.
ఈసారి బిగ్‌బాస్ హౌజుకు పిచ్చి, తలతిక్క కంటెస్టెంట్లను భలే ఎంపిక చేశారు కదా… రేటింగ్స్ లేవు, మొత్తం తెలుగు బిగ్‌బాస్ సీజన్లలోకెల్లా ఈసీజనే బిగ్ ఫ్లాప్ అన్నట్టుగా మారింది… మణికంఠతో మొదలుపెట్టి… గౌతమ్, యష్మి, పృథ్వి… ఒక్కరా ఇద్దరా… చివరకు టేస్టీ తేజ కూడా అలాగే మారాడు…
వెళ్లిపోయిన వాళ్ల గురించి ఇక వద్దులే గానీ ఇప్పుడున్న వాళ్లలో స్టిల్ గౌతమ్, పృథ్వి, తేజ ఎట్సెట్రా… నిజానికి అవినాష్, రోహిణి లేకపోతే ఈమాత్రం ఫన్ కూడా లేదు హౌజులో… అక్కడికి కాస్త నయం…
Ads
సోషల్ మీడియాలో ఓ సెక్షన్ పనిగట్టుకుని కన్నడ వర్సెస్ తెలుగు పోరాటంగా చిత్రీకరిస్తున్నారు… అకారణ ద్వేషాన్ని ప్రసారం చేస్తున్నారు… ఏదో తెలుగువాళ్లందరినీ కావాలనే ఎలిమినేట్ చేస్తున్నారు, ఒక్కరైనా కన్నడ కంటెస్టెంట్ ఉన్నారా అని ఓ నిరర్థకమైన చర్చను లేవనెత్తుతున్నారు…
ఇక్కడ ఓసారి నిశితంగా పరిశీలిస్తే… 1) సోకాల్డ్ కన్నడ బ్యాచ్ మొత్తం తెలుగు సీరియళ్లలో నటిస్తూ తెలుగు వాళ్లకు కనెక్టయినవాళ్లే… 2) వాళ్లు హౌజులో అచ్చ తెలుగులో మాట్లాడుకుంటున్నారు… ఈవెన్ గ్రూప్ వ్యూహాలు ఆలోచిస్తున్నప్పుడు కూడా… అంతేకాదు, చివరకు ఫ్యామిలీ వీక్‌లో యష్మి కోసం వచ్చిన ఆమె తండ్రి కూడా తెలుగులోనే మాట్లాడాడు… నిఖిల్ తల్లి కూడా తెలుగు పాట పాడుతూ కనిపించింది…
3) నిజానికి ప్రేరణపై కన్నడ ముద్ర సరికాదు… ఆమె తమిళ్… హైదరాబాదులో పుట్టి పెరిగింది… విదేశాలకు వెళ్లి వచ్చి బెంగుళూరులో ఉంటోంది… 4) నిఖిల్, యష్మి, పృథ్వి పక్కా కన్నడ… బట్… హరితేజ భర్త కూడా బెంగుళూరు బేస్డ్ అని ఎక్కడో చదివినట్టు గుర్తు… 5) ఐనా కన్నడ బ్యాచ్‌కు పోటీ ఇవ్వలేకపోతున్నందుకు సోకాల్డ్ తెలుగు బ్యాచ్ కదా ఫీల్ కావల్సింది…
సరే, మెంటల్ కేసులైనా సరే, నామినేషన్ల సందర్భంగా చిరాకు పుట్టిస్తున్నా సరే, ఒక్క విషయంలో మాత్రం ప్రతి కంటెస్టెంటునూ అభినందించాల్సిన అంశం ఒకటుంది… ఫ్యామిలీ వీక్ సందర్భంగా వస్తున్న కుటుంబ సభ్యులతో కంటెస్టెంట్లందరూ కలిసిపోతున్నారు… ఆత్మీయంగా వ్యవహరిస్తున్నారు… చొరవగా మాట్లాడుతూ తమ కుటుంబసభ్యులే హౌజులోకి వచ్చినట్టుగా కలిసిపోతున్నారు…
గుడ్… వచ్చేవాళ్లు కూడా అదే చెబుతున్నారు… ఆటలో వాదనలు, కోపాలు, కొట్లాటలు గట్రా ఏమైనా గానీ, ఎండ్ ఆఫ్ ది డే… అందరూ స్నేహితులే… గత సీజన్ల కంటెస్టెంట్లను చూసినా అర్థమయ్యేది అదే… తల్లి వచ్చినప్పుడు మాత్రమే నిఖిల్ మొహంలో కాస్త ఉద్వేగం కనిపించింది… లేకపోతే పక్కా రాక్ ఫార్మేషన్ తను…
నిజానికి గత సీజన్లలో ఇలాగే ఫ్యామిలీ వీక్స్ సందర్భాల్లో కంటెస్టెంట్ల ఓవరాక్షన్ కనిపించేది కొందరి విషయంలో… ఈసారి ఆ కృత్రిమత్వం కాస్త తక్కువే… అవినాష్ దంపతులకు కాస్త ఏకాంతం కల్పించి, ఓ మంచి రొమాంటిక్ సెట్టింగుతో బిగ్‌బాస్ ఇచ్చిన సర్‌ప్రైజ్ ట్రీట్ చాలా బాగుంది… ఇవే కదా అసలు మెమొరీస్…
ఒకటి గుర్తొస్తోంది… గత సీజన్లలో అభిజిత్ తల్లి అనుకుంటా… హౌజులోకి వచ్చి… కొట్టుకొండిరా, లేకపోతే మజా ఏమొస్తుంది అని నవ్వుతూ చెప్పింది… నిజమే.,. పిచ్చి వాదనలు, కోపాలు, కుట్రలు అన్నీ పార్ట్ ఆఫ్ ది ప్లే… అంతే…
Share this Article