అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడ దొరుకుతుందా అని ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఉంటుంది… సీరియస్ విషయం ఏదీ దొరక్కపోతే ఏదో ఓ చిన్న విషయాన్నే భూతద్దంలో పెట్టి విమర్శలకు దిగుతుంది… మరి ఏదో ఓ పని ఉండాలి కదా… ప్రత్యేకించి బీజేపీ అయితే మత సంబంధ అంశం ఏం దొరుకుతుందా అని చూస్తుంటుంది…
ఒడిశాలో కూడా అంతే… నవీన్ పట్నాయక్ మీద ఆరోపణలు, విమర్శలకు పెద్దగా పాయింట్లు దొరకవు… ఎంత ప్రయత్నించినా తనను బీట్ చేయలేకపోతోంది ఆ రాష్ట్రంలో… వ్యక్తిగత ఆరోపణలు చేద్దామనుకుంటే తనకు రాజకీయ వారసులు లేరు, డబ్బులూ తినడు… కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టడు, పథకాలు పెట్టడు… తనేమిటో, తన ప్రపంచమేమిటో… అంతా ఒంటి కాయ శొంఠి లింగం తరహా… ఐనా ఇన్నేళ్లూ జనం ఆదరిస్తూనే ఉన్నారు…
బీజేపీ ఓ ఇష్యూను చేపట్టి రచ్చ చేయడానికి నిన్నటి నుంచీ ఒకటే ప్రయత్నిస్తోంది… అదేమిటయ్యా అంటే..? కామియా జాని లేనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్… కర్లీ టేల్స్ పేరిట యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఉంటుంది… ఫేమసే…
Ads
ఆమె చూడచక్కగా ఉంటుంది, కంటెంట్ ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది… దాంతో తనకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే… మొన్నెప్పుడో ఓ వీడియో పెట్టింది… పూరి శ్రీమందిర్ హెరిటేజ్ కారిడార్ పేరిట ఒడిశా ప్రభుత్వం భక్తి పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టు చేపట్టింది… ఈ 5టీ ప్రాజెక్టుల గురించి మనం గతంలో చెప్పుకున్నాం కదా… నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా భావించబడుతున్న వీకే పాండ్యన్ దానికి హెడ్… గతంలో బ్యూరోక్రాట్ (ఐఏఎస్) – భార్య కూడా ఐఏఎస్… ఇప్పుడు బిజూ జనతాదళ్ నాయకుడు…
సదరు పాండ్యన్‌ను పూరి ఆలయ ప్రాంగణంలో కూర్చోబెట్టి పూరి మహాప్రసాదం విశిష్టత మీద వీడియో చేసింది ఆమె… అది బాగా వైరల్ అయ్యింది… నిజానికి బీజేపీ దాన్ని ప్రోత్సహించాలి కదా… లేదు, అలా గాకుండా.., ఛస్, బీఫ్ తినే, బీఫ్ ప్రమోట్ చేసే ఆ మహాతల్లితో అంతటి పూరి పవిత్ర ప్రాంగణంలో ఆ మహాప్రసాదం మీద వీడియో చేయడం ఏమిటి..? నాన్సెన్స్, అసలు పూరి ఆలయ ప్రాంగణంలోకి ఎలా అనుమతించారు ఆమెను’’ అని ఒడిశా బీజేపీ విమర్శలకు దిగింది…
‘‘కోట్లాది హిందువుల మనోభావాలు, మతభావాలు దెబ్బతిన్నయ్, ఆలయ ప్రాంగణంలో షూట్ చేసి ప్రసారం చేసిన ఈ నీచ చర్యను ఆమోదించలేం, సదరు పాండ్యన్ మీద, ఆ వీడియో చేసిన కామియా జాని మీద ఐపీసీ 295 ఏ కింద (మతాన్ని కించపరచడం) కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి’’ అని డిమాండ్ చేసింది…
ఇక్కడ విషయం ఏమిటంటే… ఆమె ఏం వీడియో చేసిందనేదే ప్రధానం కదా… ఆమె ఏం తింటుంది, ఏం బట్టలు వేసుకుంటుంది అని కాదు కదా… పద్ధతిగా డ్రెస్ వేసుకుని, ఆలయ ప్రాంగణంలో అన్ని మర్యాదలూ పాటిస్తూ… ఆ ఆలయ మహాప్రసాదం విశిష్టత మీదే కదా ఆమె వీడియో చేసింది… అందులో తప్పేముంది..? బీఫ్ తినే అలవాటుంటే అది ఆమె వ్యక్తిగత అభిరుచి… ఠాట్, కేసులు పెట్టాల్సిందే అని యాగీకి పూనుకుంది బీజేపీ… @bjd_odisha … అంతేకాదు, ఆమె బీఫ్ డిషెస్ ప్రమోట్ చేసే పాత వీడియో ఒకటి ట్విట్టర్‌లో పెట్టింది…
సీన్ కట్ చేస్తే… సదరు కామియా జాని ఓ వివరణను జారీ చేసింది… తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టి… ‘‘అయ్యా, నేనెప్పుడూ నా జీవితంలోనే బీఫ్ తినలేదు… ఓ భారతీయురాలిగా మన కల్చర్, మన హెరిటేజ్‌ను ప్రపంచానికి చెప్పడం అనేది నా అలవాటు, నా అభిరుచి… అందుకే అన్ని జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నాను… చార్ ధామ్ దర్శించాను… ఎక్కడ విశిష్ట ఆలయం ఉందో అక్కడికి వెళ్తాను… నేను పూరికి వెళ్లడాన్ని ఆక్షేపిస్తూ ఎవరో ఏదో రాశారు, నన్ను ముందే అడిగితే వివరణ ఇచ్చేదాన్ని… జై జగన్నాథ్’’ అని రాసుకొచ్చింది… హేమిటో… సబ్జెక్టు ఏమీ లేకపోతే, ఇలాంటివి వెతుక్కోవాలా బ్రదర్స్..?! ఐనా బీఫ్ అంటే గోమాంసం మాత్రమే కాదు కదా…! పైగా తనకు బీఫ్ తినే అలవాటు కూడా లేదంటోంది…!!
Share this Article