Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బుర్ర తక్కువ బిగ్‌బాస్..! ఈ సంచాలక్ ఎంపికలేమిట్రా బాబూ…!!

October 31, 2024 by M S R

అందరికీ పిచ్చి పిచ్చి టాస్కులు ఇస్తూ… క్రియేటివిటీలో తోపులం మేం అని ఫీలయ్యే బిగ్‌బాస్ టీం బిత్తరపోయింది… తల దిమ్మెక్కిపోయింది అనడం కరెక్టేమో… ఇద్దరు సంచాలక్స్ తీరు చూసి నెత్తిన చేతులు పెట్టుకుని బావురుమంటున్నాడేమో…

ఆపిల్స్ టాస్క్‌లో పృథ్విని సంచాలకుడిగా పెట్టారు… పెద్ద బ్లండర్… అంతకుముందే ఎవరినో ఆటలో నేను ఓడిపోయినా సరే, మిమ్మల్ని టార్గెట్ చేస్తాను అని అరిచాడు కదా… అసలే మెంటల్ కేసు.., కోపం, కూతలు, కేకలు, అసహనం అన్నీ ఉన్న విచక్షణారహితుడు… పైగా అందరితోనూ పులిహోరల స్పెషలిస్టు…

అడ్డదిడ్డంగా వాదించే తనను సంచాలక్‌ను చేయడమే పెద్ద తప్పు… జడ్జిమెంట్ కూడా అలాగే ఏడ్చింది… మా టీమే విన్నర్ అనేశాడు… అది తన టీమ్‌లోని వాళ్లే షాకయ్యారు… ఓడిపోయిన నిఖిల్ టీమ్ తనవైపు ఓసారి జాలిగా చూసి, ఇలాంటి బిగ్‌బాస్ పిచ్చి నిర్ణయాలను చూసి, తమలో తామే వైరాగ్యంతో నవ్వుకున్నారు…

Ads

అంతకుముందే పానీపట్టు టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్న హరితేజ కనీసం తన వాదనను సమర్థంగా, కన్విన్సింగుగా చెప్పగలిగింది… నిజానికి ఆమె నేను ఆడతాను ఆడతాను అంటే బలవంతంగా ఆమెను సంచాలక్ చేశాడు బిగ్‌బాస్… కారణం గంగవ్వ…

ఆమెను హౌజులోకి ఎందుకు తెచ్చారో ఈరోజుకూ ఎవరికీ అర్థం కాని మిస్టరీ… ఆమెకు కోపం వస్తే నాగార్జునకు వస్తుంది… ఎవరూ ఆమెను నామినేట్ చేయరు… ఎవరిని ఏమన్నా రియాక్ట్ కారు… ఆమె ఏ పనీ చేయదు… అందరూ అన్ని పనులూ చేస్తుంటారు… గంగవ్వ మినహా… హైపర్ ఆది చెప్పినట్టు… ఊళ్లలో అరుగుల మీద కూర్చుని వచ్చీపోయే వాళ్ల మీద ఓ రకమైన పెత్తనం ధోరణి ప్రదర్శిస్తారు కదా, ఆ టైపు…

సరే, 13 మందిలో నాలుగు టీమ్స్… 12 మంది అడ్జెస్టయ్యారు… గంగవ్వను సహజంగానే ఎవరూ తీసుకోరు కదా… ఆమె ఆడలేదు, అసలు కుదురుగా ఒక్కచోట చాలాసేపు కూర్చోవడమే కష్టం… తప్పనిసరై నిఖిల్ టీమ్‌లోకి అదనపు సభ్యురాలిగా తీసుకున్నారు… నామ్‌కేవాస్తే…

బిగ్‌బాస్‌ వాడికి పానీపట్టు టాస్క్ సమయంలో హఠాత్తుగా బుర్రలో ఏదో మెసిలినట్టుంది… ఏకంగా గంగవ్వను సంచాలక్‌ను చేశాడు… అసలే టాస్కుల్లో హీట్ బాగా జనరేటవుతూ ఉంటుంది… వాదించుకుంటారు, ఒకరిపైకి ఒకరు ఎగబడుతుంటారు… ఫౌల్ గేమ్స్ ఆడుతుంటారు… తిట్టుకుంటుంటారు… సంచాలక్ ఎవరైనా సరే కూల్‌గా, బ్యాలెన్స్‌గా, నిజాయితీగా వ్యవహరించాలి…

లేకపోతే నెక్స్ట్ నామినేషన్లలో ఫస్ట్ వాళ్లే టార్గెట్ అవుతారు… గంగవ్వకు ఆ భయం లేదు… అసలు ఆటను కీన్‌గా గమనించలేదు, అదే జరిగింది… దాంతో బిగ్‌బాస్ తలపట్టుకుని మళ్లీ హరితేజను తీసుకొచ్చి నిర్బంధంగా సంచాలక్‌ను చేశాడు… అక్కడా నబీల్, పృథ్వితోనే గొడవ, రచ్చ… పృథ్వి ఉన్నాడంటే అడ్డదిడ్డం గొడవలు ఉంటాయి కదా…

తమకు యెల్లో కార్డు రాగానే ఫస్ట్ గంగవ్వను ఆట నుంచి తీసిపారేసి, పోనీలే, దీనికి ఉపయోగపడింది అనుకుని నిఖిల్ టీమ్ తేలికగా ఊపిరి పీల్చుకుంది… అవునూ, ఇంతకూ గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ బిగ్‌బాస్ ఆశించిన ఫాయిదా ఏమిటో పెద్ద మిస్టరీ…! ఈసారి ఆటలో చాలా మంది కంటెస్టెంట్లు లయబులిటీయే… బహుశా ఈసారి వోటింగులో యష్మి అందరికీ షాకిచ్చే రేంజులో ప్రథమ స్థానంలోకి చేరి… ఏడుపుగొట్టు నయని పవని నిష్క్రమించకతప్పదేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions