.
ఆ ప్రేమించు పెళ్ళాడు సిన్మాలో ‘‘ఈ చైత్ర వీణా’’ అన్న పాటలో ఒక బీజీఎమ్‌లో కెమెరా ఆ పాపికొండలు మొత్తం కలతిరుగుతా వుంటే కెమెరా ముందు భానుప్రియ.
ఆ సాయంత్రం మద్రాసు నించొచ్చినా జెమ్ మూవీస్ అవుట్‌డోర్ యూనిట్నుంచొచ్చినా నలభై అడుగుల ఎత్తున్న క్రేన్ ముందు చెక్కల్తో తయారు చేసి కట్టినా చిన్ని ప్లాట్‌ఫారమ్మీద భానుప్రియని కూర్చోబెట్టేకా ఆ క్రేన్ని రొటేట్ చేస్తా షూట్ తీస్తావుంటే పెళ పెళ మంటా గోదారి గాల్లో కల్సిన చప్పుళ్ళు.
Ads
చూస్తే
విరిగిపోతున్న చెక్కల ప్లాట్‌ఫారం. నీళ్ళలో పడిపోయినా హీరోయిను భానుప్రియ.
యూనిట్లో అంతా అరుపులు. ఆ భానుప్రియ తల్లి పొలికేకలు.
చాలా ఇరుకైన అక్కడ గోదారి లోతు ఎన్ని వందల అడుగులో ఎవరూ లెక్కట్టలేదు. ఇంకసలు విషయం చెప్పాలంటే ఈ నీళ్ళడుగున ఊబి. అందులో దిగడినోళ్ళు బయటికి రావడం కనాకష్టం.
యూనిట్లో జనాలంతా ఒకటే అరుపులూ పొలికేకలు.
ఇలాక్కొన్ని నిమిషాలు గడిచేక ఆ నీళ్ళలోంచి పైకి లేచిన భానుప్రియ ఒడ్డుకొస్తే ఆ మనిషిని పైకి లాగిన జనాల్లో నేనూ వున్నాను.
పంట్ మీద పడిపోయున్న మనిషి దగ్గర కొచ్చి పక్కనే కూర్చున్నేను తన్నే చూస్తా ‘‘బానే వున్నావు గదా?’’అన్నాను.
అప్పటికి కొన్నేళ్ళ నించి మాటాడుకోడం లేదు. మేం మాటాడకుండానే ఒక అసిస్టెంటుని పెట్టుకుని ఆ మనిషితో తన్నించి నాకెలాంటి పర్‌ఫార్మెన్స్ కావాలో చెప్తుంటే వింటున్న తను నేనడిగినట్టు చేస్తుంది. ఇలాగే సిన్మాలో నటనంతా అలా తీసుకున్నదే.
అలాగిన్నాళ్ళు గడిచేకా ‘‘బానే ఉన్నావు గదా?’’ అన్నీ ప్రశ్న ఆల్మోస్ట్ నలభై రోజుల తర్వాతేసింది. నా మాటకి తనలో ఎలాంటి శక్తి వచ్చిందో గానీ లేచి కూర్చుంది తప్ప నా ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పలేదు.
అదంతా తల్చుకుంటుంటే ఎవరూ నా దగ్గర కొచ్చింకేం అడగలేదు. తీరా వచ్చి అడిగితే ఏం చెపుదునో గానీ నిన్న గాక మొన్న పరిచయమైన ఆళ్ళెవరూ నా దగ్గరకి రాలేదు…
……. ఆనాటి ఇన్సిడెంటు గురించి డైరెక్టర్ వంశీ స్వయంగా తను ఫేస్‌బుక్‌లో రాసుకున్నదే ఇదంతా… నిజం…
Share this Article