందట… సో వాట్..? అక్కడ ఏమీ లేదు… చివరకు ఫుడ్ కావాలన్నా 1100 కిలోమీటర్ల దూరంలోని మారిషస్ రాజధాని పోర్ట్ లూయీస్ నుంచే రావాలి… అదీ ఏడాదికి నాలుగు సార్లు ఆ నౌక వస్తుంది…
మారిషస్‌తో ఇండియా ఒప్పందంతో దీవి సైనికీకరణ చెందుతుందని ఆ స్థానికులు అందోళన చెందుతున్నారట… బీబీసీ తెగ బాధపడిపోయింది… ఆ దీవి ఉన్నే 25 చదరపు కిలోమీటర్లు… చేపలు పట్టడం తప్ప అక్కడ ఇంకేమీ సాధ్యం కాదు… ఐతే హిందూ మహాసముద్రంలో నౌకల రాకపోకల్ని పర్యవేక్షించేందుకు ఇండియాకు ఆ దీవి అవసరం…
అదుగో దాన్ని కౌంటర్ చేస్తోంది… అక్కడ కొబ్బరి చెట్లను కొట్టేసి రన్ వే నిర్మించారట… రెండు పెద్ద భవనాలు కట్టారట… బీబీసీ ఇండియా ప్రభుత్వాన్ని ఇదేమిటోయ్ అనడిగిందట… ప్రభుత్వం స్పందించలేదట… ఏ ప్రభుత్వమైనా, అదీ బీబీసీ వంటి మాదచ్చోద్ మీడియా సంస్థకు వివరాలు ఇస్తుందా…?
మోడీ పేరిట వెబ్‌సైట్‌లో ఓ వ్యాఖ్య ఉంటుంది… భారత్, మారిషస్ నడుమ అంతర్జాతీయ, నౌకా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు, సౌహార్ద్ర సంబంధాలు ఉన్నాయీ అని… తప్పేముంది..? బీబీసీ చూసే కోణమే తప్పు… అది దాని జన్యునిర్మాణంలోనే ఉంది… అది ఇంకా ఏం రాస్తుందంటే…
‘‘1970ల నుంచే భారత్, మారిషస్‌ల మధ్య రక్షణకు సంబంధించి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మారిషస్ జాతీయ భద్రత సలహాదారు, సముద్ర తీర రక్షక దళం చీఫ్, పోలీస్ హెలికాప్టర్ దళం అధిపతి అందరూ భారతీయులే. వాళ్లు భారతీయ విదేశీ నిఘా సంస్థ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అధికారులు…’’
సో వాట్… బీబీసీకి ఏం అభ్యంతరం..? ఆ దేశం ఇష్టం, నీకేం నొప్పి..? ఒక సార్వభౌమ దేశం తన భద్రత కోణంలో చాలా వ్యూహాలు రచిస్తుంది… అంతర్జాతీయ చట్టాలకు లోబడే వ్యవహరిస్తుంది… దీనికి అయ్యో, అయ్యో అంటూ బీబీసీ గుండెలు బాదుకోవడం దేనికి..? ఇండియా లోకువ కాబట్టి, మోడీ ప్రభుత్వానికి ధైర్యం లేదు కాబట్టి ఏదేదో రాసి పారేస్తుంది…!!
Share this Article