హక్కుల స్వర్గధామం, అపరిమిత వ్యక్తిగత స్వేచ్ఛ, ఉపాధి అవకాశాలు అని ఊదరగొడుతుంటారు కదా బ్రిటన్ గురించి… అక్కడి కోటీశ్వరులు వెళ్లిపోతున్నారు వేలల్లో..! బ్రిటన్‌లో ఉండటానికి ఇష్టపడటం లేదు… అనేక అంశాల్లో నివసించడానికి అనువైన స్థలాలు వెతుక్కుంటున్నారు… 9500 మంది ఈ సంవత్సరంలో వెళ్లిపోతుంటే, ఈ సంఖ్య గత ఏడాదికన్నా డబుల్…
ఇండియాలో కూడా కోటీశ్వరులు నివసించడానికి ఇష్టపడటం లేదు, వేలల్లో వెళ్లిపోతున్నారు వేరేదేశాలకు అని బోలెడు వార్తలు రాసుకున్నాం, చదువుకున్నాం కదా… సరే, ఇక్కడ పరిస్థితులు వేరు… సోషల్ టెన్షన్స్, మౌలిక సదుపాయాల కొరత, వివక్షలు, ఒత్తిళ్లు, రాజకీయాలు, లంచగొండితనం, అక్రమాలు గట్రా చాలా కారణాలను వాళ్లు చెబుతూ ఉంటారేమో… మరి బ్రిటన్ నుంచీ ఎందుకు వెళ్లిపోతున్నట్టు..?
కోటీశ్వరులు ఇలా దేశం నుంచి వదిలిపెట్టిపోయే విషయంలో చైనా ఫస్ట్… ఈ సంవత్సరం 15,200 మంది వెళ్లిపోతున్నారు… గత ఏడాది 13,800 మంది… సరే, చైనా పరిస్థితి కూడా వేరు… ఒక్కసారి ఆ ప్రభుత్వానికి కోపమొస్తే చాలు, ఇక ధనికులపై బోలెడు ఆంక్షల్ని పెడుతుంది, రాచిరంపాన పెడుతుంది… ఉండలేని స్థితి క్రియేట్ చేస్తుంది… అలీ బాబా గ్రూప్ సిట్యుయేషన్ చూశాం కదా… అంత పెద్ద గ్రూపే తట్టుకోలేకపోతోంది…
Ads
ఇండియా నుంచి గత ఏడాది 5100 మంది వలస వెళ్లిపోగా ఈసారి 4300 మంది రెడీ అయిపోయారట… రష్యా, దక్షిణ కొరియా కూడా తక్కువేమీ కాదు… పలు దేశాల నుంచి ఇలా వలస వెళ్తున్నవారి సంఖ్య ఈసారి 1,28,000… దాదాపు గతేడాదితో సమానం… టాప్ 10 వలస బాధిత దేశాల్లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తైవాన్, వియత్నాం, నైజీరియా ఎట్సెట్రా…
సరే గానీ, ఎక్కడికి వెళ్తున్నారు..? అంటే, ఏ దేశాలు వాళ్లను ఆకర్షిస్తున్నాయి… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫస్ట్ ఈ విషయంలో… బయట ప్రపంచానికి ఈ దేశాల్లో ఆంక్షలు, చట్టాలు కఠినంగా ఉంటాయని అనిపిస్తుంది గానీ… విపరీతమైన గ్రోత్ ఈ దేశాల్లో… ఒకప్పటి ఈ ఎడారి దేశాలు అందరికీ బెటర్ డెస్టినేషన్ దేశాలయ్యాయి…
వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రా… జీరో ఇన్‌కమ్ ట్యాక్స్, గోల్డెన్ వీసాలు, కట్టుదిట్టమైన పాలన, లగ్జరీ లైఫ్ స్టయిల్, తక్కువ క్రైం రేట్, బెటర్ లా అండ్ ఆర్డర్… అన్నింటికీ మించి బెటర్ లొకేషన్… ప్రపంచం మధ్యలో ఉన్నయ్… ఎటు వెళ్లాలన్నా సరే వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్టులు… బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్ కమర్షియల్ యాక్టివిటీస్ అడ్డా… తరువాత ప్లేసు అమెరికా… నిజానికి ఆమెరికాకన్నా ఎమిరేట్సే రెట్టింపు సంఖ్యలో కోటీశ్వరులను ఆకర్షిస్తోంది… తరువాత సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా…
మంచి నివాసయోగ్య దేశాలుగా చెప్పుకునే ఇటలీ, గ్రీస్, స్విట్లర్జాండ్, పోర్చుగల్ కూడా కోటీశ్వరులకు బెటర్ రెసిడెన్సులుగా మారిపోతున్నాయి… చైనా నుంచి ఎక్కువగా జపాన్… రాబోయే సంవత్సరాల్లో ఈ వలస ఇంకా పెరగనుందట… ఉండటం ఏవో దేశాల్లో, వ్యాపారాలు వాళ్ల సొంత దేశాల్లో… ఒకనాడు ఎవరికీ పట్టని ఈ ఎడారి దేశాలు నేడు లివబుల్ కంట్రీస్‌గా జాగ్రత్తగా తమను తాము పునర్నిర్మించుకున్న తీరు నిజంగా విశేషమే…
Share this Article