రాజకీయాల్లో మైనారిటీల వోట్లు ఎంత బలమైన ప్రభావాన్ని చూపిస్తాయో తెలిసిందే… అందుకే రాజకీయ పార్టీలు వోట్లు చీలిపోయే హిందూ వోట్లకన్నా మైనారిటీ వోట్ల కోసం నానా పాట్లూ పడుతుంటాయి… పైకి సెక్యులర్ జపం చేస్తుంటాయి…
ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అలాంటి చర్చనే లేవనెత్తుతోంది… ఒక వీడియో కలకలం రేపుతోంది… అందులో మెహబూబ్, నబీల్ మాట్లాడుకుంటున్నారు… అందులో మెహబూబ్ అంటున్నాడు… ‘మన ప్లస్ ఏమిటంటే కమ్యూనిటీ ఉంది, దారుణంగా వోట్లు పడతాయి, ఎటొచ్చీ ఇద్దరమూ ఒకేసారి నామినేషన్లలో లేకుండా చూసుకోవాలి’…
అంటే మెహబూబ్ కమ్యూనిటీ వోటింగ్ గురించి స్ట్రెయిట్‌గానే చెప్పేస్తున్నాడు… అసలు బిగ్‌బాస్ అనేదే ఓ కమర్షియల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ గేమ్… భారీ ఖర్చు… అక్కడికి కూడా ఇప్పుడు మతం, కులం వారీ వోటింగు, పరస్పర సహకారాలు ప్రవేశించడం అంటే ఆశ్చర్యమే…
Ads
నిజానికి మెహబూబ్, సొహెయిల్ కూడా గతంలో ఒక సీజనక్‌లో పరస్పరం సహకరించుకున్నారనీ, చివరలో మెహబూబ్ ఇచ్చిన హింట్స్ ఆధారంగానే సోహెయిల్ అర్థంతరంగా డబ్బు తీసుకుని, ఆట స్పిరిట్ వదిలేసి వెళ్లిపోయాడనే విమర్శలూ వచ్చాయి… ఇప్పుడు నబీల్, మెహబూబ్ మధ్య అది రిపీటవుతోందా అనే సందేహాలకు మెహబూబే తావిస్తున్నాడు…
https://www.youtube.com/watch?v=s2fari0POM4&ab_channel=DNRtalks
గత సీజన్లలో ఎప్పుడూ పెద్దగా ఈ కమ్యూనిటీ వోటింగ్ అనే అంశం చర్చకు రాలేదు… ఇప్పుడు కనిపిస్తున్న వీడియో కూడా బహుశా కొత్తది కాదేమో… నబీల్ చేతికి మెగా చీఫ్ బ్యాడ్జి కనిపిస్తోంది… అంటే పాత వీడియో అయి ఉంటుంది… తరువాత మెహబూబ్ మెగా చీఫ్ అయ్యాడు… దానికీ వోటింగుకు సంబంధం లేదు… టాస్కుల్లో మెరిటే డిసైడ్ చేస్తుంది…
కానీ నామినేషన్లలో ఉన్నప్పుడు కమ్యూనిటీ వోటింగ్ నిజంగానే సేవ్ చేస్తున్నదానేది ఇప్పుడు ప్రశ్న… కౌశల్ ఆర్మీతో మొదలై, తరువాత దాదాపు ప్రతి కంటెస్టెంట్ తమకు అనుకూల వోటింగు కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్స్ ఏర్పాటు చేసుకుని, ముందే డబ్బులు చెల్లించి, ఏవో పాట్లు పడుతుంటారు… ఐనాసరే, ఈ ప్రయత్నాలేమీ పెద్ద ఇంపాక్ట్ చూపించవు… హౌజులో పర్‌ఫామెన్సే ఎలిమినేషనో, కంటిన్యుయేషనో డిసైడ్ చేస్తుంది… కొద్దిగా ఎడ్జ్ అవసరమున్నప్పుడు బహుశా సోషల్ మీడియా ప్రచారాలు, ఈ కమ్యూనిటీ వోటింగులు ఉపయోగపడతాయేమో…
గతంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన సోషల్ వింగ్ కులం పేరిట ఒకరిద్దరు కంటెస్టెంట్లకు ఇలాగే క్యాస్ట్ వోటింగు చేయించినట్టు అక్కడిక్కడా విమర్శలు వచ్చాయి… కానీ ఇలా కమ్యూనిటీ పేరిట వోటింగు మీద కంటెస్టెంట్ల నడుమ డిస్కషన్ జరగడం మొదటిసారేమో..!! (చూస్తుంటే రియల్ వీడియోలాగే కనిపిస్తోంది… ఇది రోజువారీ గంట ప్రసారంలో లేనట్టుంది… బహుశా ఎవరైనా 24*7 లైవ్ నుంచి తీసుకుని ఉంటారు…)
.
.
తెలుగు indian idol రియాలిటీ షో విజేత నజీరుద్దీన్ విక్టరీ వెనుక సీక్రెట్ ఏమిటి గీత మాధురి…. Pity తమన్
Share this Article