Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భీమినేని విష్ణుప్రియ… తన ఒరిజినల్ రూపం, గుణం చూపించింది…

October 28, 2024 by M S R

విష్ణుప్రియ… మంచి ప్యాకేజీతో హౌజులోకి అడుగుపెట్టింది… బిగ్‌బాస్ టీమ్‌ ఆమె పాపులారిటీని అంచనా వేయడంలో తప్పుటడుగు వేసింది… ఆమే విజేత అవుతుందనేంత సీన్‌తో పట్టుకొచ్చింది… నాగార్జున కూడా కళ్లుమూసుకుని బిగ్‌బాస్ టీమ్ చెప్పింది నమ్మి ఆమెను విపరీతంగా ప్రేమించేస్తున్నాడు వీకెండ్ షోలలో…

ఫాఫం, ఆమె ఫెయిర్, డొల్ల, భోళా… తన గురించి తనే చెప్పుకుంది… నాది నత్తి బ్రెయిన్ సార్ అని… తనేమిటో తనకు తెలుసు ఫాఫం… ఇన్ని రోజులూ కాస్త అర్థమయ్యీ కానట్టుగా ఏదో మేనేజ్ చేసింది… వోట్లు కూడా పడుతున్నాయి పాపం… సేవ్ అయిపోతూ వస్తోంది…

బిగ్‌బాసోడు చెప్పాడు కదాని పృథ్వితో లవ్వాట కూడా ఆడుతోంది… ఆమె టెంపర్‌మెంట్‌కు పృథ్వి జస్ట్ ఓ ఆఫ్టరాల్… పైగా తనొక మెంటల్ కేసు… ఏదో ఆట కోసం ఈ లవ్వు ప్రహసనం… నటి కదా, నటిస్తుంది… ఈసారి మెగా చీఫ్ అయిపోయింది కదా… బిగ్‌బాస్ గాడు ప్రేమతో ఆమెకు ఫుల్లు పవర్స్ ఇచ్చేశాడు, గతంలో బిగ్‌బాస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా… ఒక చెత్త గేమ్ ఆడేది ఈసారి ఎవరంటే..? జస్ట్, బిగ్‌బాస్ గాడే…

Ads

ఆమె మెగా చీఫ్ అట… ఐదుగుర్ని ఆమే నామినేట్ చేసి, జైలులో వేసేయాలట… ఇంకా నయం, బౌన్సర్లను రప్పించి థర్డ్ డిగ్రీ ఇప్పించలేదు… చెత్తా బిగ్‌బాస్ టీమ్ ప్లాన్… ఆమె ఏం చేసింది…? పక్కాగా తన నిజస్వరూపం ఏమిటో, తన మందబుద్ధి ఎంతో స్పష్టంగా బయటపెట్టుకుంది… ఎస్, అదే, నత్తి బ్రెయిన్… (చూస్తూ ఉండండి, వీకెండ్‌లో నాగార్జున మళ్లీ విపరీతంగా ప్రేమిస్తాడు…)

ఆమె ఐదుగురిని ఫటాఫట్ నామినేట్ చేసి పారేసింది… అందులో ఫస్ట్ గౌతమ్ కృష్ణ… ఇదే గౌతమ్ ఆమె మెగా చీఫ్ కావడానికి ప్రధాన కారకుడు… మరి ఆమెలో విశ్వాసం ఏముంది..? తనను నామినేట్ చేయడంలో స్ట్రాటజీ ఏముంది..? అలాగే నబీల్‌ను చేసింది… సరే, తను ఏదేదో పిచ్చిగా అరిచాడు…

కానీ ఏ క్లాన్ అయితే నిన్ను మెగా చీఫ్‌ను చేసిందో, అదే క్లాన్ సభ్యుల్ని ప్రొటెక్ట్ చేయకుండా వాళ్లనే నామినేట్ చేయడం ఏమిటని నబీల్ నిలదీస్తే తెల్లమొహం వేసింది… తన దగ్గర సమాధానం లేదు… కాకపోతే తాళపు చెవి పోటీ పెట్టి మళ్లీ బిగ్‌బాస్ మరో ట్విస్టు ఇచ్చాడు…

పోటీలో ఎవరు తాళపు చెవి వేగంగా వెళ్లి చేజిక్కించుకుంటే, వాళ్లు ఒకరిని లోపలకు పంపించొచ్చు, మరొకరిని బయటికి తీసుకురావచ్చు… దాంతో విష్ణుప్రియ లెక్కలన్నీ మటాష్ అయిపోయాయి… ఆట తీరే మారిపోయింది… ఇక్కడ క్లాన్ గేమ్ స్టార్టయింది… ఎవరి క్లాన్ సభ్యుల్ని వాళ్లు ప్రొటెక్ట్ చేసుకోవడం…

ఎవరూ నిఖిల్ జోలికి గానీ, గంగవ్వ జోలికి గానీ పోలేదు… మెగా చీఫ్‌కు ఎలాగూ ఇమ్యూనిటీ ఉంది… ఇక మిగతా వాళ్లందరూ లోపలకు, బయటకు… అదొక ఆట అయిపోయింది… నవ్వొచ్చింది ఏమిటంటే..? సిగ్గులేక, వేరే దిక్కులేక నిన్ను నామినేట్ చేస్తున్నాను అని ప్రేరణ టేస్టీ తేజకు వివరణ ఇచ్చుకోవడం…

ఇండివిడ్యుయల్ గేమ్ గాకుండా రెండు క్లాన్స్ నడుమ పోరాటంలా మారిపోయింది ఆట… సరే, మరొకటి నవ్వు పుట్టించిన అంశమేమిటంటే..? నిన్నటి దాకా యష్మితో పులిహోర కలిపిన గౌతమ్ ఆమె పోరా అనేసరికి ఇప్పుడు అక్కా అని పిలవడం … ఏం మెంటల్ కేసులురా బాబూ…

రేయ్, అక్కా అని కాదు, యష్మి అని పిలువు అని ఆమె మండిపడింది… ఎస్, గౌతమ్ పక్కా మెంటల్ కేసు, మనం గతంలో కూడా చెప్పుకున్నాం కదా పలుసార్లు… చివరకు నబీల్ కూడా గౌతమ్‌లా మారిపోయాడు, అరుస్తున్నాడు… విష్ణుప్రియ అన్నా అని పిలిస్తే నాకెవరూ హౌజులో అక్కల్లేరు అని విసుక్కున్నాడు… ఏం కేసులురా బాబూ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దీనక్క పాటలో సొంగకారిన పదాలు… దీనక్క ఏం రాస్తున్నారు భయ్యా…
  • ‘శ్రీబాగ్ భవన్’ అలా కాపాడబడింది… ఆ రక్షణ వెనుక కూడా ఓ కథ…
  • గాన చారుశీల సుశీల..! తిరుగులేని గళమాధుర్యం… స్వర సౌందర్యం..!!
  • చున్నీయిజం..! అది స్త్రీ స్వేచ్ఛావ్యతిరేక ప్రతీకా..? ఏమిటో ఈ సిద్ధాంతం..?!
  • శివ అంటే నాగార్జున, వర్మ మాత్రమేనా..? ఇంకెవరికీ క్రెడిట్ లేదా..?!
  • డాక్టర్ ఐపీఎస్… ఉగ్రవాదుల ఓ భారీ కుట్రను ఛేదించిన తెలుగు పోలీస్…
  • వ్యూహాత్మక బగ్రామ్ ఎయిర్‌ బేస్‌కై చైనా, అమెరికా పాలిటిక్స్… కానీ..?
  • శివకు రీ-రిలీజ్ ఉన్నట్టే… వర్మకూ ఓ రీ-రిలీజ్ ఉంటే బావుండు…
  • దక్షిణాఫ్రికా నుండి గోవా తీరానికి… ఒక క్రికెట్ లెజెండ్ కొత్త కథ..!
  • ఏడీ..? ఆ కీరవాణి ఏమయ్యాడు..? టాలీవుడ్ సంస్కారం ఏమైంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions