.
క్రియేటివ్ టీం మార్చినా సరే… ఏదో నాగార్జునతో అన్‌లిమిటెడ్ ట్విస్టులు అని చెప్పించినా సరే… ఏవేవో కథలు పడ్డా సరే… ఈసారి బిగ్‌బాస్ సీజన్, అంటే ఎనిమిదో సీజన్ అట్టర్ ఫ్లాప్…
ఇదే మాట గతంలోనూ ముచ్చటించుకున్నాం కదా… కారణాలనూ చెప్పుకున్నాం… షో టీఆర్పీలు పడిపోయేకొద్దీ ఏవేవో జాకీలు పెట్టారు, లేపడానికి ట్రై చేశారు కానీ సక్సెస్ కాలేదు… ఈ షో ఎంత ఫ్లాపో చెప్పాలంటే ఫినాలేకు వచ్చిన రేటింగ్సే తార్కాణం…
Ads
ఫినాలేకు… గెస్టులు, విజేత ఎవరనే ఉత్కంఠ, పాటలు, డాన్సులు, సినిమా ప్రమోషన్లు, జోకులు, హంగామా, ఆడంబరం, భారీ ఖర్చు గట్రా అన్నీ ఉంటాయి… మూణ్నాలుగు గంటలపాటు సాగే షో… మంచి రేటింగ్స్ రావాలి కదా…
ప్చ్… జస్ట్, 8.75 జీఆర్పీలు మాత్రమే… ఆ వారం రేటింగుల్లో టాపులో ఉండాలి… కానీ అది చివరకు కార్తీకదీపం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని, మగువా ఓ మగువా, గుండెనిండా గుడిగంటలు సీరియళ్ల తరువాత ప్లేసు… చివరకు జీతెలుగులో వచ్చే మేఘసందేశం సీరియల్‌తో పోటీపడింది బిగ్‌బాస్ ది గ్రేట్ ఫినాలే…
కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేకపోవడం ప్రధాన కారణం… తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కొందరిని ప్రవేశపెట్టినా వాళ్లూ ఫ్లాపే… నయని పవని, హరితేజ, మెహబూబ్, గంగవ్వ ఇలా వరుసగా నిష్క్రమించారు… తమ కామెడీతో, ఎనర్జీతో కాస్త షో నిలబెట్టింది అవినాష్, రోహిణి… టేస్టీ తేజ ఓవరాక్షన్, గౌతమ్ మెంటల్ యాక్షన్ కూడా చిరాకెత్తించాయి…
విష్ణుప్రియను ఆహా ఓహో అని నాగార్జున మోశాడు గానీ… ఆ నత్తి బ్రెయిన్ ఈ షోకు పనికిరాదు, రాలేదు… యష్మి, ప్రేరణ నయం… మణికంఠ వేస్ట్, అఫ్‌కోర్స్, నిఖిల్ ఆటకు వోకే గానీ ఎంటర్‌టెయిన్‌మెంట్ చేతకాదు… పృథ్వి పరమ వేస్ట్… చివరకు కన్నడ వర్సెస్ తెలుగు అనే పిచ్చి తగాదాకు తెరతీసినా సరే… షో మాత్రం పైకి లేవలేదు…
రెగ్యులర్ స్పాన్సరర్స్ తప్ప కొత్తగా ఏ కంపెనీ యాడ్స్ ఇచ్చినట్టు లేదు… పెద్దగా సినిమా ప్రమోషన్స్ కూడా లేవు… కంటెస్టెంట్లతోనే యాడ్ స్కిట్స్ చేయించేవాళ్లు గతంలో… ఈసారి పెద్దగా కనిపించలేదు… పైగా ఈసారి కంటెస్టెంట్లకు భారీగా పేమెంట్స్ ఇచ్చారట… వెరసి తడిసిమోపెడు… అంతిమంగా ఈ సీజన్‌తో ఏమైనా లాభమొచ్చిందా..? నష్టం తప్పలేదా అనేది పక్కన పెడితే…
రొటీన్ ఫార్మాట్‌లో ఈ షో ఇలాగే నడిపిస్తే… తొమ్మిదో సీజన్ కూడా అంతే… ప్రేక్షకులకు కొత్తదనం కావాలి… అది కరువైంది… అవే నామినేషన్లు, చిల్లర కారణాలు, అరుపులు, కృత్రిమంగా గొడవలు… ఒకరిద్దరి లవ్ డ్రామాలు… పదే పదే అవి చూడటానికి ప్రేక్షకుడు ఆసక్తిగా లేడు..!!
Share this Article