బిగ్‌బాస్ ఆటే టోటల్లీ అన్ ఫెయిర్… సో, సరదాగా ఓ చిన్న విషయం… మెగా చీఫ్ కాంటెస్టులో లక్కీగా రోహిణికి తను ఎంచుకున్న కంటెస్టెంటుతో లక్‌డీకాపూల్ ఆట ఆడే అవకాశమొచ్చింది…
సింపుల్‌గా ఆమె గంగవ్వతో ఆడతానని చెప్పి ఉండాల్సింది… ఫెయిర్ కాదు, అనకండి… బిగ్‌బాస్ ఆటలో అన్‌ఫెయిర్ అనేదే లేదు… ఆమె కూడా అందరిలాగే కంటెస్టెంటే కదా… కానీ ఆమె హరితేజను ఎంచుకుంది… కన్నడ బ్యాచుతో పోటీ అయితే కష్టం అనుకుందేమో…
సరే, హరితేజతో పోటీపడింది… హరితేజ ఓడిపోయింది… రోహిణి గెలిచింది… అప్పుడు బిగ్‌బాస్ మరో చాన్స్ ఇచ్చాడు… ఎవరినైనా ఒకరిని మెగా చీఫ్ కంటెండర్‌ను చేయొచ్చు అని… అప్పుడైనా ఆమె గంగవ్వను ఎంచుకోవాల్సింది… ఎందుకంటే, తనకే పోటీ తగ్గి ఉండేది… కానీ ఆమె ప్రేరణకు చాన్స్ ఇచ్చింది… చెప్పిన కారణం కూడా హుందాగా, పాజిటివ్‌గా ఉంది… ఆమె కన్నడ గ్యాంగ్ అని రోహిణి దూరం పెట్టలేదు… గుడ్… ప్రేరణే నమ్మలేకపోయింది ఫాఫం…
Ads
తరువాత షేప్ యువర్ ఫ్యూచర్… గౌతమ్ తన పోటీదారుగా నబీల్‌ను ఎంచుకున్నాడు… నబీల్ బలమైన కంటెంస్టెంట్… తనకు ఎంచుకుని తప్పు చేశాడు… గంగవ్వ వంటి పూర్ పర్‌ఫార్మర్‌ను స్ట్రాటజిక్‌గా ఎంచుకోవాల్సింది… ఆ తప్పుకు మూల్యం చెల్లించాడు… నబీల్ గెలిచాడు…
ఒక ఈక్వేషన్ ముందుగా చూద్దాం… మొదటి నుంచీ హౌజులో ఉన్నవాళ్లకే అంతిమ విజేత అవకాశం రావాలనేది నైతికత… మధ్యలో వచ్చినవాళ్లకు అంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కు చాన్స్ ఉండొద్దు… ఎంత బలమైన పోటీ ఇచ్చినా సరే…
సరే, మొదట్లో వచ్చినవాళ్లలో మిగిలింది ఎవరు..? నలుగురు కన్నడ బ్యాచ్ ప్లస్ విష్ణుప్రియ ప్లస్ నబీల్… వీళ్లలో నబీల్ పదే పదే స్ట్రాటజిక్ బ్లండర్స్ చేస్తున్నాడు, తను బలమైన పోటీదారుడు అయినా సరే…! విష్ణుప్రియ నత్తి బ్రెయిన్ అని కాదు, తను భోళా… అప్పట్లో సోనియాతో పుణ్యస్త్రీ గొడవ తప్ప పెద్దగా వేరేవాళ్లతో గొడవల్లేవు ఆమెకు… బట్ పూర్ పర్‌ఫర్మార్…
కానీ… మొన్నటిదాకా ఆమెను మోసిన మీడియా సెక్షన్‌కు ఇక ఈమెకు అంత సీన్ లేదని అర్థమై, ఇక గౌతమ్‌ను మోయడం ప్రారంభించింది… అనధికారిక పోల్స్‌లో కూడా గౌతమ్‌ను పైకి లేపుతున్నారు… నిఖిల్ మీద కోపం… కానీ గౌతమ్ పెద్ద మెంటల్ కేసు… చిన్న విషయానికీ ట్రిగ్గర్ అవుతాడు, కోపం, బ్యాలెన్స్ ఉండదు, ఓ స్ట్రాటజీ కూడా ఉండదు…
(తెలంగాణ స్లాంగులో అక్కా అంటే గౌరవం అట, ఏదో చెబుతున్నాడు… మూర్ఖత్వం… అక్కా అంటే మొత్తం తెలుగులోని ఏ యాసలోనైనా గౌరవమే… కానీ గౌతమే తనకు పడకపోతే, తన పులిహోర వికటిస్తే ఇక అక్కా అని వ్యంగ్యాన్ని పదే పదే ప్రదర్శిస్తున్నాడు… అదీ ఇతర లేడీ కంటెస్టెంట్లకు చిర్రెత్తిస్తోంది… పక్కాగా గౌతమ్‌దే తప్పు…)
నబీల్, విష్ణులను వదిలేస్తే ఇక పాత బ్యాచులో మిగిలింది మళ్లీ అదే కన్నడ బ్యాచ్… పృథ్వి కూడా మెంటల్ కేసే… సో, తనను వదిలేస్తే ఇక మిగిలింది ముగ్గురు… యష్మి, ప్రేరణ, నిఖిల్… ముగ్గురూ ఫైటర్లే… సో, ఆట రక్తికట్టింది… నబీల్ యష్మిని ఈ మెగా చీఫ్ పోటీలోకి అనూహ్యంగా తీసుకొచ్చాడు… అవినాష్‌కు ఎలాగూ ఇమ్యూనిటీ ఉంది… రోహిణి నామినేషన్లలోనే లేదు… సో, ఏరకంగా చూసినా హరితేజ డేంజర్‌లో పడిపోతోంది..!! నిజంగానే ఆమె వ్యూహాలు, ఆటతీరు చిరాకెత్తిస్తోంది కూడా..!!
Share this Article