.
సరే, ఆట చివరికొచ్చింది… టాప్ ఫైవ్ ఖరారు… ఫాఫం, నత్తి బ్రెయిన్ విష్ణుప్రియ ఔట్… ఐతే..? టాప్‌లో ఉన్నది అవినాష్, నిఖిల్, ప్రేరణ, నబీల్, గౌతమ్… అర్హులే… గౌతమ్ తప్ప…
గౌతమ్ సోలోగా ఆడాడు, అభినందనీయమే గానీ దూకుడు, వెటకారాలు, పంచాయితీలు, మాటతూలడాలు వంటి అవలక్షణాలెన్నో ప్రదర్శించాడు… బిగ్‌బాస్ లెక్కలు వేరు కాబట్టి… వోకే…
Ads
టాప్ ఫైవ్‌లోకి వచ్చినట్టు ప్రకటించగానే నిఖిల్ ఓ మాటన్నాడు… తెలుగు టీవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ బయటి వ్యక్తి అన్నారు, కానీ ఇప్పుడు నేను మావాడివే అని తెలుగుజనం చెప్పారు, థాంక్స్ అని… గుడ్… సరైన వ్యక్తీకరణ…
టీవీ సీరియళ్లలో మగ, ఆడ తారాగణంలో డామినేషన్ కన్నడిగులదే… కష్టపడుతున్నారు… తమ పనేదో తమది… ప్రొఫెషన్ పట్ల కమిట్మెంట్, డెడికేషన్ కనిపిస్తుంది… పైగా తెలుగు సినిమా, టీవీ ఇండస్ట్రీలకు ప్రాంత భేదం, భాషాభేదం ఏమీ లేదు… నిఖిల్, నువ్వు మావాడివే… కాదు, మాలో ఒకడివి…
ఇక ప్రేరణ… గుడ్ గేమ్… నిన్నామొన్న రెండుమూడు స్టోరీల్లో చెప్పుకున్నాం కదా… టాప్ ఫైవ్‌కు అర్హురాలు… అంతేకాదు, నిజానికి ఆమె నిజంగా విన్నర్ గనుక అయితే..? గుడ్, బిగ్‌బాస్ తొలి మహిళా విన్నర్ కావడానికి అర్హురాలే… కానీ బిగ్‌బాస్ కూడా మగాడే కదా… ఆమెకు ఆ చాన్స్ రాకపోవచ్చు,..
తరువాత నబీల్… ఈ వరంగల్ బిడ్డ మొదట్లో నిజాయితీగా, నిబ్బరంగా, నిలకడగా ఆడాడు… ఒక దశలో టాప్ వోటింగు… కానీ ఎందుకో మూడునాలుగు వారాలుగా బ్యాలెన్స్ కోల్పోయాడు… బట్ వోకే… టాప్ ఫైవ్‌లోకి రావడానికి అర్హుడే… ఎందుకంటే..? మిగతావాళ్లకు ఆ సీన్ కూడా లేదు కాబట్టి..!
అసలు చెప్పుకోవల్సిన విశేషం ఏమిటంటే..? జస్ట్, ఓ సీన్ ఊహిద్దాం… అదే జరగాలని ఏమీ లేదు… ఓ ఊహ… నిఖిల్, గౌతమ్, నబీల్ టాప్ త్రి దశకు వచ్చారు అనుకుందాం… అవినాష్ ఫిఫ్త్ ప్లేసులో, ప్రేరణ ఫోర్త్ ప్లేసులో నిష్క్రమిస్తే ..?
ముగ్గురుంటారు… నబీల్, నిఖిల్, గౌతమ్… వీరిలో గౌతమ్ మాత్రమే వైల్డ్ కార్డ్… కానీ మూడో ప్లేసులో గనుక నబీల్ ఉంటే..? ఎవరో గెస్టు సూట్‌కేసు పట్టుకొచ్చి… ఈ డబ్బు తీసుకుని వెళ్తా… ఉంటావా అనడిగితే నబీల్ ఏమంటాడు..?
తను హౌజులో చాలా సందర్భాల్లో స్పిరిట్ కోల్పోలేదు… నిజాయితీ, కృతజ్ఞత వంటి మంచి లక్షణాలు కనబరిచాడు… అదే గేమ్ రియల్ స్పిరిట్ ఆ ఆఫర్ వచ్చినప్పుడు కనబరుస్తాడా..? లేక గతంలో సోహెల్‌లాగా సూట్‌కేసు తీసుకుని వెళ్లిపోతాడా..?
ఇలా ఎందుకు ఊహించాలి…? ఏమో, నిఖిల్, గౌతమ్‌లలో ఎవరో అలా వెళ్లిపోవచ్చు అంటారా..? ఎస్, అదీ నిజమే… కానీ నబీల్‌కు సొంత సినిమా లేదా ఏదైనా వెబ్ సీరీస్ తీయాలని కోరిక… తనూ అదే చెప్పాడు… నిఖిల్‌కు, గౌతమ్‌కు ఆ కోరికలేమీ లేవు…
నిఖిల్‌కు తను గెలిచి, నేనూ తెలుగుజనంలో ఒకడిని అని చాటాలని ఉంది… గౌతమ్‌కు గత సీజన్లలో దక్కని గెలుపు దక్కాలనే ఆశ… సరే, ఇవన్నీ పక్కన పెడితే… నిజంగానే ప్రేరణ ఆ టాప్ త్రీలోకి వస్తే… సూట్‌కేసా..? రిస్క్ తీసుకుంటుందా..? ఇంట్రస్టింగు..!! పోనీ, విష్ణుప్రియ చెప్పినట్టు, ఆశించినట్టు టాప్ వన్ నిఖిల్, టాప్ టు ప్రేరణ అయితే..? ఇన్నాళ్లూ ఒక సెక్షన్ తిట్టిపోసిన ఆ కన్నడ బ్యాచే ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది..!!
Share this Article