జస్ట్, 20- 25 నిమిషాలు చూసి ఉంటానేమో… పర్లేదు అనిపించింది… కాదు, సరిగ్గా ఇలాంటి వెబ్ సీరీస్‌లే ప్రస్తుతం అవసరమేమో అనిపించింది… ప్రత్యేకించి మహిళా ప్రేక్షకులకు..! వెబ్ సీరీస్ అని ఎందుకంటున్నానంటే… భామాకలాపం ఫస్ట్ పార్ట్ హిట్ అట… ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులు బాగా చూస్తున్నారట… మూడో పార్ట్ కూడా ఉంటుందని చివరలో హింట్ కూడా ఇచ్చారట… అదీ హిట్టయితే ఫోర్త్ పార్ట్… అందుకే సీరీస్ అన్నాను… కాకపోతే సినిమాల సీరీస్…
బాగా చూస్తున్నారట కాదు, చూస్తున్నారు, నేనూ అలాగే కాసేపు చూడబడ్డాను… ఆహా ఓటీటీలో ఉంది, ప్రైమ్, హాట్‌స్టార్ ఓటీటీల్లో ఉంటే ఇంకా రీచ్ పెరిగి, మరింత మంచి పేరు వచ్చేదేమో… అంటే సినిమా చాలా బాగుందని కాదు, పర్లేదు… ఎందుకు మెచ్చుకోవాలీ అంటే… అసభ్యత లేకపోవడం, దర్శకుడు ఎక్కడా వెకిలితనాన్ని ఆశ్రయించకపోవడం… మామూలుగా వెబ్ కంటెంట్ అనగానే బూతులు, వెగటు సీన్లు ఉండాలనే భ్రమ ఒకటి వ్యాపించి ఉంది కదా… కానీ భామాకలాపంలో ఆ తలతిక్క పైత్యం లేదు…
మన టీవీ సీరియళ్లు తెలుసు కదా…. పరమ చెత్త కంటెంట్, సాగతీత… దరిద్రపు కథనాలు… అవి ఒకరకంగా మహిళా ప్రేక్షకుల మనస్సుల్ని పొల్యూట్ చేస్తున్నాయి… వాటికన్నా ఇదుగో భామాకలాపం వంటి సినిమాలు, జానర్లు చాలా చాలా మేలు… కాస్త కామెడీ మిళాయించి, మరర్ల మీదుగా, చోరీల దాకా స్క్రిప్టు సాగుతుంది… సరే, కొన్ని సీన్లు అంతగా కనెక్ట్ కాలేకపోయినా సరే, బోర్ రాదు, చల్తా… చెత్తా టీవీ సీరియళ్ల నుంచి జనం విముక్తం కావాలంటే ఇలాంటి సినిమాల జోరు పెరగాలి…
Ads
ఈ సినిమాలకు సోకాల్డ్ స్టార్ హీరోల బాపతు అట్టహాసాలు, గ్రాఫిక్కులు, సూపర్ హీరోయిజాలు, భజనలు గట్రా ఏమీ ఉండవు… కథ చుట్టే సీన్లు తిరుగుతాయి, డీవియేషన్ ఉండదు… ఎక్కడా ఎవరినీ అతిగా ఫోకస్ చేయడమూ ఉండదు… స్ట్రెయిట్, ప్లెయిన్ స్టోరీ టెల్లింగ్… (కాకపోతే అప్పట్లో వెంకటేశ్, రానా తీసిన ఓ బూతు సీరీస్ వచ్చింది కదా, అలాంటి వాటితో కాస్త జాగ్రత్త… అంతే…)
చూసిన కాసేపూ దర్శకుడికి రెగ్యులర్ థియేటర్ బాపతు పెద్ద సినిమా తీసే సామర్థ్యం ఉన్నట్టే అనిపించింది… ప్రత్యేకించి బీజీఎం బాగుంది… ఇలాంటి వెబ్ కంటెంటుతో మరో ప్రయోజనం… పెద్ద డైలాగుల్ని కూడా పెట్టేయగలగడం, ఫీచర్ ఫిల్మ్స్‌లో కష్టం… ఓచోట ఓ అధికారి ప్రియమణిని ఉద్దేశించి… ‘‘ఓ అడవిలో ఓ సాధువు వెంటబడింది సింహం… దేవుడా నన్ను రక్షించు అని వేడుకుంటూ సాధువు పరుగెడుతున్నాడు… కాసేపటికి సింహం తనను తినేసింది, దేవుడి దగ్గరకు వెళ్లాక సాధువు కోపంగా అడుగుతాడు, ఎప్పుడూ నిన్నే పూజిస్తాను, నన్ను రక్షించమంటే రాలేదేం అని… దేవుడంటాడూ, సింహానికి నెలరోజులుగా తిండి లేదు, నన్ను వేడుకుంటూనే ఉంది, అడుగుతూనే ఉంది… నువ్వు దొరికావు, నాకు వేరే చాయిస్ లేదు అంటాడు… కానీ నీకు రెండు చాయిస్‌లు ఉన్నాయి ఇప్పుడు…. ఇలా సాగుతుంది డైలాగ్…
సరే, ఆ కథను సినిమా కథకు ఎలా వర్తింపజేశారో తెలియదు గానీ… ఇలాంటి జానర్లలో ఇంతటి డైలాగులు సాధ్యం కావు సాధారణంగా… సరే, ప్రియమణి బాగా నటించినట్టు కనిపిస్తూనే ఉంది… మంచి నటి, ఆమెకు ఢోకా ఏముంది..? అలవోకగా చేసేసినట్టుంది… అంబాజీపేట మ్యారేజీ బ్రాండ్ సినిమాలో అదరగొట్టిన శరణ్య కనిపిస్తోంది కదాని ఆ కాసేపు చూశాను నిజానికి… ప్రియమణికి దీటుగా చేసింది, పైగా కృతకంగా లేని తెలంగాణ యాక్సెంట్… గుడ్… (రోజూ హోటల్ చుట్టూ తిరుక్కుంట పుక్కట్ల కాఫీ తాగుతలేవా, ఇదీ గట్లనే అనుకో అని ఓచోట శరణ్య డైలాగ్… పర్‌ఫెక్ట్ డిక్షన్…) (ఇది భామాకలాపం-2 రివ్యూ కానే కాదు… చూసిన కాసేపు సినిమా మీద అప్పటికప్పుడు ఏర్పడిన ఓ అభిప్రాయం)
Share this Article