.
కాంతారా చాప్టర్1 చూస్తుంటే… డిసెంబరు 2022… కన్నడ మీడియాలో కనిపించిన ఓ వార్త గుర్తొచ్చింది… అది ఎందుకు ఆసక్తికరం అంటే… కాంతార బంపర్ హిట్ తరువాత తుళు ప్రాంత కల్చర్‌లో భూతకోల గురించి పదే పదే చెప్పుకున్నాం కదా… కాంతారలో కనిపించిన గ్రామీణ నర్తనార్చన అదే… అందులో పంజుర్లి, గుళిగ దేవుళ్ల గురించి కూడా తెలుసుకున్నాం… ఇలా దేవుళ్లు ఆవహించే నాట్యకారులను దైవ నర్తకులు అంటుంటారు…
Ads
అలా పింజుర్ల దేవుడు ఆవహించిన దైవ నర్తకుడి పేరు ఉమేష్ పంబడ… చాలా సీనియర్… ఆరోజు రిషబ్ శెట్టి ఆశీస్సుల కోసం వెళ్లినప్పుడు భూతకోల చేస్తున్నది ఉమేషే… వేరే స్పిరిట్యుయల్ డాన్స్ ట్రాన్స్‌లో ఉన్న ఉమేష్ తన దగ్గరకు వచ్చిన రిషబ్ శెట్టికి ఏం చెప్పాడో తనకూ తెలియదు… కానీ రిషబ్ ఏమడిగాడు, తనేం చెప్పాడో తన చుట్టూ ఉన్న వ్యక్తులు తరువాత చెప్పారట…
లక్షల మంది ఆదివాసీలు తరతరాలుగా నమ్ముతున్న, పూజిస్తున్న ఒక దేవత ఓ దైవనర్తకుడిలో ప్రవేశించి… ఓ మనిషికి అంత విలువ, గుర్తింపు ఇవ్వడం ఏమిటి..? సదరు వీరేంద్ర హెగ్డే ఆ నర్తకుల సబ్ కాన్షియస్ మైండ్స్‌లో కూడా అలా ఇంకిపోయాడా..?
ఎవరు ఈ వీరేంద్ర హెగ్డే…? పద్మభూషణ్… రీసెంటుగా మోడీ సర్కారు ఆమధ్య రాజ్యసభకు నామినేట్ చేసింది… పాపులర్ ధర్మస్థల గుడికి తను వంశపారంపర్య ధర్మకర్త, నిర్వాహకుడు… తనకు ఓ ట్రస్టు… దాని ద్వారా బోలెడు సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు… కన్నడ సమాజంలో మంచి పేరుంది తనకు… కానీ కాంతార సీక్వెల్ తీయడానికి తన పర్మిషన్ దేనికి..? పైగా ఓ నర్తకుడి దేహంలోని ఓ గ్రామీణ దేవుడు చెప్పడం ఏమిటి..?
ధర్మస్థలకు వెళ్లి, ముందుగా పూజలు చేయి, షూటింగు జరుగుతున్నప్పుడు తరచూ గుడికి వెళ్లు అని కూడా ఆ దేవుడు చెప్పాడు, అది వోకే… రిషబ్ కాంతార సినిమా షూటింగు సమయంలోనూ పలుసార్లు వెళ్లాడు, వెళ్తాడు, తను బాగా విశ్వసిస్తాడు… తనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు…
సదరు ప్రధాన దైవనర్తకుడు చెబుతున్న మాటల్లో మరొకటి విశేషంగా అనిపించింది… ‘‘కాంతారలాగా కాదు ఇది… ఈ సీక్వెల్ తీయడానికి ఒకటికి వందసార్లు జాగ్రత్తలు తీసుకో… భూతకోల ఆచారాల్ని, సంప్రదాయాల్ని గౌరవించు… పూజించు…’’ అన్నాడు… కాంతారతో పోలిస్తే సీక్వెల్‌కు ఎందుకు వంద జాగ్రత్తలు తీసుకోవాలి..? మొత్తానికి చదవడానికి ఇంట్రస్టింగు వార్తాకథనాలు భలే వస్తుంటాయి కన్నడ సినీ మీడియాలో…!!
Share this Article