ఈరోజు ఎలిమినేట్ జాబితాలో చేరబోయేది అయిదుగురు… మానస్, ప్రియ, ప్రియాంక అలియాస్ పింకీ, లహరి, శ్రీరామచంద్ర… సరే, ఎవరు ఏం కారణాలు చెప్పారు అనే సోది సంగతి వదిలేస్తే… అందరూ సేఫ్ గేమ ఆడుతున్నారు… ఎలాగోలా బిగ్‌బాసోడు జుత్తు పీక్కుని ఈ అయిదుగురినీ జాబితాలో చేర్చేశాడు… అయితే ఎవరికి మూడింది..? అది ఓసారి చూడాలి… బూతు మాటలకు ప్రసిద్ధి పొందిన సరయు, ఉమాదేవి వెళ్లిపోయారు… అసలు వాళ్లను తీసుకోవడమే ఓ బ్లండర్… వాళ్ల సీన్లను చూపించడమే మరో బ్లండర్… పైగా వాళ్లను నిందిస్తూ నాగార్జునతో పెద్ద పెద్ద పత్తిత్తు మాటలు చెప్పించారు బిగ్‌బాస్ టీం… డర్టీ టీం…
నిజానికి నటరాజ్ మాస్టర్ వెళ్లిపోవాల్సింది, ఆన్లైన్ వోట్లను బట్టి అదే తేలింది, కానీ అన్యాయంగా ఉమాదేవిని పంపించేశాడు బిగ్‌బాస్ అనే ఓ ఆరోపణ ఉంది… లోబోతో నాలుగు రోజులు కామెడీగా వాళ్ల మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తే సరదాగా బాగానే ఉండేది, కానీ ‘ముందస్తు అగ్రిమెంట్లు’ నటరాజ్ మాస్టర్‌ను అంత త్వరగా పంపించడానికి అంగీకరించలేదేమో…! సేమ్, సరయులాగే…. అటు శ్వేతావర్మ, ఇటు సరయు, ఇంకోపక్క ఉమాదేవి… అసలు మొత్తం బిగ్‌బాస్ చరిత్రనే కొత్త మలుపు తిప్పేవాళ్లేమో నాలుగు రోజులు ఉంటే..! భయపడిపోయాడు పిరికి బిగ్‌బాస్… ఇప్పుడిక మరో బూతు సుందరి… అదే మగాడివా గిగాడివా కేరక్టర్ ప్రియ తెర మీదకు వస్తోంది… ఈసారి ఆమెకే స్పాట్ పెట్టాడా బిగ్‌బాస్…? ఒరే పిచ్చి సోంబేరీ… ఎక్స్ట్రీమ్ కేరక్టర్లు అందరూ వెళ్లిపోతే ఇక నువ్వు కోరుకునే బూతు ప్రపంచాన్ని ఆవిష్కరించేవాళ్లు ఎవర్రా నాయనా..? సేమ్ గత సీజన్లాగేనా..? పోయినసారి కల్యాణి మొదట్లోనే ఔట్, తమన్నా తరువాత ఔట్…
Ads
అన్నట్టు తమన్నా అంటే గుర్తొచ్చింది, ఈసారి ఎలిమినేషన్ జాబితాలో ప్రియాంక కూడా చేరింది… తను కూడా తమన్నాలాగే ట్రాన్స్‌జెండర్… కాకపోతే తమన్నా ఎక్స్ట్రీమ్… ప్రియాంక పాలిష్డ్… తన మాట, తన ఆట, తన ప్రవర్తన హుందాగా ఉంటున్నయ్… తనను వదిలేస్తే..,. లవ్ ట్రాకుల కోసం శ్రీరామచంద్ర కావాలి, లహరి కావాలి… మానస్ కూడా బిగ్‌బాస్ మానసపుత్రుడే… ఇక మిగిలింది ఎవరు..? ప్రియ..! ఈ గిగాడు కేరక్టర్ పెద్దగా లవ్ ట్రాకులకూ పనికిరాదు, బిగ్‌బాస్ కోరుకునే బూతు ఎపిసోడ్లకూ సూట్ కాదు… రవి, లహరి హగ్గుల మీద ఆమె చేసిన పిచ్చి ఆరోపణలు కూడా ఆమె మీద negativity పెంచేవే… అందుకని ఆమెకు స్పాట్ పెడతాడేమో… అయితే ఎవడు ఎలా వోటేస్తాడు అనేది బిగ్‌బాస్ టీంకు నథింగ్… వాడి స్క్రిప్ట్ మేరకు వాడు నిర్ణయాలు తీసుకుంటాడు… ఎవరికెన్ని వోట్లు వచ్చాయో వాడు చెబుతాడా ఏం..? చెప్పడు కదా… అంతే… పనికిరారు అంటే పంపించేయడమే… ప్రియా, నువ్వు కాపాడబడితే మళ్లీ కలుద్దాం..!! కాదు, పింకీ బయటికి వెళ్లిపోయాడు, సారీ, వెళ్లిపోయిందీ అనుకుందాం… నీకు మరో వారం చాన్స్ దొరికినట్టే…!! ఈలోపు ఎవరినైనా హత్తుకుపో, బిగ్‌బాస్ వాడు కరుణిస్తాడు..!! హబ్బ, ఇదీ ఓ నటనే కదా తల్లీ…!!!!
Share this Article