Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బొచ్చులో ఎపిసోడ్..! ఆ బవిరి గడ్డంలో ఏదో మంత్ర శక్తి దాగున్నట్టు బిల్డప్పు..!!

October 20, 2024 by M S R

ఎలాగూ పృథ్విని బయటికి పంపించేయాలని బిగ్‌బాస్ టీమ్ నిర్ణయం తీసేసుకుంది… దాని లెక్కలు దానికున్నాయి… కానీ వెళ్లే ముందు తనను డిఫరెంటుగా ఆటపట్టించి మరోసారి తనలోని మూర్ఖత్వాన్ని, తన ఆలోచనల్లోని అపరిణత ధోరణినీ బయటపెట్టింది… ఓరకంగా ఆటాడుకుంది…

అవినాష్ గడ్డం తీసేయించుకుని, జుట్టు కత్తిరించుకోవడం వల్ల ప్రైజ్ మనీకి 50 వేలు యాడ్ అయ్యాయి… తనకే ప్రైజ్ మనీ రావాలనీ లేదు… ఆటలో అంతిమ విజేత ఎవరో చెప్పలేం కాబట్టి… కానీ తనకు ఆట పట్ల కమిటెడ్ అనే మంచి మార్కులు పడ్డయ్… వీకెండ్ షోలో నాగార్జునతో పృథ్వికి ఓ ఆఫర్ ఇప్పించింది బిగ్‌బాస్ టీమ్…

అవినాష్‌లాగే కత్తిరించుకుంటే 2 లక్షలు ప్రైజ్ మనీ పెంచుతాం అనిపించింది… తను నో అన్నాడు… తనను ఒప్పించాలని నిఖిల్‌ను అడిగారు… వినడు, నేను చెప్పను అనేశాడు నిఖిల్… సరే, 5 లక్షల ప్రైజ్ మనీ అని మళ్లీ టెంప్ట్ చేశాడు నాగార్జున… నో అన్నాడు పృథ్వి… ఆల్రెడీ ఆ టాస్క్ అయిపోయింది, తనతో సరదాగా ఆడుకుంటున్నారని పృథ్వి అనుకున్నాడు… వీకెండ్ షోలో ఈ జుట్టు పోలిగాడు ఎపిసోడ్ నిజంగానే ఆచరణకు రాదనీ, ఉండదనీ నమ్మాడు…

Ads

ఈసారి రూట్ మార్చి నాగార్జున 2 వారాలు నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ అన్నాడు… నో, సర్, నేను నేనులాగే ఉంటాను, నేనొప్పుకోను అన్నాడు… గతంలో హౌజులో జుట్లు కత్తిరించుకోవడాలు, పచ్చబొట్టు పొడిపించుకోవడాలు, గుండు గొరిగించుకోవడాలు వంటివి జరిగాయని తెలుసో లేదో… ఈసారి నాగార్జున మళ్లీ 3 వారాలు ఇమ్యూనిటీ అన్నాడు… అంటే నేరుగా పదో వారం వరకూ హౌజులోనే ఉంటావు అని ఆఫర్…

నేను నేనులాగా ఉండటం అంటే గడ్డంతో ఉండటమా..? గడ్డం లేకపోతే పృథ్వి తనలా ఉండడా..? తను గాకుండా పోతాడా..? గడ్డంలో పాతాళభైరవి మాంత్రికుడి మహత్తు ఏమైనా ఉందా..? ఓ ఫూలిష్ ఆలోచన… అదే వ్యక్తీకరణ… కేవలం గడ్డం షేవ్ చేయించుకో, పదోవారంలో మళ్లీ వచ్చేస్తుంది… నువ్వు నువ్వులాగే ఉంటావు అని మళ్లీ నాగార్జున… సరిగ్గా ఇక్కడ పృథ్వి వోకే అని ఉంటే కథ పూర్తిగా వేరే మలుపు తీసుకునేది… కానీ పృథ్వి కదా, నో, నో అంటూనే వెళ్లాడు…

నిజంగానే పృథ్వి బొచ్చులో గడ్డం ఉంటే ఎంత పోతే ఎంత అనుకుని ఉంటే… బిగ్‌బాస్ తన ఆఫర్‌కు కట్టుబడి ఉంటే… టేస్టీ తేజ లేదా హరితేజను బయటికి పంపించాల్సి వచ్చేదేమో… ఈ మూడు వారాల ఇమ్యూనిటీతోపాటు పృథ్వి మీద ఉన్న నెగెటివిటీ కాస్త బ్రేక్ అయ్యేదేమో… ఆ జుట్టు, ఆ గడ్డం నిజంగానే తనకు ఓ పిచ్చోడు లుక్కు ఇచ్చాయి… ఆ రఫ్, ఆ రగ్గడ్ లుక్ పోతే తనకే ఫాయిదా అయ్యేది…

చివరకు ఏమైంది..? ఏ మూర్ఖత్వంతో ప్రేరణను టార్గెట్ చేసి, ఓ ఉన్మాదిలా వ్యవహరించాడో అదే ప్రేరణ ఫస్ట్ సేవ్ అయిపోయింది… టేస్టీ తేజ కూడా సేవ్ అయిపోయాడు… ఇదే పృథ్వి బయటికి పంపించేయబడ్డాడు… ఖేల్ ఖతం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions