Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పదే పదే ఓ కల… ముందుకు వెళ్తూ ఓ అమ్మ… వెనకాలే ఓ పిల్లాడు…

July 4, 2026 by M S R

.

గీత రచయిత భువనచంద్ర… అనేక మాస్, క్లాస్ పాటలు రాసిన ఆయన జీవితంలో ఎవరూ నమ్మని ఓ విశేషం… ఆసక్తికరం… చదువుతుంటే ఆశ్చర్యం వేసింది… కొన్ని హేతువుకు అందవు, అందనంత మాత్రాన జరగకూడదని ఏమీ లేదు…

అది ఏమిటంటే? ఆయనకు చిన్నప్పటి నుంచీ ఓ కల వచ్చేది, ఆ కలలో తన తల్లి వయస్సున్న ఓ మహిళ అలా నడుస్తూ వెళ్తుంటుంది… ఆమె వెనుకాల ఈయన వెళ్తుండేవారు… కాస్త దూరం పోయాక, ఆమె వెనక్కి తిరిగి చూసి, నవ్వుతూ ఈ చిన్నారిని రమ్మని పిలిచేది…

Ads

చిన్నప్పటి నుంచీ ఆ కల పదే పదే… ఆమె ఎవరు..? తెలియదు… ఎందుకు ఆ కలే పదే పదే పలకరిస్తోంది? తెలియదు… పెద్దయ్యాక కూడా అదే కల వస్తుండేది! తన ఉద్యోగంలో భాగంగా మద్రాసులో కూడా పనిచేశారాయన… అక్కడ తాంబరంలో వుండేవారు…

ఓ రోజున ఈయన ఆఫీసుకి వెళుతుంటే… ఎదురుగా ఓ స్త్రీ వెళుతోంది… అచ్చం కలలోలాగే… ఈయన అన్నీ మర్చిపోయి… ఆమె వెనకాలే వెళ్లారు… ఓ ఇంటి దగ్గరకి వెళ్లాక… ఆమె వెనక్కితిరిగి చూసి నవ్విందట…

సరిగ్గా తనకు చిన్నప్పటి నుంచీ కలలో కనిపించిన మాతృమూర్తే ఆమె! ఆయనలో ఆశ్చర్యం.. ఆనందం.. ఏదో తెలియని పులకింత.. “అమ్మా..” అని పిలిచారు అప్రయత్నంగా.. ఆమె నవ్వుతూ ఇంట్లోకి రమ్మంటూ పిలిచింది..

ఇంట్లోకి వెళ్లగానే ఏదో తెలియని అలౌకికానందాన్ని పొందారు. ఆ మనుషులంతా ఎప్పటి నుంచో పరిచయం వున్న వాళ్లలా అనిపించారు. తనకు చిన్నప్పటి నుంచీ వస్తున్న కల గురించి వాళ్లకు చెప్పి.. ఆ అమ్మ మీరే అన్నారట ఈయన..

ఆమెతో మాట్లాడుతుంటే ఏదో జన్మజన్మల బంధంలా అనిపించింది ఆయనకు.. ఇదంతా వింటూ.. ఆసక్తిగా చూస్తున్న ఆమె భర్త కూడా “జన్మజన్మల బంధం” అన్నారట.. విచిత్రం ఏమిటంటే, ఆ దంపతులకు ఓ అబ్బాయి పుట్టి పోయాడట.. ఆ అబ్బాయి పోయిన సంవత్సరం.. భువనచంద్ర గారు పుట్టిన సంవత్సరం ఒకటేనట!

దీనిని ఏమనాలి? అవునేమో, ఆ జన్మ బంధమే అలా కలలోకి అలా వచ్చి పలకరించేదేమో… అలా ఆ ఫ్యామిలీతో ఆయన అనుబంధం అలాగే కొనసాగింది.. అక్కడ ఉండగానే ఆయనకు జాండిస్ వచ్చి ఆసుపత్రి పాలైతే ఆ తల్లే బ్లడ్ కూడా ఇచ్చి.. దగ్గరుండి చూసుకుందట.

అందుకే రచయితగా మారాక ‘కన్న’ తల్లి పేరు (చంద్రమౌళీశ్వరి), ‘కల’ తల్లి పేరు (భువనేశ్వరి).. ఇద్దరి పేర్లూ కలసి వచ్చేలా ‘భువనచంద్ర’ అని పెట్టుకున్నారు. ఇది చెబితే ఎవరూ నమ్మరని ఆయన ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు! ఇదీ ఆయన పేరు నేపథ్యం…

ఇంతకీ.. ఆయన అసలు పేరు ఏమిటనుకుంటున్నారు?
‘వూరకరణం శేషపూర్ణ ఆనంద ప్రభాకర పెద గురురాజు’!

  • (ఫేస్ బుక్ మిత్రులు మోహన్ గోటేటి పోస్టు నుంచి కొంత భాగం ఇది, ధన్యవాదాలతో)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నీట్ మాత్రమే కాదు ! బలమైన భారత్‌ను బలహీనపరిచే ఏదో కుట్ర !!
  • శ్రీ గౌరీప్రియ ! సరైన పాత్ర దొరికితే తెలుగమ్మాయిలు దున్నేయగలరు !!
  • అదే హైడ్రా – అదే ఆర్మీ – రెండు వేర్వేరు భిన్న వార్తలు !!
  • BRS Hereditary heir KTR only – ఈ పార్టీ కేసీయార్ సొంత కుటుంబ ఆస్తి !!
  • అదే గ్లోబరీనా! – కీలెరిగి వాత పెట్టడంలో రేవంత్ తరువాతే ఎవరైనా?
  • ‘యంగెస్ట్- ఫాస్టెస్ట్ ఫిఫ్టీ’ బుడ్డోడు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కాదు… ఎందుకు..?
  • మరక మంచిదే… ఇదీ ఓ పాఠం… ఆదమరిస్తే మరింత ప్రమాదం…
  • నీట్ ఒక్కటే కాదు ! అసలు వైద్య విద్య సమస్యల లోతుల్లోకి వెళ్లేవారేరీ !
  • రూమ్ రెంటుకూ తిప్పలు పడే స్థితి నుంచి… జాతీయ అవార్డు గ్రహీత దాకా…
  • మోదీ ప్రతిష్ట నానాటికీ పలుచన – బీజేపీకి ఇవన్నీ అశుభ సూచికలే !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions