ఈరోజు వీకెండ్ షో పెద్ద ఆసక్తికరంగా లేదు… అలాగని మరీ తీసికట్టు కూడా కాదు… ఈసారి సీజనే నిస్సారంగా ఉంది… ఈ ఒక్క వీకెండ్ షోను అనడానికి ఏముంది..?
అనుకున్నట్టుగానే నయని పవని వెళ్లిపోయింది… ఏడుపుకు ఐకన్… క్రయింగ్ స్టార్… కానీ విచిత్రం ఏమంటే నవ్వుతూ వెళ్లిపోయింది… ఎవరినీ బాధపడవద్దనీ కోరింది… గత సీజన్‌లో ఒక వారమే ఉన్నా, ఈసారి ఎక్కువే ఉన్నా అనుకుంటూ హేపీగా నిష్క్రమించింది…
నిజానికి ఆమెకు బిగ్‌బాస్ ఆట మీద ఓ స్ట్రాటజీ లేదు… కాస్త మెంటలే… సరే, వచ్చింది పోయింది… ఇక్కడ చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే..? వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన ఎనిమిది మందిలో మెహబూబ్, నయని వెళ్లిపోయారు… గంగవ్వ ఉండీ లేనట్టే… ఇక ఐదుగురిలో హరితేజ ఈసారి ఎలిమినేషన్ తృటిలో తప్పించుకుంది… అంత పూర్ పర్‌ఫామెన్స్, జనానికీ నచ్చడం లేదు…
Ads
రోహిణి ఓ ఎంటర్‌టెయినర్‌గా వోకే… గుడ్… యాక్టివ్… కానీ ఏ టాస్కులోనూ ఆమె కనబరచాల్సినంత ఫైర్ చూపించలేకపోతోంది… ఆమె స్థూలకాయం కాదు అడ్డంకి, ఆమె ఆటతీరే అంత… గౌతమ్ పక్కా మెంటల్, నెగెటివ్ కేసు… అవినాష్ కూడా మంచి ఎంటర్‌టెయినరే… మెగాచీఫ్ అయ్యాడంటే అది నబీల్ తప్పుడు స్ట్రాటజీతో గేమ్‌ను అవినాష్‌కు అప్పగించడం వల్ల గెలిచాడు తప్ప అవినాష్ ఎఫిషియెన్సీ కాదు…
టేస్టీ తేజ స్టామినా సహకరించడం లేదో, బాడీ బరువు అడ్డంకిగా మారిందో తెలియదు గానీ… మొదట్లో ఉన్న ఫైర్ ఇప్పుడు లేదు… సో, స్థూలంగా చూస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన వాళ్లంతా తుస్… ఎస్… తుస్సే… ఉన్నంతలో అవినాష్ ఒక్కడు పర్లేదు… మొదట హౌజులోకి వచ్చిన కంటెస్టెంట్లు సరిగ్గా ఆడటం లేదని కొత్తగా అనుభవమున్న పాతకాపుల్ని తీసుకొస్తే తీవ్రంగా నిరాశపరుస్తున్నారనేది సారాంశం…
మొదట వచ్చిన వాళ్లలో మిగిలింది ప్రధానంగా ప్రేరణ, యష్మి, నబీల్, నిఖిల్, విష్ణు, పృథ్వి… వీరిలో పృథ్వి మెంటల్, కోపిష్టి… పక్కా పులిహోర బ్యాచ్… మొదట్లో యష్మి మీద బాగా నెగెటివిటీ కనిపించినా తన ఆటతీరుతో ఆమె వరుసగా సేవ్ అవుతూనే ఉంది… ఒక దశలో వోటింగులో అగ్రస్థానం… సేమ్, ప్రేరణ, ఆమె మీద కూడా కాస్త నెగెటివిటీ పెరిగినా ఆమెకూ బాగానే జనం వోట్లేస్తున్నారు…
నిఖిల్ సరేసరి… ప్రస్తుతం హౌజులో టాప్ ప్లేయర్ తనే… అప్పుడప్పుడూ బ్యాలెన్స్ కోల్పోతున్నా, స్థూలంగా వోకే… నబీల్ మొన్న అవినాష్‌కు అప్పగించి తప్పు చేశాడు, తగ్గిపోయాడు తనే… విష్ణు జస్ట్ వోకే… సో, చివరాఖరుకు ఏం తేలింది..?
కన్నడ బ్యాచ్ మీద ఏదేదో రాసి ఓ సెక్షన్ తమను తాము శాటిస్‌ఫై చేసుకుంటోంది, తెలుగోళ్లను తొక్కేస్తున్నారు అనే తప్పుడు ముద్రలు వేస్తోంది గానీ… బర్డ్ ఐవ్యూలో చూడండి… అదే కన్నడ బ్యాచే ఓ స్ట్రాటజీతో ఆడుతోంది… అన్ని సవాళ్లను తట్టుకుంటూ… వాళ్లే జనాదరణ పొందుతున్నారు… అదీ రియాలిటీ..!!
Share this Article