.
బిగ్‌బాస్ 8 సీజన్ విజేత ఎవరనేది ఇప్పుడెవరికీ ఇంట్రస్టింగ్ అంశం కానేకాదు… అంత పేలవంగా, అంత నిస్సారంగా గడిచిపోయింది… ఓ ఫ్లాప్ సీజన్…
పైగా ఇందులోకి కన్నడ, తెలుగు భాషాభేదాలు తీసుకొచ్చి… ఆయా కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్ పిచ్చి క్యాంపెయిన్ సాగించి, ఓ ఆటను ఆటలా గాకుండా ఇదో భాషా ఆత్మగౌరవ పోరాటంలా మార్చారు… రేప్పొద్దున సీజన్‌లో తెలంగాణ, ఆంధ్ర కంటెస్టెంట్లు బలంగా పోటీపడితే… ఆ ఫీలింగ్ కూడా తీసుకురాగలరు ఈ పీఆర్ మాఫియా…
Ads
సరే, నిఖిల్ గెలుస్తాడా..? గౌతమ్ గెలుస్తాడా..? పక్కన పెట్టండి… గౌతమ్‌కన్నా నిఖిల్ అర్హుడు… కానీ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఎవరనేదే ఆసక్తికరం… ఎందుకంటే..? గత సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ బాపతు మూర్ఖ బ్యాచ్ రోడ్ల మీద విధ్వంసం క్రియేట్ చేసింది… ఈరోజుకూ చట్టం వాళ్లను శిక్షించలేకపోయింది… బాధితులు ఆ రోడ్ల మీద వణికిపోయారు…
సంధ్య థియేటర్ వద్ద ఆ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి చూశాం కదా… మొన్నటిదాకా అల్లు అర్జున్ ఈ ఫినాలేకు చీఫ్ గెస్ట్ అని వార్తలొచ్చాయి… నెవ్వర్, మొన్నటిదాకా ఏమో గానీ, ఇప్పుడు ఆ రిస్క్ అన్నపూర్ణ స్టూడియోస్ అస్సలు తీసుకోదు… అసలే నాగార్జున కన్వెన్షన్ హాలుకు ఏమైందో చూశాం, బన్నీకి ఏమైందో చూశాం…
సో, ఫినాలేకు బన్నీ వస్తానన్నా సరే… (అఫ్‌కోర్స్ వీళ్లు అడిగారా లేదో కూడా తెలియదు) పోలీసులు ఇప్పుడున్న స్థితిలో అనుమతించరు… పొరపాటున ఏమైనా జరిగితే బన్నీ మీద కేసు మరింత బలంగా బిగుస్తుంది…
మరి ఎవరొస్తారు..? ఉపేంద్ర వచ్చినట్టున్నాడు… తనకు తెలుగులో పెద్ద ఫాలోయింగ్ ఏముందని… తను చీప్ గెస్టా అని తీసిపారేయకండి… నాగార్జునకు ఎవరు ఇష్టులైతే వాళ్లే… ఏమో, కన్నడ నిఖిల్ గెలుస్తాడేమో, అందుకే ఆ కన్నడ వెటరన్ హీరోను తెచ్చారేమో…
ఏదో ప్రోమోలో విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు… కమలహాసన్ వదిలేశాక ఇప్పుడు తమిళ బిగ్‌బాస్ హోస్ట్ చేస్తున్నది తనే… పైగా తనది ఏదో కొత్త సినిమా వస్తోందిగా… ప్రమోషన్ కూడా… కానీ ఈ తెలుగు షోకు చీఫ్ గెస్ట్‌గా వచ్చేంత సీన్ లేదు… నాగార్జునే ట్రోఫీ ఇవ్వడం బెటర్, గత సీజన్‌లోలాగా…
పనిలోపనిగా డాకూ మహారాజ్ మూవీ ప్రమోషన్ కోసం ఆ టీంలో ఎవరో వచ్చినట్టున్నారు… సంబరాల ఏటిగట్టు సినిమా ప్రమోషన్ కోసం సాయిధరమ్ తేజ వచ్చినట్టున్నాడు… అవునూ, కొన్ని వార్తల్లో వస్తున్నట్టు గేమ్ ఛేంజర్ రాంచరణ్ తేజ వచ్చాడా…? రిస్క్ తీసుకుంటున్నాడా..?
పోలీసులు కూడా 400 మందిని మొహరిస్తారట… 55 సీసీ కెమెరాలు కొత్తగా పెట్టాలని ఆదేశించారట… మరి ఇవన్నీ దేనికి..? ఏదో కమర్షియల్ టీవీ షో కోసం పోలీసులు ప్రజాధనంతో ఇంత ప్రయాసపడాలా..? ప్రజల్ని అసౌకర్యానికి గురిచేయాలా ఆ ఫినాలే టైమ్‌కు..? మీ బందోబస్తు ఏర్పాట్లు మీరే చేసుకొండి, ఏమాత్రం తేడా వచ్చినా… సంధ్య థియేటర్ కేసు తెలుసు కదాని ఒక్క మాట గట్టిగా చెబితే సరిపోదా,.,?
Share this Article