.
జనం ఫోఫోవయా, ఇక చాలు అంటున్నారు… కానీ ఇంట్లోనే జరిగిన ఓ పిచ్చి పోటీలో, వెంట్రుక మందంలో గెలిచాడు… ఇంటివాడు నువ్వు తోపు, ఉండాల్సిందే అంటాడు… తనే మరోవైపు జనం వద్దంటే పీకేస్తా అంటాడు… ఏది కరెక్టు..? ఎవరు కరెక్టు..?
బిగ్‌బాస్ ఉన్న మూర్ఖత్వాల్లో ఇదీ ఒకటి… నిన్నటి అవినాష్ కథా ఇదే… గత సీజన్‌లో అంబటి అర్జున్ కథా ఇదే… ఏమైందంటే..? హౌజులో ఉన్నవాళ్లలో అవినాష్ ఖచ్చితంగా ఓ వినోదిస్టు… పర్‌ఫామర్… తనొక్కడే ఏమీ చేయలేడు, అప్ టు మార్క్ ఏమీ కాదు, రోహిణి లేకపోతే అదీ చేయలేడు… అవి తన పరిమితులు, కాకపోతే ప్రస్తుతం హౌజులో అతనొక ఆముదం మహా వృక్షం…
Ads
ఎవిక్షన్ అంచుల్లో నిలబడి ఒకసారి నబీల్ పుణ్యమాని రక్షించబడ్డాడు… ఈసారీ లీస్ట్ వోటింగ్, వెళ్లిపోవాల్సిన దుస్థితే… గత సీజన్ పరాజితుడే… వైల్డ్ కార్డ్ అని వచ్చి టైటిల్ ఆశించడమూ కరెక్టు కాదు… ఐతేనేం… శ్రీముఖి వచ్చి సేమ్ తన ట్రేడ్ మార్క్ కేకలతో ఓ టాస్క్ ఓ చాలెంజ్ ఆడించింది… అది గెలిచినవాళ్లు నేరుగా ఫైనల్స్‌లోకి వెళ్లిపోతారు…
ఇంకే అర్హతలూ అక్కర్లేదు… ఆ చివరి పోటీలో నిఖిల్ బాగానే ఆడాడు, తనకు అలవాటైన రీతిలో దూకుడుగా, తెలివిగా… కానీ చివరలో తన లక్ బోల్తాపడి, అవినాష్ పుంజుకున్నాడు, గెలిచాడు… అప్పట్లో ఈటీవీ వాడు బిగ్‌బాస్‌కి వెళ్తానంటే పది లక్షలు కక్కు, తరువాత వెళ్లు అన్నాడు కదా ఈటీవీవాడో, మల్లెమాలవాడో… ఇదే శ్రీముఖి పది లక్షలు ఇస్తే వాడి మొహాన కొట్టి బయటికి వచ్చాడు కదా అవినాష్…
ఇప్పుడూ అదే శ్రీముఖి అవినాష్‌ను ఫినాలే టికెట్టు ఇచ్చి అలుముకుంది ఆనందంగా… అప్పటిదాకా టాస్కుల్లో శివంగి తరహాలో నిరూపించుకున్న రోహిణి, మొదటి నుంచీ బాగా ఆడుతున్న నిఖిల్ తెల్లమొహాలు వేయాల్సి వచ్చింది… చివరాటలోని ఒక్క నిమిషం కథను మార్చేసింది… సరే, టేస్టీ తేజ ఓటమికి 200 శాతం అర్హుడు…
వోకే, ఇదేమీ టైటిల్ విన్నింగ్ సందర్భం కాదు… నిఖిల్ స్టిల్ టైటిల్ విజేత పోరులోనే ఉన్నాడు… అర్హుడు… కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఈ పిచ్చి ఆటల్లో విజేతలే టైటిల్ పోరులో ఉండే పక్షంలో మరిక తనకు వోట్లు వేయకుండా ఇక చాలు ఫోఫోవోయ్ అని అసంతృప్తిని ప్రదర్శిస్తున్నారు కదా… మరి జనాభిప్రాయానికి గౌరవం ఏది..? సార్థకత ఏది..? ఇంట్లోనే తిక్క పోటీలు విజేతల్ని నిర్ణయించే పక్షంలో ఇక వోటింగు దేనికి..? అంటే… జనం వోట్లు అనే గంతల్ని జనానికి కట్టడమేనా..?
Share this Article