Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోటీలో ప్రేరణ మరింత ముందుకు… ఆట రక్తికడుతోంది…

December 6, 2024 by M S R

.

ప్రేరణ… బిగ్‌బాస్ హౌజులో ఈరోజు ఆటతో ఆమె బలంగా తెరపైకి వచ్చింది… టాప్ ఫైవ్ జాబితాలోకి ఎక్కినట్టే కనిపిస్తోంది…

అవినాష్ ఎలాగూ ఫైనలిస్టు… మిగతా ఆరుగురిలో ఆ నలుగురూ ఎవరు…? డౌట్ లేకుండా నిఖిల్, గౌతమ్ ఉంటారు… ఫైవ్‌లోనే కాదు, విన్నర్ రేసులో వాల్లే బలమైన పోటీదారులు అనిపిస్తోంది…

Ads

నిఖిల్ ఎమోషన్‌లెస్‌గా ఓ బండ మనిషిలా కనిపిస్తాడు… కావ్యతో బ్రేకప్ మీద మాట్లాడినప్పుడు మాత్రమే కాస్త ఎమోషనల్ అయ్యాడు… ఫిజికల్‌గా స్ట్రాండ్… ఫస్ట్ నుంచీ సూపర్ ప్లే తనది… టాస్కులు, గేమ్స్, చాలెంజులు ఏదైనా సరే…

తనకు దీటుగా ఉన్నది గౌతమ్… కానీ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ… మొదటి నుంచీ ఉన్నవాడికే విన్నర్ అవకాశం ఉండాలనేది ఓ నైతికాంశం… పైగా గౌతమ్‌కు నోటి దురుసు… ప్రత్యేకించి అక్కలు అంటూ వెటకారాలు, వెక్కిరింపులు తనకు మైనస్… వితండవాదం చేస్తాడు…

సో, అవినాష్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్ సరే… ఆ ఒక్కరూ ఎవరు..? బహుశా నబీల్,.. ఎందుకంటే…? ఈమధ్య ఇరిటేట్ అవుతున్నాడు, బ్యాలెన్స్ కోల్పోతున్నాడు గానీ… నిజాయితీగా ఆడుతున్నాడు… రోహిణికి, విష్ణుప్రియకు కొన్ని పరిమితులున్నాయి…

సరే, ప్రేరణ విషయానికి వస్తే… ఎమోషన్స్… ఆనందం, దుఖం, కోపం అన్నిరకాల ఎమోషన్స్… ఏదీ దాచుకోదు, ఏదైనా పద్ధతిగా ఆడుతుంది, పనిచేస్తుంది… చిన్న పిల్లలా ఎగురుతుంది… ప్రతి టాస్కులో మ్యాగ్జిమం ట్రై చేస్తుంది…

ఈరోజు తమ పెళ్లి వీడియో చూశాక ఆమె మరింతగా ఆడియెన్స్‌కు కనెక్టవుతుంది… వోట్ అప్పీల్‌కన్నా ఇదే ఎక్కువ అప్పీలింగ్… భర్త పట్ల తన ప్రేమను వ్యక్తీకరించడంలో కూడా ప్రేరణ తీరు బాగుంది… ఇది చూసి ఈరోజు గెస్టుగా వచ్చిన ఓంకార్, సారీ, ఓహోంకార్ అనాలేమో… ప్రేరణను చూసి ఇన్‌స్పయిర్ అయిపోయి, రాబోయే ఇస్మార్ట్ జోడికి ప్రేరణ జంట పాల్గొనాలని కోరుకున్నాడు…

రోజుకో గెస్టు వస్తున్నాడు కదా… అది బాగుంది… ఈరోజు టీవీ సెలబ్రిటీ ఓంకార్ వచ్చాడు… సరే, కాసేపు ఏదో ఆట… ఫన్… పనిలోపనిగా ఇస్మార్ట్ జోడి మూడో సీజన్‌కు ప్రమోషన్ కూడా పూర్తిచేసుకున్నాడు… దానికీ ఓ ప్రోమో… సినిమా భాషలో ట్రెయిలర్ కూడా చూపించాడు… పర్లేదు, బాగుంది…

రేపు వీకెండ్ షో, బహుశా రేపు ఒకరిని, ఎల్లుండి మరొకరిని ఎలిమినేట్ చేస్తారేమో… డబుల్ ఎలిమినేషన్ ఉంటేనే చివరివారం టాప్ ఫైవ్ మిగులుతారు… వెళ్లిపోయేది విష్ణుప్రియ, రోహిణేనా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ గోక్కుంది అనసూయ – అలవాటే కదా – లెంపలేసుకుంది !!
  • శనార్తి ! నాగదుర్గ సినిమా టైటిల్ ఇది ! స్వచ్ఛమైన తెలంగాణ పలకరింపు !!
  • Makutam ! ఓ సోది కథ – నరుకుడు, దంచుడు… పాపం, విశాల్ !!
  • Agadha ! రాజు గారూ… మరోసారి సారీ..! తమరు నిర్మాతగానే బెటర్ !!
  • Batwara 1947 – ఆ చరిత్రను గుర్తుచేసింది – కదిలించలేక పోయింది !!
  • Dirty – Hug Politics …! మరో మెట్టు జారిపడిన రాహుల్ గాంధీ !!
  • ఓం పురి ! ఎల్లలు దాటిన నటన ! ఇండియన్ సినిమా శిఖరం !!
  • కేసీయార్ వాటర్ బ్లండర్స్ ! రేవంత్ రెడ్డి రిపేర్లు !!
  • మొన్న ధర్మేంద్ర ప్రధాన్ – నిన్న నితిన్ గడ్కరీ – నేడు నిర్మలా సీతారామన్ !!
  • Viswanath & Sons – కమర్షియల్ మసాలా ట్రెండ్ల నడుమ- ఫీల్ గుడ్ మూవీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions