.
ఏవో చిన్నాచితకా చానెళ్లు తప్పుడు ప్రోమోల మీద ఆధారపడుతుంటాయి… అసలు కంటెంటుకు సంబంధం లేకుండా చిత్రవిచిత్రమైన, అబద్ధపు, వికారపు థంబ్ నెయిల్స్ పెట్టి ప్రేక్షకుడిని తమ వీడియోలోకి లాక్కుపోయే ప్రయత్నం…
అదొక నయా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకొండి… కడుపునొప్పి తిప్పలు అనుకొండి… కానీ స్టార్‌మా వంటి చానెళ్లకు ఆ ధోరణి అవసరమా..? ఆ దిగజారుడు అవసరమా..? పలుసార్లు దేశంలోకెల్లా నంబర్ వన్, నంబర్ టు ప్లేసుల్లో నిలబడే చానెల్ టీఆర్పీల్లో…
Ads
పైగా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని ముప్ఫయి నలభైసార్లు చెబుతాడు నాగార్జున ప్రతీ వీకెండ్ షోలో… అంతటి పాపులర్ షోకు పిచ్చి ప్రోమోలు అవసరమా..?
ఇదంతా ఎందుకంటే..? నిన్నటి బిగ్‌బాస్ సండే వీకెండ్ షోకు సంబంధించి ఓ ప్రోమో కనిపించింది… అందులో చివరకు ప్రేమికుల జంట విష్ణుప్రియ, పృథ్వి (ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్సట) లను ఎవిక్షన్ అంచుల్లో నిలబెట్టాడు నాగార్జున…
తరువాత బోత్ ఆర్ ఎలిమినేటెడ్ అంటాడు… ప్రోమో ఖతం… చూసేవాడికి ఏమనిపిస్తుంది… విష్ణు, పృథ్విలను ఒకేసారి ఎలిమినేట్ చేశారనే కదా అనుకుంటారు… మరీ నాగార్జున నోటి నుంచి వచ్చాక నమ్ముతారు కదా…
అంటే ఆల్రెడీ శనివారం టేస్టీ తేజను తరిమేశారు… ఇప్పుడు ఇద్దరు, అంటే ఒకేవారం ముగ్గుర్ని పంపించేశారా అనే డౌట్ వస్తుంది… అదే జరిగితే బిగ్‌బాస్ వార్తలకు సంబంధించి విశేషం, అసాధారణం అవుతుంది… కానీ నిజం ఏమిటి..?
ప్రోమో తప్పు… వేర్వేరు సందర్భాల్లో నాగార్జున పలికిన బోత్ అనే పదాన్ని ఎలిమినేటెడ్ అనే పదాన్ని కృత్రిమంగా కలిపేసి ప్రోమోను ముగించారు… పక్కా మిస్‌లీడింగ్ ప్రోమో… వీకెండ్ షో పట్ల ఇంట్రస్టు క్రియేట్ చేయడానికి ఆడిన ఓ దిగజారుడు ప్రయత్నం…
ఎలిమినేట్ అయ్యింది పృథ్వి… విష్ణుప్రియ ఇంకా హౌజులోనే ఉంది… అసలు అరుపులు, కేకలు, దూకుడు, విపరీత ప్రవర్తన కనబరిచే పృథ్వి ఎట్టకేలకు బయటికి రావడమే లేట్… ఎప్పుడో జరిగి ఉండాల్సింది… అదే జరిగితే షోలో థ్రిల్ ఏముంది అనుకున్నారేమో బిగ్‌బాస్ టీమ్… కొనసాగించారు, ఎప్పుడైతే తనతో అగ్రిమెంట్ గడువు పూర్తయిందో ఇక దయ చెయ్ బ్రదర్ అన్నారు…
యష్మి, టేస్టీ తేజ, పృథ్వి అందరికీ తెలుసు తమ గడువు ఏమిటో… అందుకే హాయిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు… కన్నడ బ్యాచ్ బ్రేకైంది… యష్మి, పృథ్వి పోయాక మిగిలిందివారిలో ఇక నిఖిల్, ప్రేరణ… ఇద్దరూ టాప్ ఫైవ్‌కు అర్హులే… నిఖిల్ విన్నర్‌గా అర్హుడు… అవినాష్ ఆల్రెడీ టాప్ ఫైవ్ ఫైనలిస్టు… ఇక గౌతమ్, నబీల్, రోహిణి, విష్ణుప్రియ… వీరిలో ఇద్దరు… వారెవరు..?!
Share this Article