.
ఈసారి బిగ్‌బాస్ సీజన్ అట్టర్ ఫ్లాప్ అని పలుసార్లు చెప్పుకున్నాం కదా… రేటింగ్స్ ఒక సాక్ష్యం కాగా… వేరే యాడ్స్ ఏమీ రావడం లేదు…
రెగ్యులర్ స్పాన్సరర్స్ మారుతి, కంట్రీ డిలైట్, మరో రెండుమూడు తప్ప… అదనంగా యాడ్స్ పెద్దగా కనిపించడం లేదు… అంటే, ఎవరూ పెద్దగా దేకడం లేదు అని అర్థం…
Ads
ప్రతి సీజన్‌లో సినిమా ప్రమోషన్లు ఉండేవి… యాడ్ స్కిట్స్ కంటెండర్లతో చేయించేవాళ్లు… కళకళలాడేది… కానీ ఈసారి వెలవెలబోతోంది… అసలే ఖర్చు ఎక్కువ… వస్తున్న రేటింగ్ ఫాయిదా లేదు, యాడ్ రెవిన్యూ బొటాబొటీ…
ఈసారి మొత్తానికి గల్లాపెట్టె కాలిపోవడం ఖాయం… ఎవరెవరో గెస్టుల్ని మొదట్లో పిలిచాడు… మరి చివరివారం పంచాయితీలు ఏమీ ఉండవు కదా… ఇంకెవరిని పిలవాలో అర్థం గాక, ఇక స్టార్ మా సీరియల్స్ ప్రమోషన్లకు పూనుకున్నారు…
నువ్వుంటే నా జతగా అనే కొత్త సీరియల్… ఇల్లు ఇల్లాలు పిల్లలు అని ఈటీవీ ప్రభాకర్, ఆమని సీరియల్… సుహాసిని నటించే మామగారు అనే మరొక సీరియల్… ఇలా వరుసగా సీరియల్ ప్రమోషన్లు… ఏమీ లేదు, ప్రధాన పాత్రలు వేసే వాళ్లను హౌజులోకి తీసుకురావడం, ఏవో సగటు టీవీ రియాలిటీ షో బాపతు ఆటలు, మాటాముచ్చటా…
దీపిక వచ్చింది… దీపిక రంగరాజో, గంగరాజో… హైపర్ యాక్టివ్… స్టేజీ షోలలో, టీవీ షోలలో ఆమె ఎనర్జీని తట్టుకోవడం మిగతా పార్టిసిపెంట్లకు, హోస్టులకు కూడా కష్టమే… తమిళ్ ఆరిజన్ కావచ్చు, ఆమె ఏ షోలో పాల్గొన్నా సరే, ఆమె వచ్చీరాని తెలుగు వింటూ ద్వంద్వార్థాలు వెతుకుతూ హోస్టులు, ఇతర పార్టిసిపెంట్లు శునకానందం పొందుతూ ఉంటారు…
బాడీ షేమింగ్‌లాగే ఇది భాషా షేమింగ్… ఆమే కాదు, జబర్దస్త్ సౌమ్య, సోనియా సింగ్ కూడా ఈ భాషా బాధితులే… చాన్నాళ్లు ఈటీవీ రష్మిని కూడా ఇలాగే వెటకరించేవాళ్లు… బిగ్‌బాస్ హౌజులోకి ఒంటరిగానే గెస్టుగా వచ్చిన దీపిక అక్కడున్న కాసేపు అల్లరల్లరి చేసింది… ఒక దశలో అంతటి బిగ్‌బాసే ఏం చెప్పాలో తెలియని స్థితిలోకి పడిపోయాడు ఫాఫం…
ఆమెది భోళాతత్వం… చూస్తుంటే ఎవరో టీన్స్ అమ్మాయి అల్లరి చేస్తున్నట్టు ఉంటుంది… చిల్లరతనం అనిపించదు… బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పోర్షన్ చేస్తుంది… సీరియల్‌లో లోతైన, బరువైన రోల్ చేసినా సరే ఆమె యాక్టివిటీని పక్కనున్నవాళ్లు తట్టుకోవడం కష్టం… ఆ కాసేపే అంత సందడి… ఇక వచ్చే సీజన్‌లో కంటెండర్‌గా వస్తే…!? ఆల్రెడీ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచినప్పుడు అదే అడిగింది..!!
Share this Article