ఈసారి నామినేషన్లలో నవ్వు పుట్టించింది గంగవ్వ నామినేషనే… అంటే ఆమెను నామినేట్ చేయడం కాదు, ఆ ధైర్యం ఎవరికీ లేదు… బిగ్‌బాస్ టీమ్‌కు, నాగార్జునకు…
ఆమెను మళ్లీ ఎందుకు హౌజులోకి తెచ్చారనేది పెద్ద మిస్టరీ… అప్పుడే మళ్లీ కాళ్లనొప్పులు అని మొదలుపెట్టేసింది… జస్ట్, టైమ్‌కు తింటూ, కూర్చుంటూ, పడుకుంటూ టైమ్ గడిపేస్తుంది… ఆమెకు టాస్కులు, గేమ్స్, స్ట్రాటజీలు ఏమీ అక్కర్లేదు… టెన్షనూ లేదు… తోటి కంటెస్టెంట్స్ పేర్లు కూడా మొత్తం తెలియవు…
అలాంటిది ఆమె యష్మిని నామినేట్ చేయడం… తనపై నెగెటివిటీ ఎంత స్ప్రెడ్ అవుతున్నా సరే, ఆమెకు టెంపర్‌మెంట్ ఉంది… పట్టుదలగా ఆడుతుంది… తనకు స్ట్రాటజీ కూడా ఉంది… అదేదో గౌతమ్ విషయంలో యష్మి వైఖరి బాగుండదట, గంగవ్వ నామినేట్ చేసింది…
Ads
యష్మి సరదాగా నవ్వి ఊరుకుంది… అనడానికి కూడా ఏమీలేదు… ఈసారి బిగ్‌బాస్ నిస్సారంగా, నిరాసక్తంగా ఉండటానికి ఇవిగో ఇలాంటి కారణాలే బోలెడు… సరే, ఓ విశేషం చెప్పుకోవాలి…
రోహిణిని ఎవరో ఒకరు నామినేట్ చేస్తారు, మెగా చీఫ్ హోదాలో అవినాష్‌కు ఎలాగూ స్వాప్ అధికారం వస్తుందనీ, రోహిణిని సేవ్ చేస్తాడనీ అనుకున్నదే… ఐతే నబీల్‌ను సేవ్ చేయాల్సిన స్థితే వస్తే ఏం చేస్తాడనే ఆసక్తి ఉండేది… ఎందుకంటే… తను మెగా చీఫ్ కావడానికి ప్రధాన కారకుడు నబీల్ త్యాగం… తప్పుడు స్ట్రాటజీతో చేసిన త్యాగం…
కానీ రోహిణిని సేవ్ చేసి, నిఖిల్‌ను నామినేషన్ల జాబితాలోకి చేర్చడమే ఆశ్చర్యం… ఎలాగూ నిఖిల్‌కు మంచి వోట్లే పడతాయిలే అనే ధీమా కాదు, మెగా చీఫ్ చివరి టాస్కులో నిఖిల్ ధోరణి, కన్నడ బ్యాచ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుుకునే తీరు మీద అవినాష్ కోపంగా ఉన్నాడు… ఎలాగూ పృథ్వి, యష్మి, ప్రేరణ నామినేషన్లలో ఉన్నారు కదా, నిఖిల్‌ను కూడా చేసేస్తే మొత్తం కన్నడ బ్యాచ్ మొత్తం నామినేషన్ల జాబితాలోకి వస్తారని అనుకున్నట్టున్నాడు అవినాష్…
ఐతే గియితే… పృథ్వి మాత్రమే వోట్ల పరంగా డౌన్ అవుతాడేమో… ఏమో, ఇన్నాళ్లూ ఎంత మెంటల్‌గా బిహేవ్ చేస్తున్నా ప్రేక్షకులు వోట్లేస్తున్నారు కదా, ఈసారీ వేస్తారేమో చూడాలి… యష్మి, ప్రేరణ, నిఖిల్ ఎలాగూ బలంగానే ఉన్నారు… ఎటొచ్చీ హరితేజ, గౌతమ్‌లకు వోట్లే సందేహం… అయితే..?
గౌతమ్ కూడా మొదటి నుంచీ మెంటల్ వేషాలు వేస్తున్నా సరే… (ఈరోజుకూ అంతే, ఒకప్పుడు అశ్వత్థామ అంటేనే మండిపడ్డాడు, ఇప్పుడు తనే అశ్వత్థామ బ్యాక్ హియర్ అని భుజాలు చరుచుకుంటున్నాడు… అందుకే మెంటల్ కేసు అనేది…) జనం వోట్లేసి గట్టెక్కిస్తూనే ఉన్నారు… ఇక మిగిలింది హరితేజ…
మొన్నటి ఎలిమినేషన్ సమయంలోనూ నయని పవనితో పోటీపడింది… తక్కువ వోట్లతో… పెద్దగా హౌజులో ఇంప్రెసివ్ ఆట కూడా ఏమీ లేదు… ఈ వారం సరిగ్గా ఆడి, కాస్త ప్రేక్షకాదరణ పొందితే సరి… లేదంటే ఈసారి సీజన్‌లో ఆమె కథ కూడా ఒడిశిపోయినట్టే..!! నామినేషన్ సమయంలో పరమ చెత్త మాటతీరు ఆమెది..!
Share this Article