.
పంచాయతీ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో చాలామంది విశ్లేషకులు, మీడియా పర్సన్స్ కేవలం పార్టీల వారీగా గెలుచుకున్న స్థానాలనే పరిగణనలోకి తీసుకున్నారు… ఒక్క కేసీయార్ మీడియా మినహా దాదాపు మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రకటించిన రిజల్ట్స్ కాస్త అటూ ఇటూ సేమ్…
రేవంత్ రెడ్డి తమ రెబల్స్‌ను కూడా కలిపేసుకుని ఏకంగా 8300 దాకా లెక్క చెప్పాడు… బీజేపీ కూడా 600 సర్పంచులు, 1200 మంది ఉపసర్పంచుల లెక్క చెప్పుకుంది… నిజానికి బీజేపీ నాయకులు గట్టిగా ప్రయత్నిస్తే కనీసం రెట్టింపు సంఖ్యలో వచ్చేవి… బీఆర్ఎస్ సహజంగానే కింద పడినా నేనే తోపు అని ప్రకటించుకుంది…
Ads
ఇవన్నీ పార్టీలు, మీడియా ఎవరి పొలిటికల్ లైన్‌ను బట్టి వాళ్లు చెప్పుకున్నారు… కానీ సామాజిక సమీకరణం..? అది కదా ముఖ్యం… రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సంకల్పించాడు… లీగల్‌గా సాధ్యం కాలేదు… మరి ఈ ఫలితాల్లో బీసీల స్థానం ఏమిటి..? అది కదా ఇంట్రస్టింగ్ పాయింట్… నిన్న ఆంధ్రజ్యోతి ఓ స్టోరీ వేసింది… కోణం మంచిదే గానీ… రాసిన తీరు, ప్రజెంట్ చేసిన తీరు మరీ నీతిఆయోగ్ లెక్కల్లా ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థంలా మారిపోయింది…

సింపుల్‌గా చూద్దాం… ఎస్సీ, ఎస్టీ సీట్లను వదిలేద్దాం… ఏజెన్సీ ఏరియాలో వేరేవాళ్లు పోటీ చేయడానికి చాన్స్ లేదు, అదీ వదిలేద్దాం… ఎలాగూ బీసీలకు రిజర్వ్ చేసిన సీట్లున్నాయి, వాళ్లే పోటీచేయాలి కాబట్టి అవీ వదిలేద్దాం… ఇక ఎవరైనా పోటీచేయగల జనరల్ సీట్ల లెక్క చూద్దాం…
అవి 5190 సీట్లు… వాటిల్లో బీసీలు ఏకంగా 2738 సీట్లు గెలిచారు… అంటే 52.75 శాతం సీట్లు… చిన్న విషయమేమీ కాదు… రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లు, బీసీల్లో పెరుగుతున్న చైతన్యం, అన్ని పార్టీలనూ బీసీలకు ప్రాధాన్యమివ్వక తప్పని పరిస్థితి వైపు నెట్టేయబడుతూ… ఇదీ బీసీల విజయం… పల్లెల్లో చెప్పుకోదగిన మార్పు ఇది, రాజకీయంగా..!
గెలిచిన సర్పంచి అభ్యర్థిది ఏ పార్టీయో చెప్పడం కొంత కష్టం కావచ్చు గాక… కానీ తన సామాజికవర్గం మారదు కదా, నిర్దిష్టమే కదా… సో, ఇలా సామాజిక కోణంలో చూస్తే బీసీ నాయకులు, అందులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవాళ్లు చెప్పుకోదగిన విజయాల్ని సొంతం చేసుకున్నట్టే భావించాలి…
సో, ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయో లేదో తరువాత సంగతి… ఆ పోరాటం అలా సాగనీ, ఏదో ఒకరోజు అవి సిద్ధించనీ… కానీ ఈలోపే బీసీల్లో పెరిగిన చైతన్యం, రాజకీయ స్పృహ.., అందరితోనూ పోటీపడే చొరవ, దూకుడు రాష్ట్ర రాజకీయాల సమీకరణాల్లో విశేష మార్పును సూచిస్తోంది… తమకు లక్ష్యించిన ఆ 42 శాతాన్ని మించి, జనరల్ సీట్లలో వాళ్లే సొంతంగానే గెలుచుకున్నారు… గుడ్…!
Share this Article