ఆటో రాంప్రసాద్ ఏడ్చేస్తున్నాడు… కొత్తగా జడ్జిగా వచ్చిన సదా కన్నీళ్లు ఒత్తుకుంటోంది… ఇంద్రజ కళ్లు కారిపోతున్నాయి… రష్మికి దుఖం ఆగడం లేదు… రోహిణి కళ్లు తుడుచుకుంటోంది… కార్తీక్ శోకరసంలో జీవించేస్తున్నాడు……… ఏమిటిదంతా అంటారా..? ఈటీవీ ఎక్సట్రా జబర్దస్త్‌లో ఓ సీన్… ఎందుకీ శోకాలు అంటారా..? ఆ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోయాడట… గెటప్ సీను రావడం లేదట… ఆటో రాంప్రసాద్ ఒంటరివాడయ్యాడట… దాంతో అందరూ తలుచుకుని, కుమిలి కుమిలి ఏడుస్తున్నారు… ఓ స్కిట్ చేశారు దానిపైనే…
మరీ అతి అనిపిస్తోందా..? నిజమే… అతిన్నర..! ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఓ గ్రూపుగా వర్క్ చేస్తున్నారు… ఇద్దరు బయటికి వెళ్లిపోయారు, మూడో వ్యక్తి అక్కడే ఉన్నాడు… అది దుఖదాయకం ఎలా అవుతుంది..? ఓ కామెడీ షోలో ఈ స్కిట్ ఎలా ఫిట్టయింది..? ఎందరో ఈ షోలోకి వస్తుంటారు, పోతుంటారు… మరి గతంలో ఎవరికీ ఈ కన్నీటి వీడ్కోలు ఇవ్వలేదేం..? ఐనా ఈ స్కిట్ ఆ షో కేరక్టర్ (?)లో ఎలా ఇమిడింది… ఎవరైనా ఆర్టిస్టు ఏ కారణం చేత వచ్చినా, పోయినా అది ఇంటర్నల్…
సుడిగాలి సుధీర్ గానీ, గెటప్ సీను గానీ… చెడిపోలేదు కదా… బాగుపడటానికి, కొత్త అవకాశాల కోసం బయటికెళ్లారు… కామన్ కదా… నీరు ప్రవహిస్తూ ఉండాలి… పాచిపట్టేదాకా నిల్వ ఉండకూడదు… ఆటో రాంప్రసాద్ కూడా ఈ సోయి ఉంటే వెళ్లిపోవాలి… వెళ్లే సాహసం లేకపోతే కొనసాగాలి… అంతేతప్ప తన బాధ ప్రపంచం బాధ ఎలా అవుతుంది..?
Ads
ఇక్కడ విచిత్రం ఏమిటంటే…? ఏ మల్లెమాల టీం సుధీర్‌కు పొగబెట్టి వెళ్లిపోయేలా చేసిందో… వాళ్లే ఈ ఏడుపు స్కిట్ ప్రసారం చేస్తుండటం..! హతమార్చి, అయ్యో, చనిపోయావా అని శోకాలు పెట్టడం వంటిది… సుధీర్‌ను మొదట స్పెషల్ ఈవెంట్ షోల నుంచి కట్ చేశారు… తరువాత ఢీ నుంచి తరిమేశారు… మెల్లిగా జబర్దస్త్ నుంచి వెళ్లగొట్టారు… చివరకు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా పంపించేశారు… ఒకేసారి జరిగినవి కావు… ఒక్కొక్కటీ చేస్తూ వస్తున్నారు…
మళ్లీ వాళ్లే ఇప్పుడు అయ్యో సుధీర్ వెళ్లిపోయావాా..? సీనూ ఇక రావా..? ఆటో రాంప్రసాద్ ఒంటరివాడయ్యాడు పాపం… అని ఓ విషాద ఎపిసోడ్ రాయించి మరీ ప్రసారం చేస్తున్నారు.. ఐనా వాళ్లు చెడిపోయి బయటికి పోలేదు… అసమర్థులై పోలేదు… ఇక్కడ రాజకీయాలు భరించలేక, పొగతో ఊపిరాడక కొత్త దారులు వెతుక్కున్నారు… సో, ఆ నిష్క్రమణకు ఈ ‘శోకనివాళి’ ఏమిటి..? మరీ ఇంత ‘అతి కృత్రిమత్వం’ అవసరమా..? రాంప్రసాద్… కనీసం నీ దోస్తుల పట్లనైనా హార్టిఫిషియల్‌గా ఉండొచ్చు కదా… ఈ ఆర్టిఫిషియాలిటీ దేనికి..?! సుధీర్, గెటప్ సీను ఎందుకు వెళ్లిపోయారో నీకు తెలియదా..? నీకూ పొగ తప్పదనే భయసందేహాలు నీలో లేవా..?!
Share this Article