ఒక ఆట… కీ పట్టు దాని పేరు… కంటెస్టెంట్లు ఎక్కడెక్కడో ఉన్న తాళపు చెవులను తెచ్చి… తాళాలు, గొలుసులతో బంధించి ఉన్న తమ గెలుపు పత్రాన్ని సాధించాలి…
విష్ణు ప్రియ, పృథ్వి… హౌజులో లవ్ ట్రాక్ నటిస్తున్న జంట… వాళ్లిద్దరే పోటీదారులు… విష్ణు ప్రియ మామూలుగానే మఫ్… కానీ ఇక్కడ యాక్టివ్‌గా వ్యవహరించింది… కానీ తీరా లోపల ఉట్లు పగులగొట్టి, ఆ శిథిలాల్లో కీ వెతుక్కునే దశలో…
పృథ్వి అంతకు ముందు దశలో సాధించిన కీ అక్కడ పారేశాడు… ఎందుకు..? విష్ణు ప్రియను తెలివిగా బోల్తా కొట్టించడానికి… అనుకున్నట్టుగానే ఆమె ఆ కీ తీసుకుని, బయటకు వచ్చి ఆ కీతో తాళం తెరవడానికి విశ్వప్రయత్నం చేసింది… టైమ్ వేస్ట్…
Ads
ఈలోపు పృథ్వికి కీ దొరికింది, వచ్చాడు, విష్ణుప్రియ వైపు విజయగర్వంతో చూశాడు… ప్రేమికుడు కదా, ఆమె కూడా ఏమీ అనలేదు, తనే గెలిచినంత ఆనందాన్ని నటించింది… అతను కూడా గెలుపుతో సాధించిన ఇంకో చాన్స్‌ను ఆమెకు ధారాదత్తం చేశాడు… అక్కడా ఆమె ఓడిపోయింది, అది వేరే కథ…
ఏముంది ఇందులో అంటారా..?
- పృథ్వి మోసంతో గెలిచాడు ఆటను… అదీ ప్రేమికురాలి మీద… మెంటల్ కేస్… ఆ ఆడిన తీరే తప్పు… ఐనా బిగ్‌బాస్‌లో ఫెయిర్, అన్‌ఫెయిర్ ఉండదు కదా… వోకే…
- లోపల కీ వెతుకుతున్నప్పుడు నబీల్ ఉన్నాడు… పృథ్వి కావాలని మిస్ లీడ్ చేయడానికి వదిలేసిన కీ చూసి, విష్ణుప్రియకు చూపించాడు… తనకెందుకు..? అది వెతుక్కునే పని ఆమెది… ఇక్కడ నబీల్ తప్పు…
- ఆట మొత్తం అయిపోయాక టేస్టీ తేజ అంటున్నాడు, రోహిణి కూడా… ఎక్కడి కీ అక్కడే ఉంచేయాలని రూల్స్ బుక్ లో ఉంది, మరి ఇంకో దశ ఆటలోకి దాన్ని తీసుకుపోవడం తప్పు కాదా అని… అవును, పృథ్వి చేసిన తప్పును ఆడుతున్నప్పుడే ఆక్షేపించాలి కదా… అది ఆ ఇద్దరి తప్పు…
- సంచాలక్‌గా వ్యవహరిస్తున్న యష్మి దాన్ని గుర్తించాలి కదా… నిలువరించాలి కదా… ఏమీ చేయలేదు, సోది… మరిక సంచాలక్‌గా ఉన్నది దేనికి..? అది ఆమె తప్పు…
- పృథ్వి ఫౌల్ గేమ్ ఆడుతుంటే వెంటనే ఖంగుమనే కంఠంతో హెచ్చరించాలి కదా బిగ్‌బాస్… చేయలేదు, అది తన తప్పు…
సో, ఇక్కడ అందరూ పృథ్వి స్ట్రాటజిక్‌గా ఆడినట్టు… తన ఘనతగా భావించారా..? నాన్సెన్స్… విష్ణు ప్రియ నత్తి బ్రెయినే కావచ్చుగాక… కానీ ఫెయిర్‌గా ఆడింది, ఎఫర్ట్ పెట్టింది… ఐనా ఓడిపోయింది… స్ట్రాటజీ అన్‌ఫెయిర్ బాటలో ఉండకూడదు… అంత సోయి, నిజాయితీ ఉంటే అతను పృథ్వి ఎందుకు అవుతాడు..?! సో, అర్థమైంది కదా… బిగ్‌బాస్ అంటేనే ఓ తొండి యవ్వారం..!!
Share this Article