…… By…. Amarnath Vasireddy……… అదొక పాఠశాల . అక్కడి నియమాల గురించి తెలియని భారత మూలాలున్నఒక విద్యార్ధి ఒ రోజు తన లంచ్ బాక్స్ లో నట్స్ { వేరుశెనగ గింజలు } తీసుకొని వచ్చాడు . అతని పక్కన ఉన్న శ్వేత జాతి విద్యార్ధికి రెండు పల్లీలు ఇచ్చాడు . దాన్ని ఆ విద్యార్ధి తిన్నాడు . అంతే నిముషాల్లో ఆ శ్వేత జాతి విద్యార్ధి మొఖం ఎర్రగా వాచిపోయి, గుమ్మడి కాయలా వూరిపోయింది . టీచర్ చూసింది . నిర్గాంతపోయి ప్రిన్సిపాల్ రూమ్ కు పరుగెత్తింది . అక్కడ ఉన్న ఎపి పెన్ తీసుకొని తన క్లాసు రూంకు పరుగెత్తుకొని వచ్చింది . ఏమి జరిగిందో అర్థం చేసుకొన్న ప్రిన్సిపాల్ కూడా ఆమెతో బాటే పరుగెత్తుకొని వచ్చింది . ఇద్దరు కలిసి ఆ ప్రత్యేక ఎపి పెన్ తో ఆ అబ్బాయి చేతిపై బలంగా గుచ్చారు . అందులోని రసాయనం అతని చేతిలోకి వెళ్ళింది .
ఇది ప్రధమ చికిత్స . ఆ అబ్బాయి గుండె ఆగిపోకుండా , ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది లేకుండా , వాపు కాస్త తగ్గేలా అది చేసింది . ఈలోగా అంబులెన్సు వచ్చింది . ఆ అబ్బాయిని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు . కాసేపటికి పోలీస్ వాన్ వచ్చి టీచర్ ను అరెస్ట్ చేసింది . తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించింది అని ఆ టీచర్ పై కేసు రిజిస్టర్ అయ్యింది . ఇదేదో సినిమాలో జరిగిన కథ కాదు . ఊహ.. కట్టు కథ కానే కాదు . నిజ జీవిత ఘటన . ఆ దేశం పేరు అమెరికా . అక్కడి పిల్లలు పెద్దలు రకరకాల ఎలర్జీలతో బాధ పడుతుంటారు . పోనీ ఇది అరుదుగా జరిగే ఘటనా అంటే అదీ కాదు .
Ads
మా అమ్మ నాన్న టీచర్లు . కానీ వ్యవసాయంపై మక్కువతో మెట్ట సేద్యం చేసేవారు . వేరుశెనగ తో నా బాల్యానికి విడదీయలేని అనుబంధం వుంది . సీజన్ వచ్చిందంటే ఇంట్లో కుప్పగా పచ్చి శెనక్కాయలు పోసి ఉండేవి . దాని పక్కనే పడుకోవడం . పచ్చివి, ఎండినవి అదే పనిగా తినడం … ఇదీ నా బాల్యం . నట్స్ తింటే ఎలర్జీ రావడాన్ని ఇక్కడ మన దేశంలో ఎప్పుడైనా కనీవినీ ఎరుగుదుమా ? లేదు కదా ? కానీ అమెరికాలో ఇది చాలా సీరియస్ సమస్య . అసలు గ్రౌండ్ నట్స్ ని వారు అసహ్యించుకొంటారు . ఇది థాయిలాండ్ , ఇండియా లాంటి అనాగరిక దేశాల్లో పండించే ఒక చెత్త పంట అని అక్కడి వారి భావన . విమానాల్లో, హోటల్స్ లో గ్రౌండ్ నట్స్ దాదాపుగా నిషేధం .
అమెరికా ప్రజలకు నట్స్ తింటే ఎందుకు ఎలర్జీ వస్తుంది ? . తిన్నా కనీసం ముట్టుకున్నా ఎలర్జీ వస్తుంది . ఎపి పెన్ తో పొడుచుకోకుంటే ప్రాణం పొయ్యే అవకాశం ఎక్కువ . పోనీ గ్రౌండ్ నట్స్ అనాగరికుల పంట . వదిలేద్దాము . నత్తను తిన్నా, ముట్టుకున్నా ఎలర్జీ వచ్చే వారి సంఖ్య ఆ దేశం లో ఎనభై రెండు లక్షలు . పాలు పిలల్లకు ఆహారం కదా . పాలు తాగితే ఎలర్జీ వచ్చి ప్రాణం మీదకు వస్తుందా ? అవును . అమెరికా లో మిల్క్ ఎలర్జీ ఉన్న వారి సంఖ్య అరవై లక్షలు . nut ఎలర్జీ ఉన్న వారు అరవై లక్షలు . ఇంతే కాదు . జంతువులు, బొద్దింక , పుప్పొడి , దుమ్ము , కీటకాలు , పెర్ఫ్యూమ్ ఇలా సవా క్ష ఎలర్జీలు . జనాభా లో సగం మందికి ఏదో ఒక ఎలర్జీ . ఏటా కొన్ని వేలమంది ఎలర్జీలతో ఆసుపత్రులకు పరుగెత్తుతారు . చిత్రంగా వుంది కదా ? మీ బంధువు ఎవరైనా అమెరికాలో వున్నారా ? అయితే ఇది నిజమో కాదో తెలుసుకోండి . ఇందుకు కారణం ఏమిటని వాకబు చెయ్యండి .
ఫ్లూ … అంటే సాధారణ జలుబు . ఇప్పుడైతే మనం జలుబు చేస్తే కరోనా అని భయపడుతున్నాము . కానీ మొన్నటి దాకా జలుబును పట్టించుకొనే వారమా ? అమెరికాలో ఇదొక సీరియస్ సమస్య . కరోనా పూర్వయుగంలో ఏటా నాలుగు కోట్ల మంది ఫ్లూ బారిన పడేవారు . దీనివల్ల కనీసం నాలుగు లక్షల మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చేది . దీనికోసం ఏటా రెండు టీకాలు తీసుకొంటారు . అయినా ఏటా ఇరవై వేల మంది చనిపోతారు . అవునండీ, జలుబు వల్ల చనిపొయ్యేవారి సంఖ్య ఏటా ఇరవై అయిదు వేలు .
ఇప్పుడు కరోనా విషయానికి వద్దాము . ఓమిక్రాన్ వల్ల దక్షిణాఫ్రికాలో ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య 91 % తగ్గిపోయింది . వారి కోవిద్ వార్డులు ఖాళీ అవుతున్నాయి . రెండు వందల మందికి ఓమిక్రాన్ సోకితే ముగ్గురు మాత్రం ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి . అదీ మైల్డ్ లక్షణాలు . ఇప్పటిదాకా ఓమిక్రాన్ దక్షిణాఫ్రికాలో కనీసం నాలుగు లక్షల మందికి సోకితే ఒక్క మరణం కూడా జరగలేదు . అదే ఇంగ్లాండ్ దేశం ఓమిక్రాన్ తో చిగురుటాకులా వణుకుతోంది . అక్కడి ఆసుపత్రులు మూసుకోవాల్సి పరిస్థితి . డాక్టర్లు, నర్స్ లు, వార్డ్ బాయ్ లు అందరూ ఖాయిలా పడితే ఇంక ఆసుపత్రి నడిచేది ఎలా ? మూడు డోసుల వాక్సిన్ తీసుకొన్నారు . మాస్క్ లు పెట్టుకొన్నారు . అయినా హెల్త్ సిబ్బందికే ఇంత సీరియస్ సమస్య . ఇక మాల్స్, హోటల్స్ లాంటి చోట్ల పనిచేసే వారి సంగతి చెప్పనక్కర లేదు . ఇప్పుడు ఇంగ్లాండ్ మొత్తం ఖాయిలా పడింది . ఎందుకిలా ? దక్షిణాఫ్రికాలో తోక ముడిచిన ఓమిక్రాన్ ఎందుకు ఇంగ్లాండ్ ను కాటేస్తోంది ? ఎవరైనా మీకు చెప్పారా ?
ఇప్పుడు అమెరికా విషయానికి వద్దాము . ఇప్పటిదాకా ఆ దేశంలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య అధికారికంగా ఎనిమిది లక్షలు . వాస్తవంగా ఇంకా చాలా ఎక్కువ అని వారి సీడీసీ సంస్థ చెప్పింది . అధికారికంగా ప్రకటించిన ఎనిమిది లక్షల మరణాల్లో నాలుగు లక్షల మరణాలు వాక్సిన్ వచ్చాక జరిగినవే . అంటే వాక్సిన్ పని చేయలేదని కాదు . అది లేకుంటే డెల్టా వేవ్ లో ఇంకా నాలుగైదు రెట్లు ఎక్కువగా మరణించే వారు . కానీ వాక్సిన్ వారిని రక్షించిందా? అంటే లేదు అని సమాధానం వస్తుంది . ఇప్పుడు వారి జనాభాలో డెబ్భై శాతానికి పైగా వాక్సిన్ ఇచ్చేసారు . అయినా రోజుకు లక్షన్నర కేసులు . ఇది జనవరికల్లా మరింత పెరగనున్న స్థితి . ఇప్పడు రోజుకు రెండు వేలకు కాస్త తక్కువగా మరణాలు . జనవరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం . ఇప్పుడు మరణిస్తున్న వారిలో వాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా వున్నారు అనేది వాస్తవం . కానీ అదే సమయంలో వాక్సిన్ తీసుకొన్న వారి మరణాలు కూడా వున్నాయి .
మూడు డోసుల వాక్సిన్ తీసుకొన్నా ఓమిక్రాన్ లాంటి బలహీనమైన వేరియంట్ అమెరికా , యూరోప్ దేశాలను వణికిస్తోంది . ఎందుకు ? పోనీ.. ఎప్పటికి ఈ సమస్య పరిష్కారం అయ్యేను ? వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చింది . చచ్చినవారు చచ్చారు . మన పూర్వీకులు కొంతమంది చనిపోయి వుంటారు . మన తాతలు బతికారు . దాన్ని జయించారు . ఆ వైరస్ పోలేదు . వందేళ్లుగా రకరకాలుగా మ్యుటేట్ అవుతోంది . మనం దాన్ని పట్టించుకోలేదు . అదీ మనకు సమస్య కాలేదు . మరోపక్క అమెరికాలో దానికి వాక్సిన్ .. ఏటా రెండు డోసులు . అయినా చావులు. కరోనా పోతుంది అనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ట . వందేళ్ల క్రితం వచ్చిన ఫ్లూ వైరసే పోలేదు . మరి కరోనా వైరస్ పోతుందా ? ఫ్లూ వైరస్ కు మందు ఉందా ? లేదే … మరి కరోనా వైరస్ కు వస్తుందా ? ఆలోచించండి …
ఫ్లూ వల్ల ఏటా ఇరవై వేల మంది చనిపొయ్యే అమెరికా దేశంలో కరోనా ఏమి చేయనుంది . ఇక మీదట ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఏటా కనీసం యాభై వేల మంది చనిపొయ్యే అవకాశం ఉంటుందేమో. ఇది సమీప భవిష్యత్తులో ఆగదు . అసలు సరైన మార్గంలో ప్రయాణం మొదలుపెడితే కదా పరిష్కారం దొరికేది . ఈ పోస్ట్ సైన్స్ కో వాక్సిన్ కో వ్యతిరేకం అనుకునేరు . కాదు . సైన్స్ పేరుతో మన చుట్టూరా జరుగుతున్న మాయను, మోసాన్ని, కుట్రను మీ ముందు ఉంచడానికి ఒక చిన్న ప్రయత్నం . మనిషి .. హోమో సేపియన్స్ .. నలబై లక్షల సంవత్సరాల క్రితం పరిణామ క్రమంలో ఆవిర్బావించాడు . మనిషి ప్రకృతిలో ఒక భాగం . మనిషి శరీరంలోని జన్యువులు ఇతర శరీర కణాలు , కణజాలాలు , అంగాలు , వ్యవస్థలు అదే విధంగా రూపొందాయి .
ఈ రోజు మీరు బతికి వున్నారు .. డెల్టా వేవ్ లో పోకుండా ఇంకా బతికి ఈ పోస్ట్ చదువుతున్నారు అంటే దానికి మీరు మీ తండ్రికి , తాతకు , ముత్తాతకు ఇంక పూర్వీకులకు రుణపడి ఉండాలి . కృతఙ్ఞతలు చెప్పాలి . వారు మట్టిలో బతికారు . నేల విడిచి సాము చెయ్యలేదు . నాగరికత పేరుతో కొంప తగలబెట్టుకోలేదు . కానీ మీరు మీ పిల్లలకు చేస్తున్నది ఏమిటి ? ఆలోచించండి . తిరిగి పాతరాతి యుగంలోకి వెళ్లిపోవాలని నేను చెప్పడం లేదు . అది సాధ్యం కాదు కూడా ? కానీ నేల విడిచి సాము చేస్తే ? మనిషిని బతికించేది ఆరోగ్యాన్ని ఇచ్చేది తిండి .. ఇంకా సరైన జీవన విధానం . ఆధునిక వైద్యం- నాగరికత ఇచ్చిన వరం . అది అవసరం . కానీ మనిషి టాబ్లెట్స్ తింటూ సెలైన్ ఎక్కించుకొంటూ బతకగలడా ? పాండెమిక్ వచ్చినపుడు వాక్సిన్ అవసరమే . కానీ వాక్సిన్ కంపెనీల కోసం బతకాలా ? వాక్సిన్ కంపెనీలు మనుషుల కోసమా? లేక మనుషులు ఆసుపత్రులను వాక్సిన్ కంపెనీలను బతికించడం కోసమా ? ఆలోచించండి .
తిరిగి అమెరికా విషయానికి వద్దాము . వారు తినే తిండి విష తుల్యం . ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చిన పంటల్ని వారి ఆహార కంపెనీలు జన్యుపరంగా మార్చేశాయి . దీన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అంటారు . అసలు ఈ ఫుడ్ సమస్య కాదు అని ఆ కంపెనీల వాదన . కాసేపు నిజం అనుకొందాము. ప్యాకింగ్ చేసేటప్పుడు అది జెనిటికెల్లి మాడిఫైడ్ అవునో కాదో దానిపై ముద్రించేలా కాంగ్రెస్ లో అంటే అమెరికా పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు . దాన్ని వీగిపొయ్యేలా చేసింది మోన్ శాంటో కంపెనీ డబ్బుల సంచులు . ఆ దేశంలో మనుషులు తినేది కంపెనీలకు లాభం చేకూర్చడం కోసం . తాగేది .. అవునండీ మంచి నీళ్లతో కలుపుకొని వారు తాగేది కంపెనీల కోసమే . ఇక బతికేది ఆసుపత్రుల కోసం . అక్కడ మందులు, వాక్సిన్ లు మనుషుల కోసం కాదు . మనుషులు వాటి కోసం . ఇది చదువుతుంటే మీకు గందరగోళంగా వుంది కదా ? అవునండీ .. వాస్తవం అంత సులభంగా అర్థం కాదు . బతకాలంటే చుట్టూరా జరుగుతున్న దానిని అర్థం చేసుకోవాలి . తప్పదు .
అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం . వారికి చెప్పేటంత గొప్పవాడిని కాను . చెప్పినా లాభం లేదు . నిద్రపొయ్యే వాడిని లేపవచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపగలమా ? పాపం అమెరికా ప్రజలు . జీవితం అనే వైకుంఠ పాళీలో వారికి నిచ్చెనలు తక్కువ . పాములు ఎక్కువ . ఆ పాములు ఫుడ్, ఫార్మా ఇంకా అనేక ఇతరత్రా కంపెనీల రూపంలో వున్నాయి . బహుశా వెనక్కి తిరిగి రాలేనంత దూరం ముందుకు వెళ్లిపోయారు . పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం .. దీని గురించి విన్నారా ? మనం భారతీయులం అమెరికా వారిని, తెల్ల దొరలను చూసి ఎప్పుడు అదే చేస్తుంటాము . ఇది మానాలి. ఇప్పుడు ఏమి చెయ్యాలో చెబుతాను . ప్రస్తుతానికి మాస్క్ పెట్టుకోండి . రెండు డోసుల వాక్సిన్ తీసుకోండి . ప్రభుత్వం చెప్పాక మాస్కులు తీసి అవతల పడెయ్యండి . ముఖ్యంగా పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వండి . అప్పుడే వారిలో ఇమ్మ్యూనిటి పెరుగుతుంది . లేకపోతే గాలి సోకితే ఎలర్జీ, మట్టి సోకితే ఎలర్జీలు వచ్చి మన పాఠశాలల్లో కూడా ఎపి పెన్లు వచ్చే పరిస్థితి వస్తుంది .
ప్రకృతికి దగ్గరగా పిల్లల్ని పెంచండి . ఆడనివ్వండి . ఎగరనివ్వండి. మట్టిలో ఆడాలి . దుమ్ము ధూళి తగలాలి . ఫిల్టర్ వాటర్ కాదు . మామూలు నీరు ఇవ్వండి . రిఫైన్డ్ ఆయిల్ కాదు . గానుగ నూనె ఇవ్వండి . హైబ్రిడ్ టమాటో , కృత్రిమంగా మాగపెట్టిన అరటి లాంటి విషాలు మనకు కూడా వచ్చేసాయి . ఇక్కడ కూడా ఆహారం విషతుల్యం అయిపోతోంది. దీని నుంచి పిల్లల్ని రక్షించుకోండి. గుర్తు పెట్టుకోండి . మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆహారం .. మందులు కాదు . రోగం వచ్చినప్పుడు మందులు . నిజమే . అవసరమే . కానీ మందుల కోసం రోగాలు .. మనుషులు కాదు కదా ? మానాలి ఆరోగ్యంగా ఉంచేది మన దిన చర్యలు . వేళకు లేవడం .. ఎండ .. వ్యాయాయం .. మంచి తిండి .. పిల్లలకు ఆటలు .. ఆహ్లాదం .. అంటే కానీ రోజూ కేసులు, కేసులు అంటూ డోకు వార్తలు కాదు . రోజూ భయపడుతూ బతకడంకన్నా చావడం మేలు . నీ భయంతో భావితరాలకు శాశ్వత నష్టం చేయకు . ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యం విషయంలో ఇండియాను అమెరికా చెయ్యకు .
ఆధునిక వైద్యం గొప్ప శాస్త్రం . వైద్యులు దేవుళ్ళు . సమస్య అల్లోపతితో కాదు . దాన్ని చెరపట్టిన నరరూప రాక్షసులతో . సమస్య డాక్టర్లతో కాదు . వారి వైద్యం గొప్పది . సమస్య ఆసుపత్రుల్ని బతికించడం కోసమే మనుషులు అనే విధంగా రూపొందుతున్న నేటి వ్యవస్థతో . మన పూర్వీకుల మంచి జీవన విధానం పుణ్యమా అంటూ మనం ఆరోగ్యంగా వున్నాము . జీవిస్తున్నాము . మన పిలల్లకు మనం ఏమి ఇవ్వబోతున్నాము ? వారిని రోగులుగా మార్చి ఫార్మాసురులకు అప్పజెప్పబోతున్నామా ? మాస్కు లు.. వాక్సిన్లు దాటి మనం ముందుకు సాగలేమా ? సహజ జీవన విధానాన్ని అనుసరించలేమా ? చివరగా ఒక మాట . మన సంప్రదాయాలు అన్నీ గొప్పవి అని నేను చెప్పడం లేదు . మంచి ఎక్కడ వున్నా గ్రహించాలి . పర సంస్కృతుల పట్ల సహనం , ప్రజాస్వామిక భావన , వర్క్ ఎథిక్స్ ఇలాంటి విషయాల్లో మనం అమెరికా లాంటి దేశాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది . అది వేరే సబ్జెక్టు . సర్వే జనా సుఖినోభవంతు …
Share this Article