.
- బీసీల జనాభా ఎంతో తేలేందుకు కులగణన చేసింది రేవంత్ రెడ్డి.., 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి… స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తెచ్చింది కూడా రేవంత్ రెడ్డి… అవసరమైతే ఢిల్లీలో ఆందోళన చేస్తామంటున్నదీ రేవంత్ రెడ్డి… ఈమేరకు కార్యాచరణ ప్లాన్ కూడా చేస్తున్నారు… జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల మద్దతు సమీకరిస్తున్నాడు…
కొన్ని అడ్డంకులున్నా… మత రిజర్వేషన్ల పేరిట బీజేపీ స్ట్రాంగ్ అభ్యంతరాలున్నా సరే.., రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన సంకల్పం దిశలో తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది… అది ఫ్యాక్ట్… కానీ దీన్ని మొత్తం హైజాక్ చేసి, మొత్తం క్రెడిట్ కొట్టేయడానికి బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలు ఓ విడ్డూరం…
మొన్న ఎక్కడో ఓ వార్త కనిపించింది… బీసీ రిజర్వేషన్ల మీద కేసీయార్ కార్యరంగంలోకి దూకుతాడట, ఢిల్లీ వెళ్లి అందరినీ కూడగడతాడట, రాష్ట్రపతిని కలుస్తాడట… మంచిదే, రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల సంకల్పానికి ప్రతిపక్షం కూడా తనవంతు మద్దతు ఇస్తే, రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మంచివే అని పరోక్షంగా అంగీకరిస్తే మంచిదే… కానీ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం…
Ads
కానీ కేసీయార్ కార్యరంగంలోకి, అంటే ప్రజల్లోకి వచ్చేదే లేదు, ప్రస్తుతం తను ప్రజాజీవితంలోనేే లేడు… ఆయన ఫామ్ హౌజు వదిలి రాడు, అదే కదా అసలు సమస్య… నిజానికి కేసీయారే తన హయాంలో బీసీల రిజర్వేషన్లను కుదించాడు అనే విమర్శలను కాసేపు పక్కన పెడితే… కేసీయార్ బిడ్డ కవిత ధోరణి మరోటైపు…
మావల్లే ఆర్డినెన్సులు, బీసీ రిజర్వేషన్లు అని క్లెయిమ్ చేసుకుంది, పర్లేదు… ఇప్పుడిక 72 గంటల దీక్ష చేస్తుందట… అదేదో ఢిల్లీలో చేస్తే బెటర్ కదా… స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఆర్డినెన్స్, 42 శాతం స్థూల బీసీ రిజర్వేషన్ల చట్టం అన్నీ ఢిల్లీ ఆమోదానికి వేచిచూస్తున్నాయి… ఈ ఒత్తిడి అక్కడ కదా ప్రయోగించాల్సింది…
బీసీ ఉద్యమకారుడిగా పేరొందిన బీజేపీ కృష్ణయ్య మరో ధోరణి… ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు నిన్న… ‘‘రాజ్యాంగంలోనీ 243 D6 ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి అధికారం ఉన్నది… ఆర్డినెన్సుపై ఇంతవరకు గవర్నర్ ను రేవంత్ రెడ్డి కలవలేదు… రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇంతవరకు తీసుకోలేదు… అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు…
కవితను మనసారా అభినందిస్తున్నాను, కవిత నిస్వార్ధంగా బీసీల కోసం దీక్ష చేస్తున్నది… ఆర్డినెన్స్ కోసం సీరియస్ ప్రయత్నాలు చేయాలి రేవంత్ రెడ్డి’’ అంటున్నాడు… మంచిదే, బీసీ ఉద్యమసంఘాలు కూడా రేవంత్ రెడ్డి తెచ్చిన ఆర్డినెన్స్ సరైందే, అది మాకు న్యాయం చేస్తుందీ అని అంగీకరిస్తున్నాయి అన్నమాట…
ఐతే… ఇక్కడ విస్మయం ఏమిటంటే..? కృష్ణయ్య ఏ పార్టీలో ఉన్నాడు..? బీజేపీ…! కానీ అదే బీజేపీ అంటే కవితకు మంట… తనను జైల్లో పెట్టారని…! ప్రభుత్వం ఈ విధానంలో ఇవ్వదలిచిన రిజర్వేషన్లపై బీజేపీ అభ్యంతరాలు… మతరిజర్వేషన్లు చెల్లవు అంటూ…!!
మరి బీజేపీ విధానం, పోకడ వేరుగా ఉన్నప్పుడు… అదే కవితను అభినందిస్తూ కృష్ణయ్య, ఈ పోరాటాలతోనే బీసీలకు బలం అనే ప్రశంస ఏమిటి..? సరే, బీసీలు అనే కోణంలో సమర్థనీయమే అనుకుందాం… ఇక్కడ రేవంత్ రెడ్డి మీద బురద దేనికి మళ్లీ..?
బీజేపీ తాము చేరదీసిన నేతలు, పార్టీ తీసుకున్న లైన్‌కు భిన్నంగా ఏం మాట్లాడుతున్నారో, ఎవరికి మద్దతు పలుకుతున్నారో కూడా చూసుకోదా..?
Share this Article