Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదో దిక్కుమాలిన ట్విస్ట్… ఈ మెంటల్ కేసుల్ని ఇంకెన్నాళ్లు భరించాలి నాగ్..?!

October 20, 2024 by M S R

స్టార్ మా పరివార్ అవార్డుల ప్రోగ్రామ్ అయిపోయింది… సరే, అందరినీ సంతృప్తిపరిచేలా అవార్డులు ఇచ్చారు, అందరూ హేపీ… చివరకు అట్టర్ ఫ్లాస్ అయిన గత బిగ్‌బాస్ సీజన్‌కు కూడా ఓ అవార్డు ఇచ్చారు… చిరాకెత్తించిన అదే శివాజీ, అదే పల్లవి ప్రశాంత్ కూడా స్టేజీ మీద కనిపించారు… అన్నింటికీ మించి అదే హైపిచ్ అరుపులు కేకల శ్రీముఖిని క్వీన్ ఆఫ్ టీవీ అవార్డు ఇచ్చారు…

ఫాఫం, ఐరనీ ఏమిటంటే… ఆ అవార్డు తీసుకునే టైమ్‌‌లో అంతటి సుమను స్టేజీ మీదకు పిలిచారు… ఎందుకు పిలిచారో తెలియదు… మొహం అంతా మాడిపోయి కనిపించింది… వస్తే గిస్తే అలాంటి అవార్డులు తనకు తప్ప ఆఫ్టరాల్ పిచ్చి కేకల శ్రీముఖికి ఇవ్వడం ఏమిటనే భావనో ఏమో…!!

ఈ అవార్డుల ప్రోగ్రామ్‌లో డీజే టిల్లూ వేషంలో వచ్చి అవినాష్ సందడి చేశాడు… వెంటనే స్టార్టయిన బిగ్‌బాస్‌లో కనిపిస్తున్నాడు… హౌజులో చేరి 10 రోజులైపోయింది కదా…. హహహ… అంటే ఈ స్టార్ మా అవార్డుల షూట్ బహుశా పక్షం రోజుల క్రితం జరిగి ఉంటుంది… సరే, ఆ అవార్డుల ప్రోగ్రాం వదిలేస్తే… బిగ్‌బాస్‌కు వద్దాం…

Ads

లిమిట్ లెస్ ట్విస్టులు అన్నారు కదా మొదట్లోనే…! అలాగే చేశారు… పృథ్వి అనే మెంటల్ కేసును బయటికి పంపించేశారని కదా వార్తలు వచ్చాయి… కాదు, అదే ట్విస్టు… బహుశా విష్ణుప్రియ, పృథ్వి రొమాన్స్‌ కొనసాగాలి కదా అనుకున్నారేమో… అందుకే పృథ్విని సేవ్ చేసి, విష్ణుప్రియ కళ్లల్లో ఆనందాన్ని చూశాడు బిగ్‌బాస్…

మరేం జరిగింది..? మొన్న నబీల్‌తో మాట్లాడుతూ మెహబూబ్ ‘మనకు మన కమ్యూనిటీ వోటింగు సపోర్ట్ ఉంటుంది’ అన్నాడు కదా… ఫాఫం, నాగార్జునకు ఏమీ అనడానికి సాహసం లేదు… అసలే కష్టాల్లో ఉన్నాడు కదా… సింపుల్‌గా… బిగ్‌బాస్ రూల్స్ తెలుసు కదా… ఏ బయాస్డ్‌గా ఉండదు, జెండర్ లేదు, కమ్యూనిటీ లేదు అని రెండు ముక్కల్లో తేల్చేశాడు… మరి మెహబూబ్ చేసిన ఆ వ్యాఖ్యలకు బిగ్‌బాస్ స్పందన ఏమిటి..? ఏమీ లేదు..!!

ఇక నామినేషన్లలో ట్విస్టు ఏమిటంటే…? పృథ్విని సేవ్ చేశారని చెప్పుకున్నాం కదా… పదే పదే మణికంఠ ఏడుస్తున్నాడు కదా… నవ్వితే కూడా నా బాడీ షేక్ అవుతోంది అని… బయటికి పంపించండి మహాప్రభో అని… సో, వోటింగులో చివరలో ఉన్న గౌతమ్‌ను, మణికంఠను నిలబెట్టి… ఎవరిని బయటికి పంపించాలో చెప్పండి అని హౌజ్ మేట్స్‌ను అడిగాడు… ట్విస్ట్ ఏమిటంటే..? గౌతమ్ మెగా చీఫ్ కావచ్చుగాక… కానీ వోటింగులో పూర్, నిజానికి తనే వెళ్లిపోవాలి… కానీ మణికంఠ తనే పోతాను పోతాను అన్నాడు కదా… వోకే అన్నాడు నాగార్జున… అలా గౌతమ్ అనే మెంటల్ కేసు సేఫ్ అయిపోయాడు…

మెజారిటీ హౌజ్ మేట్స్ కూడా మణికంఠను పంపించండి, ఓ పనైపోతుంది అన్నట్టుగా స్పందించడంతో ఇక నాగార్జున తనను పంపించేయడానికే నిర్ణయం తీసుకున్నాడు… కానీ ట్విస్ట్ ఏమిటీ అంటారా..? తనను సీక్రెట్ రూంకు పంపించాడుట… సో, అసలు మణికంఠ 2.0 హౌజులోకి వస్తాడన్నమాట… పోయేముందు నాగార్జున అదే హింట్ ఇచ్చాడు… ఎస్, లిమిట్ లెస్ అంటే ఇదేనేమో… ఈ ఫూలిష్ గేమ్ కావచ్చేమో.,.!! సో, బిగ్‌బాస్ ఆడియెన్స్, ఇంకా భరించండి ఆ పృథ్విని.. ఆ మణికంఠను… ఆ గౌతమ్‌ను…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…
  • Annamalai Breaks Free of His Shackles… Trouble Ahead for Palaniswami
  • నందూస్ వరల్డ్..! ఈ యూ-ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!
  • బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…
  • రాత్రికిరాత్రి వైరల్ స్టార్… ఒక్క రాత్రికి నీ రేటెంత అనడిగేదాకా…
  • yudhvir ahlavath … హఠాత్తుగా సోషల్ మీడియాలో వైరల్… ఎందుకంటే…
  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions