Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జబర్దస్త్ ఫైమా, సింగర్ రేవంత్, చలాకీ చంటి… వీళ్లపైనే అందరికన్ను..!

September 4, 2022 by M S R

సహజంగానే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎవరు అనే ఆసక్తి ఉంటుంది కదా… దిక్కుమాలిన సీరియళ్లు, ఆ చెత్తా కథాకథనాలు, ఈటీవీలో వచ్చే తలతిక్క రియాలిటీ షోలతో పోలిస్తే మాటీవీలో వచ్చే బిగ్‌బాస్ మీద ప్రేక్షకులకు ఆసక్తి సహజమే కదా… ఆల్రెడీ షో లాంచింగుకు టైం వచ్చేసింది… ఎంట్రీ తాలూకు షూటింగులు అయిపోయాయి… ఎప్పటిలాగే నాగార్జున కోసం డాన్సులు, అనగా పిచ్చి గెంతుల ఎంట్రీ షూట్స్ కూడా అయిపోయాయి…

కానీ ఎవరు కంటెస్టెంట్లు..? ఇదుగో, కింద ఓ ఫోటో ఇస్తున్నా… మీకు తెలుగు ఆన్‌లైన్, టీవీ వ్యవహారాల ఆసక్తి ఉన్నట్టయితే వీరిని గుర్తించడం వీజీయే… కొందరు ఫిట్ ఫర్ నథింగ్ బాపతు కేరక్టర్లు కూడా ఉంటారు… పెద్దగా ఉపోద్ఘాతాలు, వీళ్ల జీవిత చరిత్రల జోలికి నేను వెళ్లడం లేదు గానీ… దాదాపుగా ఇదే ఫైనల్ లిస్టు…

bb6

Ads

ఇందులో కొన్ని ఇంట్రస్టింగ్ కేరక్టర్లున్నాయి… వాళ్ల గురించి మాత్రం ప్రస్తావిస్తాను… మిగతావి మీ ఇష్టం… సింగర్ రేవంత్… భలే యాక్టివ్… గత బిగ్‌బాస్‌ సీజన్‌లో శ్రీరామచంద్రలాగా ఈ సీజన్‌లో రేవంత్… కాకపోతే శ్రీరామచంద్ర జస్ట్, హమీదా ఒక్కతే… రాముడు మంచి బాలుడు… కానీ రేవంత్ అలా కాదు, శ్రీకృష్ణుడు… మాంచి రసపోషకుడు… తన చుట్టూ బిగ్‌బాస్ టీం ఎన్ని లవ్ ట్రాకులు కుమ్మేస్తారో చూడాలిక…

అభినయ, సుదీప సోసో… నేహ, శ్రీహాన్ అంతే… శ్రీహాన్ అంటే గత సీజన్‌లో ఎవరో నెత్తిమాశిన షణ్ముఖతో హౌజులోనే సిరి హన్మంతు అనే లేడీ కేరక్టర్ ఫుల్ రొమాన్స్ చేసింది కదా… తన లవరే ఈ శ్రీహాన్… టీవీ నటి శ్రీ సత్య గురించి ఆల్‌రెడీ మరో కథనంలో చెప్పుకున్నాం… కీర్తిని కూడా వదిలేస్తే, జబర్దస్త్ చలాకీ చంటి మరో ఇంట్రస్టింగ్ కేరక్టర్… టఫ్ పోటీ ఇవ్వవచ్చు బహుశా… ముదురే కదా…

రోహన్, మరీనా ఓ జంట… గతంలో వరుణ్ సందేశ్, వితికలాగా… ఏదో కాస్త ఎంటర్‌టెయిన్‌మెంట్, అంతే… అర్జున్‌ను వదిలేస్తే గీతు మరో ఇంట్రస్టింగ్ కేరక్టర్… స్పాంటేనిటీ, ఎనర్జీ ఎక్కువే.,. ఎటొచ్చీ కాస్త స్థూలకాయం… బాగా ప్రయత్నిస్తే పలు వారాలు సస్టెయిన్ కావచ్చు తను… వాసంతి, ఇనయ, ఆర్జే సూర్య సోసో… అరిహారావు సెంటిమెంట్ ప్రకారం హౌజులోకి వచ్చే మరో టీవీ9 కేరక్టర్…

షన్నీ, ఆదిరెడ్డి, రాజశేఖర్‌లను కూడా వదిలేస్తే ఫైమా మరో ఇంట్రస్టింగ్ కేరక్టర్… కాస్త జాగ్రత్తగా ఆడితే ఫైనలిస్టు అయ్యేంత ఎనర్జీ, టైమింగు ఉంది ఆమెలో… మిగతా కథ తెర మీద చూడండి… ఎటొచ్చీ, బిగ్‌బాస్ ఓటీటీ 24 గంటల షోలాగా అశ్లీలం శృతి మించకుండా నాగార్జున చూస్తాడా..? లేక తనే కాస్త పెట్రోల్ పోస్తాడా చూడాలి… అసలే మన్మథుడు కదా…!! ఏజ్ మీద పడేకొద్దీ ఇలాంటి యవ్వారాలు ఎక్కువయ్యాయి కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions