Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో బాలయ్య పక్కన… ఓ అశ్వని… ఓ ఊర్వశి… పాత చింత కథ..!!

June 30, 2025 by M S R

.

Subramanyam Dogiparthi  ఈ భలే తమ్ముడి కధ ఆ పాత భలే తమ్ముడు ఎన్టీయార్ కధ ఒకటి కాదు . యన్టీయార్ భలే తమ్ముడు ఫుల్ క్రైం మూవీ . ఈ బాలకృష్ణ భలే తమ్ముడులో క్రైంతో పాటు ఫేమిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది .

పరుచూరి బ్రదర్స్ కధ , స్క్రీన్ ప్లే , డైలాగులతో పాటు దర్శకత్వం కూడా వహించారు . బాలకృష్ణని బాగానే ఎలివేట్ చేసారు . కధాంశం రొటీన్ దుష్టశిక్షణే అయినా మలుపులు పరుచూరి వారి మోడల్లో ఉంటాయి .

Ads

అన్న కానిస్టేబుల్ , తమ్ముడు సబ్ ఇనస్పెక్టర్ . తమ్ముడు విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్ . ఊళ్ళో పెద్దమనుషుల అరాచకానికి అన్న కొడుకుని పోగొట్టుకుంటాడు . ఉద్యోగానికి రాజీనామా చేసి బడాబాబులను చట్టానికి పట్టిస్తాడు .

గుడ్డివాళ్ళని నేరాలకు ఉపయోగించుకోవటం కొత్తగా ఉంటుంది . ఇప్పుడు కుబేర సినిమాలో బిచ్చగాళ్ళని ఎంచుకోవడం వంటిదే ఈ భలే తమ్ముడు సినిమాలో గుడ్డివాళ్ళని ఎంచుకోవడం . విధవా వివాహాలను సమర్ధిస్తూ కొన్ని సీన్లు పరుచూరి మార్కుతో ఉంటాయి .

బాలకృష్ణ నుండి మంచి నటనను రాబట్టుకున్నారు . కధానాయికగా ఊర్వశి చలాకీగా నటించింది . అశ్విని , జ్యోతి , ప్రభ , జయమాలిని , విలన్లుగా నూతన్ ప్రసాద్ , గొల్లపూడి మారుతీరావులు , అన్నగా చంద్రమోహన్ , ఇతర పాత్రల్లో రంగనాథ్ , ప్రభాకరరెడ్డి , రాళ్ళపల్లి , నాగేష్ , సాక్షి రంగారావు , కాకరాల , చలపతిరావు , రాంజీ , శ్రీలక్ష్మి , ప్రభృతులు నటించారు . మాస్టర్ అర్జున్ గుర్తుండిపోతాడు .

సినిమా బాగానే ఆడటానికి కారణం చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు , నృత్య దర్శకుడు శివశంకర్ డాన్సులు . దొంగ రాముడు సినిమాలో రారోయి మాఇంటికి పేరడీ పాట జయమాలిని , బాలకృష్ణ మీద బాగుంటుంది . రారోయి మా క్లబ్బుకు మామా అంటూ సాగుతుంది . జయమాలిని డాన్స్ గురించి చెప్పేదేముంది .

ఈ సినిమాకు ముందు బాల నటిగా అరంగేట్రం చేసిన అశ్విని మొదటిసారిగా సపోర్టింగ్ పాత్రలో బాలకృష్ణతో ఒక డ్రీం సాంగులో నటించింది . గాలికి రేగిన అందం అంటూ సాగే ఈ పాటలో అశ్విని డాన్స్ చాలా అందంగా చిత్రీకరించారు . రాఘవేంద్రరావు ఆవహించి ఉంటాడు .

మరో డ్యూయెట్ ఊర్వశితో అమ్మా అమ్మా ఏమ్మా ఏమ్మా హుషారుగా ఉంటుంది . అన్న గారి అలక అంటూ సాగే ఫేమిలీ సాంగ్ సెంటిమెంటల్గా బాగుంటుంది . బాలకృష్ణకు పరుచూరి బ్రదర్స్ బాగా పదునుగా ఉండే డైలాగులను వ్రాసారు .

మొదట స్లోగా ఉన్నా తర్వాత తర్వాత ఊపందుకుంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకు ముందు చూసి ఉండకపోతే బాలకృష్ణ అభిమానులు తప్పక ట్రై చేయవచ్చు . It’s a family sentimental , action oriented , feel good entertainer . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?
  • అవునూ.., హీరో మెటీరియల్ ఏంటి తల్లీ..? ఈ చెత్తా ప్రశ్నలే జర్నలిజమా..?!
  • రిషబ్‌ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
  • చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
  • “యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
  • మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…
  • బ్లేమ్ గేమ్… బీసీ రిజర్వేషన్లపై పార్టీల పరస్పర నిందాపర్వం…
  • కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…
  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions