Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘భార్యాబిడ్డల’ ‘బతుకుతెరువు’ కోసం ఓ అబద్ధం… సూపర్ హిట్…

May 24, 2024 by M S R

Subramanyam Dogiparthi…… ఆకులు పోకలు ఇవ్వొద్దూ , నా నోరు ఎర్రగ చేయొద్దు , ఆశలు నాలో రేపొద్దు , నా వయసుకు అల్లరి నేర్పొద్దు . భార్యాబిడ్డలు సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆత్రేయ వ్రాసిన ఈ పాటే . నాకు చాలా ఇష్టమైన పాట . ఈ పాటలో నాగేశ్వరరావు , జయలలితల డాన్స్ కూడా నాకు భలే ఇష్టం . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే .

ఈ సినిమాలో పాటలన్నీ ఆత్రేయ ఒక్కరే వ్రాసారు . అందమైన తీగకూ పందిరుంటే చాలునూ పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించీ సాగుతుంది చినదానా , చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కు లేని చుక్కలయినామూ , వలచీనానమ్మా , చల్ మోహన రంగా పాటలు హిట్టయ్యాయి .

1972 లో వచ్చిన ఈ సినిమా నాగేశ్వరరావు , జయలలితలది . భార్యాబిడ్డలని , కుటుంబాన్నీ పోషించుకోవటానికి ఓ నిరుద్యోగి అబధ్ధంతో ఉద్యోగం సంపాదించుకుని ఇరుక్కుపోతాడు . చక్కటి కుటుంబ కధాచిత్రం . Feel good , ఎమోషనల్ , మ్యూజికల్ హిట్ . ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్లో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు తాతినేని రామారావు .

Ads

విశేషం ఏమిటంటే ఈ సినిమాకు ఆధారమయిన 1953 లో వచ్చిన బతుకుతెరువు సినిమాలో కూడా నాగేశ్వరరావే హీరో . అందులో సావిత్రి , శ్రీరంజని , SVR నటించారు . ఈ 1953 సినిమాను బలే రామన్ టైటిల్ తో తమిళంలో కూడా తీసారు . తర్వాత రోజుల్లో జీనే కీ రాహ్ టైటిల్ తో యల్ వి ప్రసాద్ జితేంద్ర , సంజీవ్ కుమార్ , తనూజలు నటించారు . ఈ హిందీ సినిమాకు కూర్పులూ మార్పులూ చేసి భార్యాబిడ్డలుగా తీసారు . అన్ని సినిమాలు హిట్టయ్యాయి .

భార్యాబిడ్డలు సినిమాలో జగ్గయ్య పాత్ర బాగుంటుంది . కృష్ణకుమారి , గుమ్మడి , రాజబాబు , హేమలత , సూరేకాంతం , సుమ , అల్లు రామలింగయ్య , మాస్టర్ విశ్వేశ్వరరావు ప్రభృతులు నటించారు . మరో విశేషం అతిలోకసుందరి శ్రీదేవి నాగేశ్వరరావు చెల్లెలుగా , బాగా నటించింది .

కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . ఒకటి రెండు సార్లు టి విలో కూడా చూసా . మంచి సినిమా . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . నాగేశ్వరరావు , జయలలిత జంట అందంగా ఉంటుంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబులో . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొమ్మూరి యుగంధర్ – అప్పట్లో పాఠకుల్ని ఉర్రూతలూగించిన పేరు !!
  • రేవంత్ ప్రయత్నాలకు ఫడ్నవీస్ పాజిటివ్- ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తాడో ..!?
  • మొద రాత్రి! ఇది కేయాస్ నేరేటివ్… అంటే గందరగోళమే కథ ముడిసరుకు!!
  • నల జిలుకర మొగ్గ – కాలంతోపాటు మారితేనే ఏ కళకైనా మనుగడ !!
  • వడివేలు వంద కోట్ల భవనం.. కుటుంబం కోసమా? సంపదకు భద్రతా?!
  • గజబ్ రాత్ ! కథ గజబ్… కథనమే గజిబిజి… అనేక మలుపుల చిక్కుముడి !!
  • అల్లుడు అలిగాడు… రచ్చకెక్కిన రాధాకృష్ణ ఇంటి కలహాలు… కానీ..?
  • చిరంజీవిని వద్దన్నారు – ఓ కొత్త నటుడిని పట్టుకొచ్చారు… కానీ..?
  • పర్లేదు.., పండించండి – మత్తు కోసం అమ్మితే మాత్రం జైలే..!!
  • కాళేశ్వరం ఓ డిజాస్టర్ – ఓ బ్లండర్ … నిజం తేల్చేసిన నిపుణుడు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions