.
Pardha Saradhi Upadrasta…. బెంగాల్ వోటర్ లిస్ట్‌లో భారీ మోసం బయటపడింది!
అధికారులు నిజంగా పని చేస్తే — ప్రజాస్వామ్యం సురక్షితం అవుతుంది అనేది మరోసారి నిరూపితమైంది.
Ads
SIR ప్రక్రియ అంటే ఏమిటి?
SIR — Special Summary Revision
ఈ దశలో BLO (Booth Level Officer) లు ఇంటింటికి వెళ్లి,
కొత్త ఓటర్ల ఎన్రోల్మెంట్ ఫాంలు ఇస్తారు
కరెక్షన్లు / డిలిషన్లు తీసుకుంటారు
ప్రజలు ఇచ్చిన ID proofs & అడ్రస్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు
వాటిని పై అధికారులకు సమర్పిస్తారు
ఇది ఓటర్ లిస్ట్ క్లీన్ చేయడానికి అత్యంత ముఖ్యం.
సస్పెన్స్ ఎక్కడ మొదలైంది?
ఈసారి రివిజన్‌లో BLOలు ఇచ్చిన డేటా ప్రకారం 2021లో ఎంత మంది ఓటర్లు ఉన్నారో… 2,208 బూత్‌లలో ఇప్పటికీ అదే సంఖ్య ఉంది
… అంటే కొత్త వోటర్లు లేరు, నకిలీలు లేరు, ట్రాన్స్ఫర్ / డెత్ కూడా ZERO…
ఇంత పెద్ద రాష్ట్రంలో — ఒక్క మార్పు కూడా లేదు అన్నది అధికారులు అనుమానించడానికి ప్రధాన కారణం.
దర్యాప్తు తర్వాత నిజం బయటపడింది
పరిశీలించగా… BLOలపై స్థానిక నాయకుల ఒత్తిడి
క్యాంప్ కార్యాలయాల నుంచి ప్రెషర్
బోగస్ ఫాంలను అంగీకరించి రిపోర్టులు ఫేక్‌గా తయారు చేయించారు
చివరకు మళ్లీ రీవరిఫికేషన్ చేస్తే… “ఇన్ ఎలిజిబుల్ వోటర్లు లేరు” అన్న బూతులు 2,208 నుండి కేవలం 7 కు తగ్గింది… అంటే 2,201 బూత్‌లలో భారీ ఫేక్ / మోసం దొరికింది… అంటే వోటర్ల జాబితాల ప్రక్షాళలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడం, విఫలం చేయడం అన్నమాట
ఇప్పటి దాకా బయటపడ్డవి
ఇప్పటి దాకా 50 లక్షల పైగా ఓటర్లు…
మరణించినవారు
డూప్లికేట్లు
అడ్రస్ మార్చినవారు
ట్రేస్ కాని పేర్లు
… ఇవి కాకుండా కొత్త సాఫ్ట్‌వేర్ Demographic Similar Entries
ఇప్పటికే కోటి 22 లక్షల ఫేక్ వోటర్లను గుర్తించింది
దీని అర్థం..: ఓటర్ లిస్ట్‌లో బోగస్‌ను ఏటేటా పెంచుతూ వెళ్ళారు…
అధికారుల హెచ్చరిక
CEO స్పష్టంగా చెప్పారు…
డేటా మానిప్యులేషన్ చేస్తే BLOలు, సూపర్వైజర్లు, RO/EROలపై క్రిమినల్ కేసులు… ఎవరూ రక్షించలేరు.
టైమ్‌లైన్
ఎనుమరేషన్ డిసెంబర్ 11 వరకు ఈ టైమ్. ముందు క్లీన్ డేటా తప్పనిసరి
రాజకీయ ప్రభావం
ఈ లెక్కలు చివరగా ఫర్మ్ అయితే కనీసం కోటి వోటర్ల డిలిషన్ జరిగే అవకాశం ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది… భారీ అధికార వ్యతిరేకత ప్రమాదపు జోన్ మమత బేనర్జీకీ…. — ఉపద్రష్ట పార్ధసారధి
- ఇంకొన్ని విషయాలూ చెప్పుకోవాలి… బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను, స్మగ్లింగును నివారించడానికి, భద్రతకు కంచె వేస్తోంది కేంద్ర ప్రభుత్వం… కానీ 600 కిలోమీటర్ల కంచె ఇంకా పెండింగ్, కారణం… మమతా బెనర్జీ…
దీనిపై హైకోర్టు సీరియస్‌గా ఉంది… బహుశా అది క్లియర్ అయిపోయి కంచె నిర్మాణం పూర్తి చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం పురోగతి సాధించవచ్చు… వెరసి అర్థమవుతున్నది ఏమిటి..? బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది… దేనికి..?
ఆ వోట్ల కోసం..! అందుకే రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో స్థానికుల వాటా తగ్గిపోయి, జనాభాలో అక్రమ వలసదారుల జనాభా శాతం పెరిగిపోతోంది… అదుగో, వాళ్ల వోట్లతో మమత గెలుస్తోంది… పక్కా జాతి వ్యతిరేకి… బంగ్లాదేశ్ అక్రమ వలసలకు ఊతం, కేంద్రంతో నిత్యం కయ్యం… ఇలాంటి నేతలే ఉగ్రవాదులకన్నా డేంజర్….
(నిన్నటికి సర్ ఫస్ట్ ఫేజ్ పూర్తి… 28 లక్షల వోటర్లు కనిపించడం లేదు)… (ఈ దేశంలోకి రాగానే అక్రమంగా ఆధార్ కార్డులు, రెవిన్యూ రేషన్ కార్డులు ఇప్పిస్తున్నారు, వాళ్ల వోట్లూ అక్రమమే, కానీ ఈ SIR ప్రక్రియలో వాళ్లను పట్టుకోలేం… అది శాశ్వత నష్టం…)
- కుహనా సెక్యులరిజం భ్రమల్లోని సీపీఎం అక్రమ వలసల్ని వ్యతిరేకించలేక, మమత ధాటికి కుదేలైపోయింది… టీఎంసీ, సీపీఎం రెండూ హైందవ వ్యతిరేకతే సెక్యురిజం అని నమ్ముతాయి కదా… అఫ్‌కోర్స్, ఈరోజుకూ దానికి తత్వం బోధపడలేదు…
- సో…. ‘సర్’ పకడ్బందీగా జరిగితే మమతకు కొమ్ముకాసే వోట్లు ఖల్లాస్… అందుకే మోడీ మొన్నామధ్య బీహార్ రిజల్ట్స్ తరువాత చెప్పాడు… నెక్స్ట్ బెంగాల్..!! దేశానికి మంచి సంకేతమే… మమత మార్క్ రౌడీ సెక్యులరిజానికి తెరపడుతుందా కాలం చెప్పాలిక..!!
అన్నట్టు… SIR అంటే దొంగమార్గంలో NRC అమలు చేయడమే అని మమత ఆరోపణ… రెండూ తప్పు కావు… పైగా అత్యవసరం..!!
Share this Article