Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలయ్యతో జతకట్టిన మందాకిని… ఆరబోతలో విజయశాంతితో పోటీ…

October 4, 2025 by M S R

.

Subramanyam Dogiparthi … BalaKrishna-centric commercial , action , mass masala entertainer . 1987 సంక్రాంతి సంబరాల్లో వచ్చిన మరో హిట్ సినిమా ఈ భార్గవరాముడు . రావు గోపాలరావు నిర్మాత కూడా .

కొమ్మనాపల్లి గణపతిరావు గారి కధకు మెరుగులు దిద్ది డైలాగ్స్ వ్రాసారు పరుచూరి బ్రదర్స్ . అంతే కాదు పరుచూరి గోపాలకృష్ణ అరుపులు కూడా దండిగానే ఉంటాయి సినిమాలో . స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డి పాటల్లో తన మార్కుని ప్రస్ఫుటంగా చూపారు .

Ads

వీళ్ళందరి తర్వాత మెచ్చుకోవలసింది కాస్ట్యూమ్స్ కృష్ణని … విజయశాంతి , మందాకిని డాన్స్ కాస్ట్యూమ్సులను చాలా చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేసారు . వరూధినిగా కానివ్వండి , క్లైమాక్సులో ఇద్దరు హీరోయిన్ల డాన్సులో కానివ్వండి చాలా చక్కటి కాస్ట్యూమ్స్ . ఆ తర్వాత నృత్య దర్శకుడు సలీంని మెచ్చుకోవాలి . డాన్సుల్ని అద్భుతంగా కంపోజ్ చేసారు .

కధ ఎప్పటిలాగే రివెంజ్… ఇంజనీరుగా ప్రభుత్వ విభాగంలో జాయినయ్యి ఓ కేంద్ర మంత్రి గారిని , ఓ వ్యాపారస్తుడిని , వారిద్దరి చెంచా గాళ్ళని ఎదుర్కొంటాడు హీరో బాలకృష్ణ భార్గవరాముడి పాత్రలో . ఆ క్రమంలో జైలుకు వెళ్లి అక్కడ తండ్రిని కలిసి ఇద్దరికీ విలన్లు కామనే అని తెలుసుకుంటాడు . జైలు నుంచి బయటకొచ్చాక రెబెల్ హీరో అయిపోయి విలన్లను తుదముట్టిస్తాడు . ఈ యజ్ఞంలో మరో హీరోయిన్ మందాకిని సహాయపడుతుంది . అందరూ కలిసి విలన్లను తుదముట్టించేస్తారు .

mandakini
పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ పదునుగా ఉంటాయి . గాంధీ సంఖ్యల్ని పెంచాలి గానీ గాడ్సే సంఖ్యల్ని కాదు పెంచాల్సింది వంటి డైలాగుల్ని 1987 కాబట్టి పెట్టారు . ఇప్పుడు పెట్టాలంటే కాస్త వెనకాముందు చూసుకోవాల్సిందే . విజయశాంతి , మందాకిని మధ్య ప్రేమాభిషేకంలో జయసుధ , శ్రీదేవిల సంవాదం వంటిది ఉంటుంది . అంతగా పేలలేదు కానీ , బాగానే ఉంటుంది .

కేంద్ర మంత్రిని చాలా సులువుగా ఉతుకుతుంటాడు హీరో . ఇప్పుడు MLA మీదకు పోవాలన్నా చుట్టూ మందీ మార్బలం చాలామంది ఉంటారు . కోట శ్రీనివాసరావు డైలాగ్ డెలివరీ అదుర్స్ . గొల్లపూడి మారుతీరావుని డామినేట్ చేసి పడేసాడు .

వేటూరి వారి పాటల్ని చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , శైలజలు శ్రావ్యంగా పాడారు . ఆనందం బ్రహ్మ అనురాగం బ్రహ్మ అంటూ సాగే నృత్య గీతం వరూధిని ప్రవరాఖ్యుల మీద చాలా బాగుంటుంది . అలాగే క్లైమాక్సులో విజయశాంతి , మందాకినిల మీద విలన్ల బంగళాలో డాన్స్ పాట కాలచక్రమున అంటూ సాగుతుంది . బాగుంటుంది .

nbk

బాలకృష్ణ , విజయశాంతి డ్యూయెట్ మన్మధ నామ సంవత్సరం నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం బాగా చిత్రీకరించాడు కోదండరామిరెడ్డి . అల్లుకోరా అందగాడా , వయ్యారమా నీ యవ్వారమేమో అనే రెండు డ్యూయెట్లు బాలకృష్ణ , మందాకిని మీద అదిరిపోతాయి .

ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , జగ్గయ్య , చలపతిరావు , రమణారెడ్డి , చంద్రమోహన్ , ముచ్చెర్ల అరుణ , రంగనాధ్ , సుత్తి వేలు , ఈశ్వరరావు , హరనాధరావు , ప్రభృతులు నటించారు . చంద్రమోహనుకు తగిన పాత్ర లభించలేదు .

మొత్తం మీద సినిమాలో ఆలస్యంగా ప్రత్యక్షమయినా మందాకిని విజయశాంతితో పోటీ పడుతుంది . బాలకృష్ణ-సెంట్రిక్ సినిమాల పరంపరలో వచ్చిన ఈ హిట్ సినిమా యూట్యూబులో ఉంది . తరచూ టివిలో వస్తూనే ఉంటుంది . బాలకృష్ణ అభిమానులు చూసి ఉన్నా మళ్ళా చూడొచ్చు . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions