Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!

July 1, 2026 by M S R

.

మొన్న కాలం చేసిన ప్రఖ్యాత దర్శకుడు భాగ్యరాజా గురించి మీడియా అనేక కథనాలు వెలువరించింది… ప్రత్యేకించి తన స్క్రిప్టు రచన నైపుణ్యం గురించి…! మధ్యతరగతి ప్రేక్షకుల మన్ననలు పొందిన తన సినిమాల గురించి..! ఒకరకంగా తమిళ మీడియాకు దీటుగా తెలుగు మీడియా కూడా ఘనంగా నివాళ్లు అర్పించింది… అర్హుడే… మనకూ పరిచయస్తుడే..!

తన గురించిన వివరాలు చదువుతుంటే, పాత ఇంటర్వ్యూలు కూడా తిరగేస్తుంటే… ఆకట్టుకున్న అంశం… ‘మేం మా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం’… అని భాగ్యరాజా చెప్పడం! ఎందుకంటే..? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంలోనిదే… చెన్నైలోనూ తమిళులకు దీటుగా తెలుగు జనాలు… కానీ తెలుగు మీద ఓ వివక్ష…

Ads

తెలుగువారిగా ఐడెంటిఫై కావడానికే చాలామంది ఇష్టపడేవాళ్లు కాదు, ఇబ్బంది… ప్రత్యేకించి రాజకీయాలు, సినిమా రంగాల్లో తెలుగు వాళ్లను సహించేవాళ్లు కాదు.., అలాంటిది ఓ పేద కుటుంబంలో పుట్టి, అవకాశాల కోసం చెన్నెలో ఇల్లిల్లూ తిరిగినా, భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసినా… తెలుగు ఐడెంటిటీని దాచుకునే ప్రయత్నం చేయకపోవడం నచ్చింది…

మరో విషయం ఏమిటంటే..? తమిళనాడులో సినిమాలు- రాజకీయాలు జంట కవలలు కదా… పరస్పరం ప్రభావితం చేసుకునేవి కదా… తను కూడా ఓ పార్టీ పెట్టాడు… పార్టీ పేరు “ఎంజీఆర్ మక్కల్ మున్నేట్ర కజగం” (MGR Makkal Munnetra Kazhagam)… దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ (MGR) మరణానంతరం తన లెగసీని వాడుకునే భావనతో  1989లో ఈ పార్టీని ప్రారంభించాడు… పార్టీ డిజాస్టర్… 1991లో తను పోటీ చేస్తే 87 వోట్లు వచ్చాయట!! తరువాత అన్నాడీఎంకేలో చేరిక, తరువాత డీఎంకేలో చేరిక… పొలిటిషియన్‌గా ఫ్లాప్..!

మరిన్ని వ్యక్తిగత అంశాలూ ఇంట్రస్టింగే… తనది ఆంధ్రా కుటుంబం… ఆంధ్రా నుంచి తరలిపోయి ఈరోడ్ జిల్లా (అప్పట్లో కోయంబత్తూరు) గోబిచెట్టిపాళ్యం సమీపంలోని ‘వెల్లాంగోయిల్’ గ్రామంలో స్థిరపడ్డారు… పేద కుటుంబమే, తండ్రి కృష్ణస్వామి ఒక దశలో కూలీ అట… తల్లి అమరావతి…

తన మొదటి భార్య సంగతి చూద్దాం… పేరు ప్రవీణ… భాగ్యరాజాలాగే చిన్నాచితకా అవకాశాలు కోసం కష్టపడిన రోజుల్లోనే ఇద్దరికీ పరిచయం… ఆమె మూలాలు కూడా ఆంధ్రా… బహుశా చౌదరీలు… అలా కనెక్టయ్యారు… ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు, కలిసే ఎదిగారు… ఈలోపు ప్రణయం చిగురించింది… పెళ్లి కూడా చేసుకున్నారు, అందరినీ ఒప్పించి!

కానీ పెళ్లయ్యాక రెండేళ్లకే కామెర్లతో కన్నుమూసింది పాపం ఆమె… అప్పటికి ఆమె పాతికేళ్లే… ఐతే ఆమె మరణించిన కొన్నాళ్లకే భాగ్యరాజా ముంబైలో పుట్టిన పూర్ణిమా జయరాంను పెళ్లి చేసుకున్నాడు… ఈమె మాయలో పడి మొదటి భార్యను చంపేశాడనే వదంతులు, ప్రచారం కూడా సాగింది… తనేమీ స్పందించలేదు… పూర్ణిమతో సంబంధాలు పెరిగాకే ప్రవీణను నిర్లక్ష్యం చేశాడంటారు…

భాగ్యరాజా

పూర్ణిమ జయరాం మనకు తెలిసిన మొహమే… చిరంజీవి సినిమా మంత్రిగారి వియ్యంకుడులో హీరోయిన్… తరువాత ఏదో ఒక తెలుగు సినిమా చేసినట్టుంది, అంతే… భాగ్యరాజాను పెళ్లి చేసుకున్నాక నటించలేదు… ఆమె ముంబైలో పుట్టినా తమిళ బ్రాహ్మణ కుటుంబమే వాళ్లది.., ఈమెతో పరిచయం, ప్రణయం, సంబంధాలు పెరుగుతున్న దశలోనే మలయాళ నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పన తదితరులతో ప్రేమాయణం సాగించాడనే ప్రచారమూ ఉంది… వాళ్లకు తన సినిమాల్లో అధిక ప్రాధాన్యం, అవకాశాలు ఇచ్చేవాడట…

Bhagyaraja

ఎలాగైతేనేం… పూర్ణిమను పెళ్లాడాడు… ఇద్దరు పిల్లలు… కొడుకు శంతను… తనను హీరోను చేయాలని భాగ్యరాజా చేయని ప్రయత్నం లేదు… పెట్టని ఖర్చు లేదు… సినిమాలు తీసినా ఫ్లాపులు… చివరకు వెబ్ సీరీస్ గట్రా చేసుకుంటున్నాడు… కోడలు యాంకర్ కీర్తన. ఆమె కూడా ఇండస్ట్రీలోనే ఉంది… కూతురు పేరు శరణ్య, ఆమె కూడా ఇండస్ట్రీలోనే ఉంది… ఇదీ భాగ్యరాజా కథ!! తన విజయగాథలకు ఇది అపజయాల కోణం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘God Of War’… నాగవంశీ కొత్త మంట … ‘God Of South & North War’
  • భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!
  • ఆచితూచి యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు– ఎటొచ్చీ చిరంజీవి భార్య పేరుతోనే..!!
  • 95 ఏళ్ల వయస్సు దాకా… భారతీయ గుండెలకు అవిశ్రాంత సేవ..!!
  • “కొలై పండ్రాంగప్పో” – కరుణానిధి అరెస్టు రాత్రి అసలేం జరిగింది?
  • నిధి దొరికింది! ‘మనిషి ఆశ’ల్లో ఇరుక్కుంది! ఎవరు సొంతదారు!!
  • వెలుగు వివేక్‌కు అభినందనలు – హరీష్ రావుకు ప్రత్యేక ప్రశంసలు
  • SIR, భిక్షగాళ్లకు ఓట్లున్నాయా..? వారు ఓటు హక్కు‘అడుక్కోవడం’ ఎలా..?
  • 20 ఏళ్ల స్పీడ్- సక్సెస్‌ఫుల్ జర్నీ – మిడ్జిల్ జెడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా!!
  • సౌందర్య ఆ పాట ఒప్పడమే గొప్ప – ఈ దర్శకుడు పెద్ద ‘మాయలోడు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions