Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుణ్యస్త్రీ, బొచ్చు, కేరక్టర్… రేయ్, యాణ్నుంచి వచ్చార్రా మీరంతా..!!

November 23, 2024 by M S R

.

ఈసారి బిగ్‌బాస్ గత సీజన్లకన్నా చెత్తచెత్తగా కనిపిస్తోంది అని అందరూ అనుకుంటున్నదే…

సోనియా హౌజులో ఉన్నప్పుడు విష్ణుప్రియతో పుణ్యస్త్రీ అనే వివాదం తెలిసిందే కదా… ఒకరి కేరక్టర్‌ను మరొకరు ఎండగట్టుకున్న తీరు ప్రేక్షకులకు వెగటు పుట్టించింది…

Ads

స్టిల్, అదే విష్ణుప్రియ… తనే చెప్పుకున్నట్టు నత్తి బ్రెయిన్… ఏం కూస్తుందో తనకే తెలియదు… తను రోహిణి చీఫ్ కంటెస్టు సందర్భంలో ఇదేనా నీ కేరక్టర్ అని తూలింది మాట…

మరి రోహిణి ఊరుకుంటుందా..? ఆ ప్లేసులో కేరక్టర్ అనే పదం, ఆ టోన్ పుల్లు నెగెటివ్‌గా ట్రిగ్గర్ చేస్తే ఎవరైనా రియాక్టవుతారు కదా… రోహిణి విష్ణుప్రియ బట్టలిప్పి కడిగేసింది… నువ్వే చెప్పావుగా మొదట నిఖిల్‌ను ట్రైచేశాను, కుదరలేదు, అందుకే పృథ్విని పట్టాను అని… అదీ నీ కేరక్టర్ అని రోహిణి వైల్డ్‌గా రియాక్టయింది…

పుణ్యస్త్రీ, కేరక్టర్ వంటి పదాలతో తిట్టుకోవడం తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు బహుశా… అందుకే ఇన్నాళ్లుగా విష్ణుప్రియను ఏదో ప్రేమతో మోస్తున్న నాగార్జున కూడా ఆమెను తొలిసారి మందలించాడు…

మరొకటి… గౌతమ్ వర్సెస్ పృథ్విల కొట్లాట గురించి… పృథ్వి ఉత్త మెంటల్ కేసు… దూకుడు, ఆవేశం, పిచ్చి కూతలు మనం మొదటి నుంచీ చెప్పుకుంటున్నవే… తనకు దీటుగా గౌతమ్ అలాగే మెంటల్ కేసు అయిపోయాడు… ఇట్టే ట్రిగ్గర్ అయిపోతాడు… మొన్న బొచ్చు పీక్కుంటావా అనే పదం కూడా వాడాడు…

పుణ్యస్త్రీలు, కేరక్టర్లు, బొచ్చు పీక్కోవడాలు… ఈసారి హౌజ్ చాలా చిల్లరగా, వెగటుగా నడుస్తోంది… మొదట వచ్చినవాళ్లే కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చినవాళ్లూ అదే తోవ… ఈ చిల్లరతనం భరించడం లేదు కాబట్టే టీఆర్పీలు ఇంత ఘోరంగా నమోదవుతున్నాయి…

రోహిణి గెలిచిన తీరుకు నిజంగా నాగార్జున నుంచి మరింత అప్రిసియేషన్ రావల్సి ఉండింది… కానీ జస్ట్, చప్పట్లు కొట్టి ఓసారి అలా లైట్‌గా అభినందించాడు… బహుశా విష్ణుప్రియను ఆమె తిట్టడం నాగార్జునకు నచ్చనట్టుంది…

సరే, ఆట ముగిసిపోతోంది… హౌజులో పది మంది ఉన్నారు… సో, చివరి వారానికి టాప్ ఫైవ్ మాత్రమే ఉండాలి… కాబట్టి ఈ వారం నుంచే డబుల్ ఎలిమినేషన్ తప్పదు… లేదంటే ఫినాలే డేట్ ఎక్స్‌టెండ్ చేయాలి…

సో, ఈసారి వోటింగులో దిగువన ఉన్న యష్మి, పృథ్విలలో ఎవరో ఒకరు… లేదా ఇద్దరి ఎలిమినేషన్ తప్పదేమో… తొలిసారి కన్నడ బ్యాచ్ నుంచి ఎలిమినేషన్స్ తొలిసారేమో..!! ఈరోజుకు ఉన్న సిట్యుయేషన్‌ను బట్టి నిఖిల్, నబీల్, అవినాష్, ప్రేరణ, రోహిణి టాప్ ఫైవ్‌లో ఉంటారేమో..!! ఏమో… ఇది అసలే మెంటల్ బిగ్‌బాస్ గేమ్… ఈ సిట్యుయేషన్ టోటల్‌గా మారిపోవచ్చు కూడా..!!

చెప్పనే లేదు కదూ… టేస్టీ తేజను ఎడ్డివాడిని చేశారు కదా యష్మి, నిఖిల్… అదీ శనివారం వీకెండ్ షోలో ప్రస్తావనకు వచ్చింది… తన కళ్లు మూసి యష్మి పేరు చెప్పి, నిఖిల్ ముద్దుపెట్టిన ఇన్సిడెంట్… మరింత ఇజ్జత్ పోయింది తేజది…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions