ఇదే నెల… 18వ తేదీ… బిగ్‌బాస్ ఫినాలే… ‘‘ఒకవైపు ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్… ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోయారు అక్కడే… ఇక ఈ దిక్కుమాలిన బిగ్‌బాస్ ఫినాలే ఎవడూ పెద్దగా దేకలేదు… వెరసి మొదటి నుంచీ చెత్తచెత్తగా సాగుతున్న ఈ సీజన్ బిగ్‌బాస్ చివరకు ఫినాలే విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ కాబోతోంది రేటింగ్స్‌లో… ఎవరు విన్నర్, ఎవరు రన్నర్… ఈ ప్రశ్నకు సింపుల్ జవాబు… ఈ ఆటలో ఎవడూ గెలవలేదు… చిత్తుగా ఓడింది మాత్రం ఆ పిచ్చి ఆటకు వోట్లేసిన ప్రేక్షకులు…’’ అని ముచ్చట తన అభిప్రాయం పబ్లిష్ చేసింది…
ఎస్, అదే జరిగింది… ఒక్క ముక్కలో చెప్పాలంటే బిగ్‌బాస్ టీం నాగార్జున ఇజ్జత్ బర్‌బాద్ చేసి, బట్టలిప్పేసింది… అంత ఘోరమైన రేటింగ్స్ నమోదయ్యాయి… బార్క్ రేటింగుల్లో మరీ 6.37 జీఆర్పీలు… మరీ ఘోరం… గతంలో కూడా బిగ్‌బాస్ వీక్ డేస్‌లో వీక్‌గానే ఉన్నా, వీకెండ్ షోలలో పుంజుకునేది, ఫినాలే రేటింగ్స్ చాలా బాగా వచ్చేవి… 14, 15, 16 వరకు కూడా… ఈసారి వీక్ డేస్, మరీ వీక్ డేస్… వీకెండ్స్ సేమ్ షేమ్… పోనీ, ఫినాలే అయినా కాస్త సమర్థంగా చేశారా అంటే దాన్నీ భ్రష్టుపట్టించారు…
పేరుకు ఎవరెవరినో తీసుకొచ్చారు… షో రన్ చేశారు… కానీ మెజారిటీ జనం ఫుట్‌బాల్ వీక్షణకు కమిటైపోయారు… పైగా బిగ్‌బాస్ ఫినాలే పరమ పేలవంగా సాగింది… దాంతో ఎవడూ దాన్ని దేకలేదు… మరి నాగార్జున ఇజ్జత్ పోవడం ఏమిటి అంటారా..? జనానికి కనిపించేది తనే కాబట్టి… ఈ షో నిర్మాతలైన ఎండెమాల్ వాడు ఎవడికీ కనిపించడు… ముంబైలో కూర్చున్న సూత్రధారులు ఎవడికీ కనిపించరు… చివరకు నాగార్జున స్టూడియోలో పెత్తనాలు వెలగబెట్టినవాళ్లూ కనిపించరు… జనానికి కనిపించేది జస్ట్, నాగార్జున మాత్రమే…
Ads
షో ఎంత నీరసంగా సాగినా సరే, ఫినిషింగ్ టచ్ సూపర్ ఉంటుందని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు… ఎవరెవరో సినిమా సెలబ్రిటీలను రప్పించారు… డాన్సులు అనబడే గెంతులు వేయించారు… ఐనా మజా లేదు షోలో… ఎప్పుడైతే శ్రీహాన్ 40 లక్షలు తీసుకున్నాడో, అప్పటిదాకా షో చూస్తున్న ప్రేక్షకులు కూడా చానెల్ మార్చేశారు… ఈసారి షోలో ప్రతి అడుగూ అడ్డమైనదే… ఒక్కటీ సరిగ్గా లేదు… చివరకు ఫినాలే సహా…!! ఈ రేటింగ్సే పర్‌ఫెక్ట్ ఉదాహరణ… అవునూ, ఇంతకీ నాగార్జున తదుపరి సీజన్‌కు హోస్ట్ చేస్తాడా..? సందేహమే..!! ఏమో, వాళ్లకూ వేరే దిక్కులేదు, తనకూ వేరే పనేమీ లేదు మరి… సో, అదీ చెప్పలేం..!!
Share this Article