.
కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, రంగపేట గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి అనే యువకుడు విదేశీ కొలువుల దళారులకు చిక్కాడు… థాయ్‌లాండ్‌లో కొలువు అని ఆశ చూపించిన బ్రోకర్లు తీసుకెళ్లి, మధుకర్ రెడ్డి వంటి యువతీయువకులను సైబర్ ఫ్రాడ్ అక్రమార్కులకు అప్పగిస్తారు…
అక్కడ వీళ్లకు మొదలవుతుంది టార్చర్… ఆన్‌లైన్ మోసాలు చేయిస్తారు… పాస్‌పోర్టులు లాక్కుంటారు, బయటపడలేరు… వినకపోతే కరెంటు షాకులు… ఆ దేశమే కాదు, కంబోడియా, మయన్మార్, లావోస్ తదితర దేశాల సైబర్ ఫ్రాడ్ కేఫులకు కూడా వీళ్లను తరలించారు… వందల్లో ఉన్నారు బాధితులు…
Ads
ఇది మీడియాలో వచ్చింది… కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌ది కరీంనగరే కదా… విషయం తెలిసింది… తన శాఖే… చొరవ తీసుకున్నాడు… భారత విదేశాంగ శాఖకు లేఖ రాసి రంగంలోకి దింపాడు… మయన్మార్, థాయ్‌లాండ్ ఇండియన్ దౌత్య కార్యాలయాలను అలర్ట్ చేశారు… ఈ చొరవ ఫలించింది…
మయన్మార్ ఆర్మీ రంగంలోకి దిగి సైబర్ ఫ్రాడ్ కేఫుల్లో బందీలుగా ఉన్న వందల మంది యువతీయువకులకు విముక్తి కల్పించింది… రెండు ప్రత్యేక విమానాల్లో వీళ్లను ఇండియాకు తీసుకొస్తున్నారు… మొదట వీళ్లను థాయ్‌లాండ్‌లోని మైసోట్ సిటీకి తరలించి, అక్కడి నుంచి ఢిల్లీ తీసుకొస్తున్నారు… మొదటి విమానం 270 మందితో బయల్దేరింది…
మంగళవారం మరో 270 మందితో మరో విమానం బయల్దేరుతుంది… ప్రస్తుతం వీళ్లు మయన్మార్, మేవాడి జిల్లాలో ఆర్మీ పర్యవేక్షణలో ఉన్నారు… వీరిలో అన్ని రాష్ట్రాలకు చెందినవాళ్లు ఉండగా… ఏపీ, తెలంగాణ బాధితులు దాదాపు 42 మంది…
భేష్, బండి సంజయ్… ఇదే, ఈ పనితీరే నీ నుంచి కోరుకునేది తెలంగాణ ప్రజానీకం… ఏవేవో పసలేని, నిష్ప్రయోజనకరమైన డొల్ల విమర్శల్ని, వ్యాఖ్యాల్ని విసురుతూ కాలం గడపడం కాదు.., చేతలే నాయకుడిని మరో మెట్టు ఎక్కించాలి… జనం మెచ్చాలి… కావల్సింది ఇదుగో ఇలాంటి చొరవ, ఇలాంటి స్పందనే..!!
Share this Article