ప్రతి వారం టీవీ రేటింగ్స్ చూస్తుంటేనే అర్థమైపోతోంది… గత సీజన్‌లాగే ఈసారి బిగ్‌బాస్ సీజన్ 8 కూడా అట్టర్ ఫ్లాప్ అవుతోందని..! ఏమో, స్పెషల్స్ ఉన్నప్పుేడేమైనా ప్రేక్షకులు చూస్తున్నారేమో అనే చిన్న సందేహం ఉండేది…
అందుకే రెండు సందర్భాలను పరీక్ష పాయింట్లుగా పెట్టుకుని పరిశీలించాలని అనుకుంటే… ఆ రెండు సందర్భాల్లోనూ పూర్ రేటింగ్స్ నమోదై క్లియర్ సమాధానం వచ్చేసింది… క్రియేటివ్ టీమ్స్‌ను ముంబై నుంచి రప్పించినా… ఇంకే మార్పలు చేసి, లిమిట్ లెస్ ఫన్ డొల్ల గొప్పలు ఊదరగొట్టినా వర్కవుట్ కావడం లేదని…!
మొదటి సందర్భం ఏమిటంటే..? హౌజులో ఉన్నవాళ్లు ఏమీ చేయడం లేదనీ, వాళ్లకు ఆడటం రాదనీ, వాళ్ల ఎంపికే రాంగ్ అని బిగ్‌బాస్ టీమ్‌కే అర్థమైపోయి… పాత కాపుల్ని 8 మందిని పట్టుకొచ్చి, ఆటలోకి జొప్పించారు… వాళ్లలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్లంతా తుస్ కేటగిరీయే… రీలోడ్ పేరిట వాళ్లను హౌజులోకి పంపించిన ఎపిసోడ్ సుదీర్ఘంగా నడిపించారు… కానీ రేటింగ్స్ ఆరు లోపు… ఫ్లాప్… ఎవరూ దేకలేదు…
Ads
రెండో సందర్భం ఏమిటంటే..? మొన్న దసరా స్పెషల్… ఫరియా, అమృత, డింపుల్ ఐటమ్ సాంగ్స్… మంగ్లి పాటలు, హౌజులోకి వెళ్లి బతుకమ్మ పోటీలు… కొన్ని సినిమాల ప్రమోషన్లు… గ్రూపు డాన్సులు… హంగామా… సాయంత్రం 7 గంటలకు మొదలు పెడితే మూడు గంటలకు పైగా షో… కానీ ఏం లాభం..? జనానికి నచ్చలేదు…
చివరకు ఆ రీలోడ్ ఎపిసోడ్‌కన్నా తక్కువ రేటింగ్స్ వచ్చాయి… జస్ట్, 4.55 రేటింగ్స్ (హైదరాబాద్ బార్క్ 15 ప్లస్ కేటగిరీ)… అంటే సూపర్ ఫ్లాప్ … అంతకుముందు వీకెండ్ (శనివారం) మరీ పూర్… 3.87 టీఆర్పీలు… ఇక మిగతా రోజుల సంగతి చెప్పనక్కర్లేదు… సో, కాస్తో కూస్తో అవినాష్, రోహిణి, టేస్టీ తేజ మాత్రమే కాస్త వినోదాన్ని పంచుతున్నా… మిగతావాళ్లంతా టీఆర్పీలకు అక్కరకు రారు… వెరసి ఈసారి సీజన్ కూడా ఫ్లాప్ అనేది కన్‌ఫర్మ్…
ఇలా ఎందుకు..? కారణాలు గతంలో కూడా చెప్పుకున్నాం… ప్రస్తుతం టీవీల్లో వేరే ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రోగ్రామ్స్ పెద్దగా లేవు, ఆహాలో కూడా ఏమీ లేవు… జీతెలుగు సీరియళ్లను భ్రష్టుపట్టించారు… ఈసారి టాప్ 30 ప్రోగ్రామ్స్ జాబితాలో జీతెలుగు సీరియల్ ఒక్కటీ లేదు… కాస్తోకూస్తో టీఆర్పీలు వస్తున్నవి స్టార్ మా సీరియళ్లకే… సో, వేరే దిక్కులేక బిగ్‌బాస్ చూస్తారేమో ప్రేక్షకులు అనే ఆశలకు, భ్రమలకు విలువ లేదని అర్థమైంది…
50 రోజులు గడిచిపోయాయి… ఇక బిగ్‌బాస్ టీమ్ కూడా చేయదగిందేమీ లేదు… అయిపోయింది… నాసిరకం దినుసులు… వంట ఆల్రెడీ చెడిపోయింది… ఇంకేం మసాలాలు తగిలించినా సరే, ఈ ఫుడ్‌కు టేస్ట్ రాదు… ఆ స్టూడియోలో తూర్పు దిక్కు ఏదో తెలుసుకుని, అటు తిరిగి దండం పెట్టడమే… అదే బెటర్…! కానివ్వండి..!!
Share this Article