.
బ్యూటీ అనే సినిమా… మారుతి సమర్పణ అనేసరికి కాస్త ఇంట్రస్ట్… హీరో హీరోయిన్లు కొత్త… ఇదీ ఓ ప్రేమ యవ్వారపు కథే అయినా, ఆ నేపథ్యంలో ఏదో తండ్రీ కూతుళ్ల అనుబంధం, ఘర్షణ, తండ్రి ప్రేమ చిత్రీకరించారని తెలిసి కాసింత ఆసక్తి…
పైగా ఈమధ్య అదృష్టవశాత్తూ పెద్ద భ్రమాత్మక సినిమాలు బోల్తా కొడుతూ, చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి కదా… ఇదీ హిట్ అవ్వొచ్చునేమో అనుకున్న సినిమా… కథ వరకూ వోకే… చాలా సినిమాల్లో చూసిందే…
Ads
ఓ తండ్రి ప్రాణం పెట్టుకుని చూసుకునే బిడ్డ… అమెకు ఓ లవ్వర్… ఇద్దరూ హైదరాబాద్ పారిపోతారు… అడిగినవన్నీ ఎంత కష్టమైనా కొనిచ్చే ఆ తండ్రి తన ప్రేమను ఒప్పుకోకపోతాడా..? మరెందుకు పారిపోవడం అంటారా..? అదే ఈ కథ మరి..! ప్రజెంట్ జనరేషన్ తొందరపాట్లు, పాట్లు, ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న మోసాలు గట్రా చూపించడానికి ప్రయత్నిస్తాడు దర్శకుడు…
పెద్దగా లోపాలున్నాయని కాదు గానీ… లవ్ ట్రాక్‌లో పెద్దగా ఫ్రెష్ నెస్ లేదు… కన్నమ్మ, నేనెవరే నేనెవరే అనే సాంగ్స్ మాత్రం బాగున్నాయి… ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్ వోకే వోకే అనిపించినా సెకండాఫ్ థ్రిల్లర్ టర్న్ తీసుకుని మరో బాట పట్టింది… సెకండాఫ్ ట్విస్టులు కాస్త బాగున్నట్టనిపించినా సరే క్లైమాక్స్ నీరసంగా ముగిసింది…
సినిమాలో చెప్పుకోదగింది హీరోయిన్‌గా చేసిన నీలఖి పాత్రా గురించి… ఒడిశా నటి… ఆమెది రాయగడ్… మొదట్లో టీవీ నటి… దశమ, కుయిలిరాణి, సంబల్‌పురి పాట చిత్రాలు చేసింది… మరి ఈ బ్యూటీ సినిమా టీమ్‌కు ఆమే కావాలని ఎందుకు అనిపించిందో గానీ … తెలుగు తెరకు మరో మంచి నటి దొరికినట్టే…
ఈ సినిమాలోని దాదాపు ప్రతి సీన్‌లోనూ బాగా చేసింది… మరో పాత్ర తండ్రిది… సీనియర్ నరేష్‌కు కొన్నాళ్లుగా మంచి పాత్రలు దొరుకుతున్నాయి… సద్వినియోగం చేసుకుంటున్నాడు… హీరోగా ఏమో గానీ, ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టుగా మాత్రం అదరగొడుతున్నాడు… ఈ సినిమాలోని కొన్ని సీన్లలో కూడా క్యాబ్ డ్రైవర్ నారాయణ పాత్రలో జీవించాడు… గుడ్ పర్‌ఫామెన్స్…
రెండు భిన్నమైన షేడ్స్‌లో పెట్ ట్రైనర్‌గా మేల్ లీడ్ రోెల్ చేసిన అంకిత్ కొయ్య కూడా పర్లేదు, బాగానే చేశాడు… స్థూలంగా సినిమా హీరోయిన్ అంత బ్యూటిఫుల్‌గా ఏమీ లేకపోయినా, ఈ బ్యూటీ సినిమా పర్లేదు అని చెప్పొచ్చు..!!
Share this Article