అభయ్… సిద్దిపేట పరువు తీసినవు కదరా భయ్… దిక్కుమాలిన ఆట ఆడినవ్, బిగ్‌బాస్ ను బొక్కా, మైండ్‌లెస్ అని బూతులు తిడుతవ్… నీ టీం వాళ్లు తన్నుకుంటుంటే నవ్వుకుంటూ పక్కన కూర్చుంటవ్… ఇప్పుడంటే ఇప్పుడు బయటికి పోతా అని డొల్ల సవాళ్లు విసురుతవ్… మళ్లీ ఇవన్నీ జోకులు, నచ్చకపోెతే మానేస్తా అని తిక్క కబుర్లు చెబుతవ్…
తీరా నాగార్జున వచ్చి రెడ్ కార్డు చూపించి వెళ్లిపో అంటే ఎడ్డిమొహం వేస్తవ్… తలదించుకుంటవ్… బాబ్బాబు, ఇంకో చాన్స్ ఇవ్వు అని బతిమిలాడుతవ్… మిగతా హౌజ్ మేట్లు జాలిపడి బిచ్చం వేసిన కొనసాగింపు… అందుకే నువ్వు సిద్దిపేట పోరడివని చెప్పుకోకు… సిద్దిపేట పోరడు సిగ్గుపడడు, ఛల్, ఈ ఆఫ్టరాల్ మరో రెండు ఎపిసోడ్లకు బిచ్చం తీసుకోవడం ఏందిరా భయ్, బిగ్‌బాసోడు కట్ చేసినా సరే, బయట చెబుతా వీడి రూల్ లేనితనం అన్నావు కదా… ఏమైందిర భయ్… ఛిఛీ, మరీ విష్ణుప్రియకన్నా అధ్వానం అయిపోతివి కదరా…
విష్ణుప్రియ… అసలు ఉన్నదే చటాక్ బుర్ర… అదీ సరిగ్గా పనిచేయదు, నత్తి… ప్రేరణ తనకు దోసె బిచ్చం వేసినట్టు, జైల్లో ఖైదీలకు వేసినట్టు ఉందట, ఏడ్చింది… దీనికి పెంట పెంట చేయడానికి మరో మెంటల్ కేసు మణికంఠ ఉంటాడు కదా… ఇద్దరిదీ ఓవరాక్షనే… చెత్తా గేమ్… అసలు విష్ణుప్రియకున్న బుర్రే చటాక్ అనుకుంటే సేమ్ బరువుతో ఉన్నాయి అందరి బుర్రలూ…
Ads
సామధానభేదదండ తరువాత ఉపాధ్యాయ అన్నది విష్ణుప్రియ… అసలు పదం ఏమిటో చెప్పమని నాగార్జున అడిగితే ఒక్కడి దగ్గర సమాధానం లేదు… కన్నడ గ్యాంగుకు మన తెలుగు భాష సరిగ్గా రాకపోవచ్చు, విష్ణుప్రియ నత్తి బుర్రకు తెలియకపోవచ్చు… కుళ్లిపోయిన మణికంఠకు కూడా తెలియకపోవచ్చు… మరి మిగతావాళ్లు..? సో, అందరూ సోసో… అందరి మెదళ్లూ మోకాళ్లలోనే అన్నమాట…
అన్నట్టు మణికంఠ దగ్గర ఆగాం కదా… విష్ణుప్రియ వాడు హగ్ చేసుకుంటానంటే వామ్మోయ్ అని పారిపోయింది… యష్మి అయితే ఒరేయ్, చాలా ఇబ్బందిగా ఉంది, నిన్ను ప్రతిసారీ నామినేట్ చేస్తాను అని ఛీత్కరించింది… మరోవైపు సింపతీ కార్డు… నాగార్జున బూతులు తిట్టాడు… ఐనా సిగ్గులేదు… అఫ్‌కోర్స్, సిగ్గుకూ, మెంటల్‌కూ పొంతన కుదరదు కదా…
ఈ వేషాలు, ఈ పైత్యాలు వదిలేస్తే… నాగార్జున ఓ మాటన్నాడు… నిఖిల్, నిన్ను బీట్ చేసే వాడెవడొస్తాడో చూద్దాం అని… ఎస్.., అవినాష్, రోహిణి, హరితేజ వస్తున్నారు, ఎంట్రీ షూట్ అయిపోయింది… ప్రస్తుతం హౌజులో ఉన్న మెంటల్ కేసులకు విరుగుళ్లు ఈ కేరక్టర్లు… అవునూ, నాగార్జునా… పర్ సపోజ్, వోటింగులో జనం ఒరేయ్ అభయ్ నువ్వు వెళ్లిపోరా అని తీర్పు చెబితే… అప్పుడేం చేస్తవ్..? అందరినీ అడిగి రెడ్ కార్డు విత్ డ్రా చేసుకుని కాపాడావు కదా… మరి జనం ఛీత్కరిస్తే ఏం చేస్తవ్… ఐనాసరే, అభయ్‌ను కాపాడి పృథ్విని పంపించేస్తావా..? మొత్తానికి ఓ ఎర్రగడ్డ సీజన్..!!
Share this Article