Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ కల్కియుగంలో ఈ సినిమాల్ని ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయగలమా..?

July 7, 2024 by M S R

ఎర్ర సినిమా . విప్లవ సినిమా . నెత్తురు సినిమా . జనం కోసం తీసిన జనం సినిమా . వామపక్ష భావజాలంతో కె బి తిలక్ , జగ్గయ్య , వి మధుసూధనరావులు ఈ సినిమాకు ముందే పదండి ముందుకు , ముందడుగు వంటి సినిమాలు చాలా తీసినా అవన్నీ సింపుల్ లెఫ్ట్ సినిమాలే . 1974 లో వచ్చిన ఈ భూమి కోసం సినిమా తెలుగు చిత్రరంగంలో వచ్చిన మొదటి Far Left సినిమా అని చెప్పవచ్చు . తిలక్ తర్వాత లెఫ్టిస్టు భావజాలంతో మాదల రంగారావు , ఆ తర్వాత నారాయణమూర్తిలు చాలా సినిమాలు తీసారు . వీళ్ళంత ఎర్రగా కాకపోయినా కళాత్మకంగా ఎర్ర భావాలతో దాసరి నారాయణరావు , టి కృష్ణ వంటి వారూ జనం సినిమాలను తీసారు .

తెలంగాణా సాయుధ పోరాటం , జమీందార్ల దాష్టీకం వంటి నేపధ్యంలో నిర్మించబడిన ఈ సినిమాను నిర్మాత-దర్శకుడు తిలక్ పోలీసు ఎన్కౌంటర్లో చనిపోయిన తన తమ్ముడుకి అంకితం ఇవ్వటం జరిగింది . స్వాతంత్య్రం రాక ముందుతో ప్రారంభమై , స్వాతంత్య్రం వచ్చాక కొనసాగుతుంది . తెలంగాణలో ఫ్యూడలిజం వర్ధిల్లింది ఒకనాడు . ఆంధ్రాలో ఇప్పటికీ ఫ్యూడల్ సోషలిజం కొనసాగుతూనే ఉంది . దేశం గురించి వద్దులెండి .

ఈ సినిమాలో ఇద్దరు కొత్త తారల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఒకరు అందాల తార జయప్రద . మరొకరు ప్రభ . ఆమెకు నీడ లేని ఆడది ముందా లేక ఈ భూమి కోసం సినిమా ముందా నాకు తెలియదు . ఇద్దరూ చాలా బాగా నటించారు .

Ads

ముఖ్యంగా పీపుల్స్ వార్ గ్రూప్ ( PWG ) వ్యవస్థాపకులలో ఒకరయిన కె.జి. సత్యమూర్తి వ్రాసిన ఒక జనం పాట చెల్లీ చంద్రమ్మ పాట నేపధ్యంలో ప్రభ బుర్ర కధ గొప్పగా నటించింది . ఈ పాటలోనే చంద్రమ్మగా జయప్రద తళుక్కుమనేది .

శ్రీశ్రీ వ్రాసిన పాట ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదుర పోకుమా యాబై ఏళ్ల తర్వాత కూడా వర్తించటం మన దురదృష్టం . ఈ సినిమా కన్నా కూడా ఈ పాటే వీర పాపులర్ అయింది . అలాగే శ్రీశ్రీ వ్రాసిన మరో పాట భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం అనంత జీవన సంగ్రామం పాట కూడా జనాన్ని ఉర్రూతలూగించింది . తిలక్ నిర్మాతగా దర్శకత్వం వహించిన MLA సినిమాలోని నీ ఆశా అడియాసా చెయి జారే మణిపూసా బ్రతుకంతా అమావాసా లంబాడోళ్ళ రాందాసా పాటను కూడా ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు ఒక చోట .

ఈ సినిమాలో ప్రతీ పాత్రకు ఓ ముఖ్య స్థానం ఉంది . జనం కోసం పరితపిస్తూ వాళ్ళను చైతన్యపరచాలనే ఆరాటం కల మాస్టారి పాత్రలో గుమ్మడి చాలా బాగా నటించారు . తర్వాత జగ్గయ్య పాత్ర . జమీందారు కొడుకుగా పుట్టి జనం కోసం పరితపించే పాత్రలో జగ్గయ్య నటన , ఆయన కంచు కంఠం సినిమాకు బలాన్ని ఇచ్చాయి .

మరో ముఖ్యమైన పాత్ర జమునది . మన వంశం ఏంటి , మన స్థాయి ఏంటి అని కొట్టుమిట్టాడే జమీందారి మంచి కూతురు పాత్రలో ఆమె చక్కగా నటించారు . కాసేపు మాత్రమే జమీందారు పాత్రలో ప్రముఖ హిందీ నటుడు అశోక్ కుమార్ నటించారు . ఆయన్ని ఎందుకు తెచ్చారో నాకయితే అర్థం కాలేదు .

మరో ప్రధాన పాత్ర , బహుశా ఆ పాత్రే హీరో పాత్ర ఏమో ! అదే చలం నటించే సూర్యం పాత్ర . విప్లవకారుని పాత్ర . ఏ విప్లవకారుడు అయినా ప్రాణాలు పోగొట్టుకోక తప్పదు . ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది . మరో ముఖ్య పాత్ర మమతది . వీరందరితో పాటు రమణారెడ్డి , కె విజయ , ప్రభాకరరెడ్డి , త్యాగరాజు , వల్లం నరసింహారావు నటించారు .

తెలంగాణా గ్రామాల్లో జనం ఎంతో మంది , బహుశా ప్రజా నాట్యమండలి కళాకారులు , జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది నటించారు . జనం సినిమా కదా ! జనమే నటించారు .

మా నరసరావుపేటలో ఏ థియేటర్లో చూసానో గుర్తు లేదు . టివిలో మాత్రం ఒకసారి చూసా . నిన్న ఒకసారి యూట్యూబులో చూసా . ఈతరం వాళ్ళలోనే కాదు ; మా తరం వాళ్ళలో కూడా చాలామంది చూసి ఉండరు . కూస్తంత కళాపోషణ ఎలా అవసరమో , అలాగే కాస్త పీడిత , తాడిత జనం కష్టాలను కూడా తెలుసుకోవాలి కదా ! యూట్యూబులో ఉంది . కలర్లో తీసారు . పాపం డబ్బులు వచ్చాయో లేదో ! డబ్బులు కోసమే సినిమాలను తీసే బేచ్ కాదులెండి తిలక్ లాంటోళ్ళు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……… ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాబూయ్… టీఎంసీ నేతలకు ప్రతిదీ గోకడమే అలవాటుగా ఉంది…
  • నాగబాబు ఇన్‌ఫ్లుయెన్స్ కనిపిస్తోంది… భరణి కెప్టెన్ అయిపోయాడు….
  • ఎవడికి ఏది చేతనైతే… అదే ప్రజాస్వామ్యం, అదే న్యాయం ఈ దేశంలో…
  • తెలంగాణ ఈ దేశంలోని రాష్ట్రమే మోడీ సాబ్… మరిచిపోయినట్టున్నవ్…
  • మమతా బెనర్జీ పార్టీ పునాదులకు పగుళ్లు… అచ్చంగా ‘SIR’ ఫలిస్తోందిలా…
  • రాజేంద్రప్రసాద్- చంద్రమోహన్… ఐనా కామెడీ జాడే లేని ఓ టైమ్‌ పాస్…
  • సొంత మంత్రిపై ఎన్టీఆర్ స్టింగ్ ఆపరేషన్… ఆ ఇంట్రస్టింగ్ కథ తెలుసా..?
  • నర్తిస్తూ 574 మెట్లు… ఓ యువ భరతనాట్య కళాకారిణి అరుదైన ఫీట్…
  • తెరపై అత్తవో, అమ్మవో గానీ… నిజజీవితంలో మాత్రం ప్రగతి స్పూర్తివి..!!
  • ఫోర్త్ సిటీ అంటే యాంటీ సెంటిమెంట్… అందుకే అది ఫ్యూచర్ సిటీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions