అసలే ఎర్రగడ్డ హాస్పిటల్… అదనంగా వైజాగ్ హాస్పిటల్ నుంచి కొందరిని పట్టుకొచ్చినట్టుగా మారింది బిగ్‌బాస్ హౌజ్ సిట్యుయేషన్… పాత వాళ్లు ఆటను రక్తికట్టించలేకపోతున్నారు అనుకుని మునుపటి సీజన్ల బాపతు సీనియర్లను తీసుకొచ్చి హౌజు నింపితే… పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా… ఇంకాస్త విసిగిస్తున్నారు…
టేస్టీ తేజ నయని పావనిని ఉద్దేశించి… బయట అందరూ బండబూతులు తిడుతున్నారని ఏదో అన్నాడు… దాంతో ఆమె వెక్కి వెక్కి ఏడిచింది… ఏడాది ట్రామా అనుభవించానంటూ ఏదో చెప్పింది కానీ సరిగ్గా అర్థం కాలేదు… మరీ అంతగా ఏడవాల్సినంత సీన్ ఏముందక్కడ..? తేజ కూడా నా నోటి దూల, అనవసరంగా తూలాను అని తనకు తానే తిట్టుకుని పశ్చాత్తాపపడిపోయాడు… ప్రేక్షకులకు ఈ ఎపిసోడ్ మొత్తం చిరాకు తెప్పించింది…
Ads
నవ్వకుండా ఉండండి అనే మరో గేమ్… అవినాష్ తనదైన స్టయిల్ కామెడీతో నవ్వించి, ఓడించే ప్రయత్నం చేశాడు… గౌతమ్ కృష్ణను ఉద్దేశించి అశ్వత్థామ 2.0 అన్నాడు… దానికి గౌతమ్ ఒక్కసారిగా రెయిజ్ అయిపోయి… నన్ను ఇరిటేట్ చేయకండి, అదంతా పాత సీజన్ బాపతు అని అరిచాడు… అరె, ఏమైంది ఈయనకు అనుకునేలోపు మైక్ తీసి నేలకు విసిరికొట్టి, బిగ్‌బాస్ నేను ఈ గేమ్ ఆడను అంటూ విసురుగా హౌజులోకి వెళ్లిపోయాడు…
అందరూ వెళ్లి ఓదార్పు యాత్ర జరిపారు… నిజంగా అవినాష్ ఏమన్నాడు తనను..? అంతగా ఇరిటేట్ కావల్సిన అవసరం ఏముంది అక్కడ..? అతి… బ్యాలెన్స్ కోల్పోవడం… పైగా బిగ్‌బాస్‌ను తిట్టాడు, ధిక్కరించాడు అనే కారణంతో అభయ్ నవీన్‌ను బయటికి పంపించారు కదా… (అఫ్‌కోర్స్, లెస్ వోటింగు సాకుతో)… మరి మైకును అలా విసిరికొట్టి అతిగా ప్రవర్తించిన గౌతమ్ కృష్ణ మీద ఏం యాక్షన్ ఉంటుంది నాగార్జునా..? ఏమీ లేదు… తరువాత యథావిధిగా హోటల్ టాస్కులో పార్టిసిపేట్ చేశాడు…
హౌజుకు మెగా చీఫ్ అని నబీల్‌ను ఎంచుకున్నారు కదా… బిగ్‌బాస్ నుంచి ఓ నోటీసు వచ్చినా సరే, నబీల్‌కు బదులుగా గౌతమ్ కృష్ణ వెంటనే అందుకుని చదివేస్తున్నాడు… అనవసర ఆతృత దేనికి..? నబీల్ కూడా ఎవరితో ఈ విషయంలో అసంతృప్తిని బయటపెట్టాడు… కొత్తగా వచ్చిన వాళ్లలో మెహబూబ్, నయని పావని డల్… టేస్టీ తేజ కాస్త నోటి దూల… గౌతమ్ కృష్ణ సరేసరి… కాస్తోకూస్తో ఎంటర్‌టెయిన్ చేస్తున్నది అవినాష్, రోహిణి మాత్రమే… హరితేజ కూడా జస్ట్ వోకే… గంగవ్వ అక్కడ ఫిట్ కాలేకపోతోంది… ఊహించిందే… నిజానికి ఇప్పుడు పాత టీమే బాగా ఆడుతోందని చెప్పుకోవచ్చు…
అవినాష్, రోహిణి కూడా యాక్టివ్‌గా ఉన్నా… హరితేజ కూడా తోడుగా ఉన్నా… ఫన్ పండించాల్సిన హోటల్ టాస్క్ పేలవంగా, ఏమాత్రం రక్తికట్టలేదు… ఎంత నెగెటివ్ టాక్ మూటగట్టుకుంటున్నా సరే యష్మి కాస్త బెటర్‌గా పర్‌ఫామ్ చేసింది… పృథ్తికి తన పాత్ర ఏమిటో తనకే అర్థం కానట్టుంది… దాదాపు అందరూ వెలవెలబోయారు… మునుపటి సీజన్లలో ఉన్న జోష్, థ్రిల్ గత సీజన్, ఈ సీజన్లలో పూర్తిగా లోపించింది..!!
ఇక్కడ మరో విషయం చెప్పాలి… బిగ్‌బాస్ హౌజు లోపల యవ్వారాల గురించి బయటికొచ్చాక కూడా ఎక్కడా మాట్లాడవద్దనేది ఒప్పందం… ఐతేనేం, కొందరిని చిల్లరగా బయటికి పోట్రే చేస్తున్న బిగ్‌బాస్ నైచ్యాన్ని ఆకుల సోనియా నిర్భయంగా ఇంటర్వ్యూల్లో చెప్పేస్తుంది… నిజంగానే ఆమెను బాగా బ్యాడ్‌గా ఫోకస్ చేశారు… చివరకు అర్జున్ బజ్‌లో కూడా స్క్రిప్టెడ్ ప్రశ్నలతో ఆమెను మరింత దరిద్రంగా జనానికి చూపించే ప్రయత్నం చేశారు… ఆమె లాయర్… బిగ్‌బాస్ గనుక ఒప్పందం ఉల్లంఘన పేరుతో కన్నెర్ర చేస్తే ఎలా ఫేస్ చేయాలో కూడా ఆమెకు తెలుసు, రెడీ అయిపోయింది… తొక్కలో ఫీల్డ్, ఉంటే ఉంటాం, పోతే పోతాం… గుడ్… కంటిన్యూ సోనియా…!!
Share this Article