Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రక్తికట్టించారు జంబలకిడిపంబ షో… ఆ ఒక్క మెంటల్ కేసు పృథ్వి తప్ప..!!

November 10, 2024 by M S R

అదేదో తన గడ్డంలో మహత్తు ఉన్నట్టు… ఆ బవిరిగడ్డం, మీసాలు, ఆ జడలు కట్టిన జుట్టుతో అర్జెంటుగా తనతో ఎవరో పుష్ప-3 తీస్తున్నట్టు… తన అందానికి, తన లుక్కుకు ఆ జుట్టూగడ్డాలే ఆధారమన్నట్టు… దాన్ని చూసే హౌజులో ఆడాళ్లందరూ తన వెంట పడుతున్నట్టు…

దూకుడు, కోపం, పిచ్చి తర్కం, ఆవేశం ఎట్సెట్రా అనేక నెగెటివ్ లక్షణాలకు ప్రతీకగా కనిపించే పృథ్వి మళ్లీ తన జుట్టు, తన గడ్డాల మీద అదే ప్రేమను చూపించాడు… బిగ్‌బాస్ సండే వీకెండ్ షో కోసం జంబలకిడిపంబ ఎపిసోడ్ ప్లాన్ చేశారు కదా…

మరి హౌజులో బిగ్‌బాస్ షోలో తను చెప్పిందే శాసనం కదా… మగాళ్లందరూ గడ్డంమీసాలు నున్నగా గొరిగించుకుని మహిళలుగా మారిపోయారు… ఆడాళ్లు మీసాలు అతికించుకుని, ప్యాంటూ షర్టులు వేసుకుని కాస్త మగాళ్ల లుక్కుల్లోకి వచ్చారు…

Ads

అందరూ… అవినాష్, గౌతమ్, నిఖిల్, నబీల్ సహా… ఆ ఒక్కడు తప్ప… ఆ ఒక్కడే పృథ్వి…

అప్పట్లో అవినాష్ గడ్డంమీసాలు తీసేశాడు కదా బిగ్‌బాస్ అడగ్గానే… కానీ పృథ్వి మాత్రం నో అన్నాడు… ఎందుకో కారణం చెప్పడు… అక్కడికి రెండు మూడు వారాల్లో ఎలాగూ మళ్లీ పెరుగుతుంది కదాని చెప్పినా ఒప్పుకోలేదు… ఇప్పుడూ అంతే…

ఎహె, అవసరమైతే ఇప్పటికిప్పుడు హౌజ్ నుంచి వెళ్లిపోతాను, అంతేతప్ప నా మురిపాల జుట్టు, నా మహిమల గడ్డాన్ని మాత్రం తీయను అన్నాడు… ఏదో నల్ల క్లాత్ జుట్టూగడ్డం కనిపించకుండా కప్పుకుని కూర్చున్నాడు… అదే తన ఆడవేషం అట… చెత్తా లుక్కు… ఐనా పృథ్వి వీటన్నింటికీ అతీతుడు కదా… వరుణ్ తేజ వచ్చినప్పుడు కూడా ఏవో పిచ్చి గెంతుల్లో కూడా అలాగే కనిపించాడు…

ఈ ఎపిసోడ్‌ను కూడా కన్నడ బ్యాచే రక్తికట్టించింది… అఫ్‌కోర్స్, అవినాష్, రోహిణి సరేసరి… ఈసారి కొంత విష్ణుప్రియ కూడా..! అనుకున్నట్టుగానే… లీకులకు తగినట్టుగానే హరితేజను బయటికి పంపించేశారు… నష్టమేమీ లేదు… ఆమె హౌజులో ఉండి చేసిందేమీ లేదు… అటూఇటూ పుల్లలు పెట్టడం తప్ప… బుర్రకథో, హరికథో, ఒగ్గుకథో, ఇంకేం కథో…. హరితేజకథో తెలియని ఏదో ఓ పిచ్చి ర్యాప్ ఫార్మాట్‌లో రెండుమూడుసార్లు ఏదో పాడటం తప్ప..!!

.

హౌజులో ఉండలేమని మణికంఠ, గంగవ్వ వచ్చేశారు కదా… అబ్బే ఈ పిచ్చి షో చూడలేమని ప్రేక్షకులు కూడా నో చెప్పేస్తున్నారు… రీజనబుల్.., ఎందుకంటే ఇంకా గౌతమ్, పృథ్వి అక్కడే ఉన్నారుగా… చెత్త ఆటతీరు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions