.
బిగ్ బాస్ హౌజు నుంచి దివ్వెల మాధురి ఔట్… విశేషమే… సహజమే కూడా..! ఎందుకంటే..? నానాటికీ పడిపోతున్న టీఆర్పీలను పైకి లేపడానికి… దిక్కుమాలిన తంతుతో ఎంపిక చేసిన కామనర్స్ అందరూ పేలవమైన ఆటతీరు చూపిస్తున్నందున… బిగ్ బాస్ టీమ్ తెలివిగా… సారీ, అతి తెలివిగా కంట్రవర్సీ కేరక్టర్లను కావాలని హౌజులో ప్రవేశపెట్టారు…
వాళ్లలో ఇద్దరు ప్రధానం… ఒకరు దివ్వెల మాధురి, మరొకరు పచ్చళ్ల రమ్య… వాళ్లు వచ్చీ రావడంతోనే అందరి మీదా నోరు పారేసుకోవడం స్టార్ట్… అఫ్‌కోర్స్ బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారమే… కానీ అది ఎదురుతన్నింది… ప్రేక్షకులకు నచ్చలేదు… ఫలితంగా రమ్య మొన్ననే ఔట్… ఇప్పుడు మాధురి ఔట్… వాళ్లకు వచ్చిన వోట్లే బిగ్ బాస్ స్కీమ్ ఘోరంగా ఫ్లాపయింది అని చెప్పడానికి నిదర్శనం…
Ads
తనూజ తన దగ్గర ఉన్న గోల్డెన్ స్టార్‌తో మాధురిని రక్షించాలని అనుకున్నా సరే, మాధురే ఇక్కడ ఉండాలని లేదని తనూజ ఔదార్యాన్ని వద్దని చెప్పి, హౌజు నుంచి వెళ్లిపోయింది… ఎస్, నిజం… రమ్య, మాధురిలకు ఈ హౌజు ఆటతీరు అంత త్వరగా ఎక్కదు… అలవాటు కాలేరు… హఠాత్తుగా ప్రవేశపెడితే అందులో ఇమడలేకపోయారు… మాధురి ఏజ్ కూడా బిగ్‌బాస్‌కు నప్పదు… అఫ్‌కోర్స్, రెండో వారానికల్లా ఆమె ఈ ఆటతీరుకు అలవాటైంది… కానీ అప్పటికే లేటైంది… వైరాగ్యమొచ్చింది…
కామనర్స్ ఎంత దరిద్రంగా ఆడుతున్నారంటే… డెమో పవన్ లవ్వు లవ్వు అంటూ రీతూతో ఓ ట్రాక్ నడిపిస్తూ… ఓసారి ఆమెను చెప్పింది విను అంటూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు… ఓ శాడిస్టు ప్రేమికుడిలా… ఐనా సరే రీతూ తననే సమర్థించుకొచ్చింది… ఛల్, నువ్వు వెళ్లిపో అని నాగార్జున కాసేపు డ్రామా ఆడి, ఇక క్షమించేశాడు… బిగ్ బాస్ ఇమేజ్ ముఖ్యం అంటాడు, అక్కడికి ఇప్పుడేదో ఇమేజ్ ఉన్నట్టు…
మరొకరు పవన్ కల్యాణ్… తన మాట తీరు ఏమిటో, తన ఆట ధోరణి ఏమిటో తనను ఎంపిక చేసినవాళ్లకే తెలియాలి… మరీ బెండకాయ కూర గురించి తనూజతో పిచ్చి వాగ్వాదం, ఆ సమయంలో తన బాడీ లాంగ్వేజీ కూడా చిల్లర… ఇవి సరిపోనట్టు… బయటికి వెళ్లిపోయిన శ్రీజ, భరణిలను మళ్లీ హౌజులోకి తీసుకొచ్చారు, ఇదో పిచ్చి స్క్రిప్టు…
ఇద్దరినీ తీసుకొచ్చి, పోటీలు పెట్టి, చివరకు మళ్లీ శ్రీజను పంపించేసి, భరణిని పోటీలో పెట్టింది టీమ్… పక్కా స్క్రిప్టెడ్… మరలాంటప్పుడు ముందే ఎందుకు బయటికి పంపించినట్టు..? మళ్లీ హౌజులోకి వచ్చినా సరే పక్కా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు భరణి… నాగార్జున కూడా అదే అన్నాడు… అంతేకాదు, ఈసారి పాత శివాజీలాగా కన్నింగ్ టాక్టిక్స్ ప్రయోగిస్తున్నాడు… కెప్టెన్సీ టాస్కులో భరణి ధోరణి దరిద్రంగా ఉంది..! ముగ్గురు మగ ఫైర్ స్టామ్స్ హౌజులో ఎందుకున్నారో వాళ్లకూ తెలియదు, నాగార్జునకూ తెలియదు…
తనను పదే పదే నాన్న అంటూ అభిమానించిన తనూజకు వెన్నుపోటు… సరే, ఇది ఆట, తనకు బలమైన పోటీ అనుకున్నవాళ్లను ఎలిమినేట్ చేయించాలనే ఓ విఫల ఆలోచన.., ఈరోజుకూ తనూజ హౌజులో అందరికన్నా బలమైన కంటెండర్… దాదాపు 35 శాతం వోట్లు ఆమెవే…
తనూజకు తత్వం బోధపడింది… అందరినీ నమ్మితే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది… ప్రత్యేకించి ఇమ్మూ..! తనూజకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు… భరణి తదితరులతో కలిసి..! సరే, ఇవన్నీ వోకే… కెప్టెన్సీ టాస్కులో రాము (కావాలనే) దివ్య గెలిచినట్టు ప్రకటించాడు… కానీ అది తప్పు… నాగార్జున ఎందుకు స్పందించలేదు ఈ విషయంలో..? తనూజకు కూడా నాగార్జునతో క్లాస్ పీకించాడు బిగ్‌బాస్…
ఇలా మొత్తం రణరంగం కాదు, దారుణరంగం అనిపించేలా కొత్త కొత్త స్క్రిప్టులు రచిస్తూ బిగ్ బాస్ రోజురోజుకూ తనే అభాసుపాలవుతున్నాడు… ప్రత్యేకించి ఫైర్ స్టారమ్, కామనర్స్ ప్రయోగాలన్నీ ఫెయిల్..!! అన్నట్టు తనూజ సరే, గానీ సుమన్ శెట్టి నిజాయితీగా, సిన్సియర్‌గా ఆడుతున్నట్టు కనిపిస్తోంది..!!
Share this Article