Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…

May 18, 2025 by M S R

.

ఒక గుణపాఠం నుంచి తిరుగులేని విజయాపథం వైపు.., ప్రపంచానికి తెలియని మన ఓ విజయగాధ గురించి చెప్పుకోవాలి ఓసారి…

పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను, యుద్ధవిమానాల్ని గాలిలోనే తుత్తునియలు చేసి… అడ్డంకి లేకుండా దాని ఎయిర్‌బేస్‌లు, ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసిన గెలుపు వెనుక ఓ పాత కథ ఉంది… అదే ఈ కథనం…

Ads

1995 డిసెంబర్ 17… వెస్ట్ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో ఒక లాట్వియా AN-26 విమానం ఏకే- 47లతో నిండి ఉన్న క్రేట్లను ప్యారాచ్యూట్ల ద్వారా కిందకు భద్రంగా జారవిడిచింది… ఆ ఆయుధాలు ఎవరికోసం, ఇందుకోసం అన్నది ఇప్పటికి ఒక మిస్టరీయే..,

కానీ ఇవ్వాళ మనం తలెగరేసిన ఆపరేషన్ సింధూర విజయానికి మూలం పడింది అక్కడే… ఆ విమానం ఎటు నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది అప్పటికీ ఇప్పటికీ స్వతంత్ర భారత దేశ చరిత్రలో జవాబు లేని ప్రశ్నే… సరిగ్గా అప్పుడే భారత రక్షణ రంగ నిపుణులు భవిష్యత్తు అపాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ రక్షణ ప్రణాళికకు రూపకల్పన చేశారు…

భారత వాయుసేనతోపాటు మన అన్ని రక్షణ వ్యవస్థల్ని సమగ్రంగా ఒకదానికి ఒకటి అనుసంధానం చేసేలా రూపొందించింది IACCS (Integrated Air Command and Control System)…భారత వాయుసేన కోసం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (IACCS) కొనుగోలు… 1999లో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ అనుమతితో ₹ 585 కోట్లతో 5 యూనిట్ల కొనుగోలు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి..,

అందులో భాగంగా వాయుసేన, రక్షణ రంగ నిపుణులు ప్రపంచ దేశాలలోని వివిధ వ్యవస్థల్ని ,అందులోని లోటుపాట్లను డిటైల్డ్ గా పరిశీలించి, మన దేశీయ అవసరాలకోసం ఒక బలమైన గగనతల రక్షణ వ్యవస్థను నిర్మిద్దాం అనుకున్నారు… కానీ ఇలాంటిది ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో మనమే సొంతంగా డెవలప్ చేసుకుందాం అని నిర్ణయం…

అప్పుడప్పుడే ప్రపంచానికి ఒక నమ్మకమైన, చవక సాఫ్ట్‌వేర్ సేవలు అందిస్తోంది ఇండియా… సేవల రంగంలో గుర్తింపు తెచ్చుకుంటున్నది… సో,  భారత్‌ కోసం, భారత్‌లోనే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (IACCS) ను నిర్మించాలి అనేది ప్లాన్…

2002 జూలై 17న.., వాయుసేనాధిపతి ఆదేశంతో ఎయిర్ మార్షల్ రఘు రాజన్ (DCAS) నాయకత్వంలో ఎయిర్ ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో పని మొదలు… ఆ చిన్న నిర్ణయంతో ఒక పెద్ద అడుగు వేయబడింది— IACCS సెల్ ఏర్పాటు… దానికి తెలియదు ఆ రోజు, భవిష్యత్తు భారతానికి తనొక ఉక్కు కవచంగా మారబోతున్నానని…

పూర్తిగా కొత్తగా, భవిష్యత్‌కు తగిన కమాండ్ నెట్‌వర్క్‌ను రూపొందించడమే లక్ష్యం. కానీ అది కూడా అన్ని ప్రాజెక్టులలాగే పురుటి నొప్పుల దశను దాటి బయటకి రావడాన్ని చాలా రోజులే పట్టింది… నిధులు, నిమయకాల అడ్డంకుల్ని ఒక్కొక్కటి దాటుకొని ముందుకు వెళ్తున్న కొద్దీ దాని ఆశయాలు లక్ష్యాలు మరింత పెద్దగా మారిపోయాయి…

భూమిపై ఉండే కమాండ్ నెట్‌వర్క్‌తో పాటు, వేగంగా ఎదుగుతున్న గగన ఉన్నత ఆపరేషన్ల గ్రిడ్‌ను సమర్థంగా సమన్వయం చేయడానికి, ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఒక కేంద్ర కార్యాలయం ఏర్పాటైంది… ఇప్పుడు దాని బాధ్యతలు దేశవ్యాప్తంగా Redundant Airforce Strategic Point నెట్‌వర్క్ అభివృద్ధి, ఆపరేషన్ల దిశగా రూపాంతరం చెందింది , The Directorate of Operational Network of Indian Air space ఏర్పడింది…

ఇలా ఒక్కో దశను దాటి భారతీయ రక్షణ రంగం పకడ్బందీగా రూపాంతరం చెడుతున్నప్పుడే… అగ్నికి వాయువు తోడైనట్టు మన వాయుసేన అమ్ములపొదిలో నుంచి ఇంకో అస్త్రాన్ని బయటకి తీసింది… ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నెట్వర్క్ ని ఆ రోజుల్లో 500 MBPS స్పీడ్ తో ఒక సురక్షితమైన ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ ని ACCS ki అనుసంధానం చేసింది..,

ఇది ఆ రోజుల్లో ఒక సంచలనం, మన దేశాన్ని, మన ఎయిర్ ఫోర్స్ ని ఇంటర్నెట్ వార్ -సెంట్రిక్ యుగంలో అధికారికంగా అడుగుపెట్టేలా చేసింది. ఇక అక్కడి నుంచి చాలా చిన్న చిన్న విషయాల మీద కూడా దృష్టి పెడుతూ భారత భూభాగాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చే ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ సిద్ధం చేసుకుంది …

ఒక రెబెల్ ఆయుధాల జారవేత నుంచి… ఒక పురులియా అనే నాటి నిద్రమత్తు బెంగాల్ పట్టణం నుంచి, దేశవ్యాప్త రక్షణ కవచంగా మారిన కథ ఇది… IACCS కథ – ఆకాశ్ తీర్ ఆ మొత్తం వ్యవస్థలో ఒక పార్టు…

సో, ఎలా ఒక వైఫల్యం ఇంకో విజయానికి సోపానం కాగలదో నేర్పే పాఠం … నిన్నటి ఆకాశ్ తీర్ విజయగాథకు మూలాలేమిటో తెలిసింది కదా… ఇది ఒక్క రోజులో నిర్మితమైంది కాదు… అనేక దశలు, అనేక మంది, అనేక ఏళ్ల పరిశోధన, సమన్వయం, సంధానం… [[ — గోపు విజయకుమార్ రెడ్డి ]]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
  • అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
  • ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
  • మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
  • ‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
  • జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!
  • ఆకాశ్‌తీర్, రుద్రమ్, బ్రహ్మాస్… పాకిస్థాన్ వెన్నువిరిచిన విధం ఇదీ…
  • బురద జల్లడం కాదు… సరైన సంకల్పంతో రాసినా, గీసినా, తీసినా ఒప్పే…
  • సరిగ్గా కళ్లెట్టుకు చూడు… నిండు విస్తరిలో ఏదో మర్డరు జరిగినట్టు లేదూ…
  • దీన్నే ‘ప్రాప్తం’ అంటారు… పాపం, మనసుల్ని కదిలించే ఓ ‘తల్లి’ కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions