నిజమే… ఓ మిత్రుడు అన్నట్టు… సంస్కారానికీ రాజకీయాలకూ శతృత్వం… అవెప్పుడూ దూరదూరంగానే ఉంటయ్… ప్రత్యేకించి అచ్చెన్నాయుడు వంటి కేరక్టర్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారం గురించి ఆలోచించే పనిలేదు… అదెప్పుడో పారిపోయి ఉంటుంది… ఇంత హార్ష్ కామెంట్ చేయడానికి కారణం ఉంది… అది తన ట్వీట్…! నిజంగానే ‘వైఎస్ వివేకాను ఎవరు చంపారు..?’ అనేది ఓ చిక్కు ప్రశ్నే… జగన్ కిక్కుమనలేని పరిస్థితి అనేదీ నిజమే… తన నోటి వెంట ఏ సమాధానమూ రాని దురవస్థ కూడా నిజమే… టీడీపీ దాన్ని రాజకీయంగా వాడుకుంటున్న మాట కూడా నిజమే… కానీ మొన్న ఓ స్టింగ్ ఆపరేషన్లో వైసీపీ టీం తన బట్టలు ఊడదీసిందనే కోపంతో రగిలిపోతున్న అచ్చెన్నాయుడు ఇక మర్యాద ముసుగులన్నీ తీసేసి అసలు రూపాన్ని ప్రదర్శించాడు… ఇలాంటి కేరక్టర్లను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి, చంద్రబాబు రేప్పొద్దున ఏం రాజకీయాల్ని చేయాలనుకుంటున్నాడో ఆయన ఇష్టం… ఫాఫం… ఫ్రస్ట్రేషన్ అందరినీ కమ్మేస్తున్నట్టున్నది… కమ్మేయడం అంటే… ఈ పదంలో కూడా ఓ కులాన్ని చూడకండి…
https://twitter.com/katchannaidu/status/1382215669232541697
Ads
చూశారు కదా… అచ్చెన్నాయుడు పరిణతి, స్థాయి ఏమిటో… మరీ డల్లాస్ బ్యాచ్ పంపిస్తున్న ట్వీట్లను యథాతథంగా పోస్ట్ చేస్తున్నట్టున్నాడు… ఏమో, పోస్ట్ చేసే కంట్రాక్టును కూడా డల్లాస్ బ్యాచుకే ఇచ్చినట్టున్నాడేమో… ‘‘తండ్రి శవం తందూరీ అయిపోతే…’’ అని కొన్ని పదాల్ని వాడాడు అచ్చెన్నాయుడు అనబడే కేరక్టర్… మరి మీ అన్న మరణం తాలూకు దృశ్యాలేమిటి నాయుడూ… మరిచిపోయావా..? ఆయన చెప్పుల్లోనే కదా తమరు కాళ్లు పెట్టి నాయకుడిగా మారింది… వైఎస్ శవం తందూరీ అయితే మీ అన్న శవాన్ని ఏమనాలి..? ఎందుకీ దిగజారుడుతనం..? సరే, వైసీపీ సోషల్ బ్యాచుకు సిగ్గూసంస్కారం లేవు సరే… మరి నీ సంస్కారం ఎక్కడేడ్చినట్టు..? ఇదేనా మీ చంద్రబాబు మీకు నేర్పిన రాజకీయం..? ఇదేనా తెలుగుదేశం పాలిటిక్స్ స్థాయి..? ఎవరు సిగ్గుపడాలి..?
ఒకరి మరణం మీద ఇంత దారుణమైన ట్వీట్ చేయడం అంటే… అది సంస్కారరాహిత్యంగా కాదు… ప్రస్తుత దరిద్ర మనస్థితికి తార్కాణంగా భావించాలేమో… లోకేష్ అనే కేరక్టర్ ఏదో సవాల్ విసరగానే…. ఓ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి గడగడా వణికిపోతూ… తను చెప్పిన చోటికి హుటాహుటిన వచ్చేసి, ప్రమాణాలు చేయాలా..? రేప్పొద్దున ఎవరో ఓ కోన్కిస్కా వార్డు మెంబర్ లెవల్ లీడర్…. తన అన్న మరణానికి తాను కారణం కాదని, చంద్రబాబు పాత్ర ఏమీ లేదని అచ్చెన్నాయుడు ప్రమాణం చేయాలి, వెంటనే కాణిపాకం వచ్చేయాలి అని సవాల్ విసిరితే వచ్చేస్తాడా..? రాకపోతే ఇక అన్న గారి మరణబాధ్యుడు తనే అని తీర్మానించేయాలా..? చివరగా :: వివేకా హత్య జరిగినప్పుడు రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్నది సోకాల్డ్ అచ్చెన్నాయుడు అండ్ హిజ్ బాసే కదా… ఎవడు హంతకుడు అని ఎందుకు వెల్లడించలేదు..?! ఇప్పుడు #whokilledbabai అనే వ్యర్థ ప్రేలాపనలు ఏల..?!
Share this Article