మ్యాటర్ లేదా..? ఈ రెండు పదాల వాక్యాన్ని టీవీలు బూతుగా మార్చేశాయి ఏనాడో… నిజానికి మామూలుగా వింటే, చదివితే, అంటే అది బూతు కాదు… చాలా సరళమైన, చాలా సాధారణమైన వాక్యం… కానీ మన టీవీలు బూతును ధారాళంగా జనంలోకి తీసుకురావడంలో ఎఫీసియెంట్ కదా… దాని అర్థమే మార్చేశారు…
ఎవడినైనా పట్టుకుని, ఏరా నీకు మ్యాటర్ లేదా అనడిగితే… నీకు పొటెన్సీ లేదా..? నపుంసకుడివా..? అనే అర్థమే ఇప్పుడు… ఓ మగాడ్ని, అదీ ఓ షార్ట్ టెంపర్, కాస్త వెర్రి ఉన్న మగాడ్ని ఆ మాటంటే ఇంకెలా ఉంటుంది..? ఫ్లోలో ఇంకేదో మామూలు అర్థంతో అన్నా సరే, అదిప్పుడు బూతే…
బిగ్‌బాస్ హౌజు ఈసారి మెంటల్ కేసులతో నింపేశారు అని పలుసార్లు చెప్పుకున్నాం కదా… అందులో గౌతమ్, నయని పవని కూడా..! ఆమె ఎవరితో ఏదో మాట్లాడుతోంది… మనకు సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు… ఈలోపు హఠాత్తుగా ఏడుస్తుంది… ఏడుపుకు ఐకన్… మధ్యలో గౌతమ్ చిరాకుగా మొహం పెట్టి, మ్యాటర్ లేకపోయినా ఇష్యూ దేనికి అన్నాడు…
Ads
తను అన్నది మామూలు అర్థంలోనే… గొడవ పడేంత విషయం లేకపోయినా అనవసరంగా ఎందుకు గెలుక్కోవడం అనేది తన భావన… కానీ ఎదురుగా ఉన్నది నయని పవని కదా… తిక్క… మధ్యలో నువ్వెందుకు దూరుతున్నవ్ మేమిద్దరం మాట్లాడుకుంటుంటే… మ్యాటర్ లేకపోవడం ఏమిటి..? అసలు నీకు మ్యాటర్ ఉందా అనేసింది… (దురర్థంలో అనలేదు గానీ అదలాగే పోట్రే అవుతుంది)…
గౌతమ్ షాక్… ఏమిటీ పిల్ల, ఇంత మాటనేసింది అని… మరి అదీ తిక్క కేసే కదా… హలో, ఏమిటా మాటలు..? మ్యాటర్ లేకపోవడం ఏమిటి అక్కా అన్నాడు… బిగ్‌బాస్ హౌజు కల్చర్ ప్రకారం అక్క అని పిలిపించుకోవడం నామర్దా కదా… నామోషీ కదా… అవమానంగా ఫీలైంది… అక్కా ఏంటి అక్కా, నన్నలా పిలిస్తే బాగుండదు గౌతమ్ అని తర్జని చూపించింది…
విసురుగా లోపలకు వెళ్తూ లైట్ తీసుకో బ్రో అని ఏదో అంది… ఆమెను అక్కా అంటే హర్ట్ కాగా లేనిది గౌతమ్‌ను బ్రో అంటే ఫాఫం ఫీల్ కాడా మరి… ఇదేమిటి బిగ్‌బాస్‌లో అక్కా అని పిలిస్తే కూడా మనోభావాలు దెబ్బతింటాయా అంటూ తన మనోభావాలు దెబ్బతీసుకున్నాడు… ఇలా ఉంటయ్ బిగ్‌బాస్‌లో పిచ్చి గొడవలు… (విష్ణుప్రియ, సోనియా పుణ్యస్త్రీ వివాదం తెలుసు కదా… ఇలాంటిదే)
నిన్న ఎవరో కొందరు రాసుకొచ్చారు… నయని పవని ఎలిమినేట్ కాకపోవచ్చు, ఎందుకంటే..? వచ్చేవారం ఫ్యామిలీ వీక్, అంటే కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు హౌజుకు వస్తారు… నయని కోసం శివాజీ వచ్చే వీలుంది… శివాజీ గత సీజన్ గరుడ పురాణ కంటెస్టెంట్ తెలుసు కదా… ఆ సీజన్లోనే నయని ఫస్ట్ వీకే బయటికి వచ్చేసింది… ఆలోపే ఆ ఇద్దరి నడుమ ఆత్మీయ బంధం ఏర్పడిందట…
సో, శివాజీ వస్తాడు కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేయకుండా హరితేజను పంపిస్తారేమో అనేది ఆ రాతల సారాంశం… సీజన్ అయిపోయినా సరే, శివాజీ నీడ మాత్రం బిగ్‌బాస్‌ను వదలదా..? శివాజీ కోసం ఆట మారుతుందా..? హేమిటో…!! బట్, ఆ రాతలెలా ఉన్నా సరే, నయని పవని ఎలిమినేషనే పక్కా… మరీ లీస్ట్ వోటింగ్… చిరాకెత్తిస్తోంది నిజంగానే… హబ్బే, వోటింగ్ బట్టి ఎలిమినేషన్లు ఉండవు కదా మాస్టారూ అంటారా..? మీరన్నదీ నిజమే… అసలే అది బిగ్ మెంటల్ హౌజ్..!!
Share this Article