Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…

October 10, 2025 by M S R

.

బైకర్లు ఆపిన పెళ్లి: ఒక మృగం నుండి రక్షణ

నా కూతురి పెళ్లికి 42 మంది బైకర్లు అకస్మాత్తుగా వచ్చి, చర్చి తలుపులను అడ్డుకున్నారు, లోపలికి ఎవ్వరూ వెళ్లడానికి వీలు లేకుండా చేశారు. నేను అరిచాను, కదలమని అడిగాను, పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించాను, నా బిడ్డ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును నాశనం చేస్తున్నారని చెప్పాను.

Ads

ఆ బైకర్ల నాయకుడు, చేతుల నిండా గాయాలు ఉన్న ఒక భారీకాయుడు, కన్నీళ్లతో నా వైపు చూస్తూ నిలబడ్డాడు. “అమ్మా, ఈ పెళ్లి జరగనివ్వలేం. మీ కూతురు ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో ఆమెకి తెలియదు” అన్నాడు.

నీకేమైనా పిచ్చా? డేవిడ్ మంచి కుటుంబానికి చెందిన గౌరవనీయమైన లాయర్ అని, అడ్డుకోవడానికి అతనికి హక్కు లేదని చెప్పాను.

అప్పుడే అతను ఒక ఫోటోల ఫోల్డర్, హాస్పిటల్ రికార్డులు బయటికి తీశాడు, అవి చూసి నా రక్తం ఒక్కసారిగా చల్లబడింది. నా కూతురికి, ఒక రాక్షసుడికి మధ్య ఈ భయంకరమైన బైకర్లే అడ్డుగోడగా ఉన్నారని ఆ క్షణం నాకు అర్థమైంది.

మరో ఇరవై నిమిషాల్లో పెళ్లి ప్రారంభం కావాలి. సెయింట్ మేరీస్ కేథడ్రల్‌లోకి రెండు వందల మంది అతిథులు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ బైకర్ల గోడ ఒక్క అంగుళం కూడా కదలలేదు.

“అమ్మా, ఏం జరుగుతోంది?” నా కూతురు సారా, తన తెల్లటి దుస్తుల్లో ప్రకాశవంతంగా, గందరగోళంగా నా పక్కకు వచ్చింది. “వారు ఎందుకు కదలడం లేదు?”

“ఏమీ లేదు, బంగారం. ఎవరో పిచ్చివాళ్లు. నువ్వు లోపలికి వెళ్లు, నేను చూసుకుంటాను.”

కానీ ఆ బైకర్ల నాయకుడు నేరుగా ఆమెతోనే మాట్లాడాడు. “సారా, నా పేరు మార్కస్ వెబ్. మూడేళ్ల క్రితం, డేవిడ్ పాటర్సన్‌ని నా చిన్న చెల్లెలు, ఎమిలీ, పెళ్లి చేసుకుంది. అప్పుడు అతను కూడా పరిపూర్ణంగానే కనిపించాడు— ఆకర్షణీయమైన లాయర్, ఉజ్వల భవిష్యత్తు. కానీ, నిజానికి అతను ఒక పీడకల.”

సారా ముఖం పాలిపోయింది, గాలికి ఆమె ముసుగు కదులుతుండగా, ఆమె తన పూలగుచ్ఛాన్ని గట్టిగా పట్టుకుంది. “ఏం… ఏం మాట్లాడుతున్నారు? డేవిడ్ అస్సలు ….”

మార్కస్ ఆ ఫోల్డర్‌ను సున్నితంగా పట్టుకున్నాడు, ఆమెకు చెప్పాడు…

“అతను ఆమెను కొట్టాడు, సారా, ఆమె పక్కటెముకలను, ఆమె ఆత్మను విరిచాడు. ఈ హాస్పిటల్ రికార్డులు ఆమెకు ‘ప్రమాదాలు’ అని డాక్టర్లకు అబద్ధం చెప్పి ERలో చేరిన రాత్రులవి. మరియు ఈ ఫోటోలు…”

అతను మాకు కనిపించేలా కొద్దిగా తెరిచాడు— ఆమె చేతులపై నల్లటి పువ్వుల్లాంటి గాయాలు, కన్నీళ్లతో ఉబ్బిపోయిన ముఖం… అది సారా ముఖాన్ని పోలి ఉండటం చూసి నా శ్వాస ఆగిపోయింది. “ఎమిలీ చివరకు తప్పించుకుంది, కానీ బయటకు చెబితే చంపుతానని అతను బెదిరించాడు. ఆమె రక్షణ కోసం మా బైకర్ క్లబ్‌లో చేరింది— మేము ఆమెకు గార్డియన్స్ (సంరక్షకులు), ఆమెలాంటి వారికి అండగా ఉండే మాజీ సైనికులం, డేవిడ్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని విన్నప్పుడు, మేము మౌనంగా ఉండలేకపోయాం. నీకు కూడా హాని చేయడానికి ముందే దీన్ని ఆపమని ఎమిలీ మమ్మల్ని వేడుకుంది.”

నాకు ప్రపంచం తిరిగినట్లు అనిపించింది.

సారా ఆ సాక్ష్యాలను చూస్తూ, ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. బైకర్ల అడ్డంకి వెనుక అతిథులు గుసగుసలాడుకుంటున్నారు, కొందరు ఫోన్లు తీస్తున్నారు, మరికొందరు అసౌకర్యంగా కదులుతున్నారు. అప్పుడే డేవిడ్ చర్చి నుండి బయటికి వచ్చాడు, ముందే రిహార్సల్ చేసిన ఓ పాలిష్డ్ చిరునవ్వుతో “ఇక్కడ ఏం జరుగుతోంది? సారా, లోపలికి వెళ్లు. నవ్వులాటగా అనిపిస్తోందా..?’ అన్నాడు.

కానీ సారా అతని వైపు తిరిగింది, ఆమె గొంతు వణుకుతున్నా స్థిరంగా ఉంది. “ఇది నిజమేనా, డేవిడ్? ఎమిలీ గురించి?” అతని ముఖం కఠినంగా మారింది,  “ఎవరామె? ఈ గుండాలు అబద్ధం చెబుతున్నారు, మన ముఖ్యమైన రోజును పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నారు!”

మార్కస్ ముందుకు అడుగు వేశాడు, అతని భారీ శరీరం కదలకుండా నిలబడింది. “ఈ ఫోల్డర్ కంటే ఎక్కువ సాక్ష్యం మా దగ్గర ఉంది, ఎమిలీ సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంది. పోలీసులు వస్తున్నారు— తెలియకుండా మిగిలిపోయిన పాత అరెస్ట్ వారెంట్ ఒకటి నీపై ఉందట.”

డేవిడ్ సారా వైపు లంఘించాడు, ఆమె చేతిని పట్టుకున్నాడు. “పద, మనం వెళ్తున్నాం —”

కానీ బైకర్లు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా, ఒక వలలా అతన్ని చుట్టుముట్టారు. వారిలో ఒకరు, మెడపై టాటూలు ఉన్న ఒక గంభీరమైన మహిళ, సారాను అతని పట్టు నుండి మెల్లగా లాగింది. “ఇప్పుడు నీకు భద్రత ఉంది, నువ్వు మా అమ్మాయివి.”

నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు, డేవిడ్‌కు సంకెళ్లు వేసి తీసుకెళ్లారు, అతిథుల గుసగుసలు, షాక్‌లో అటూఇటూ చెదిరిపోయారు, కానీ సారా… నా చేతుల్లోకి కుప్పకూలి, ఏడవడం మొదలుపెట్టింది. “అమ్మా, నేనెలా తనను సరిగ్గా అంచనా వేయలేకపోయాను?”

నేను ఆమెను గట్టిగా పట్టుకున్నాను, నా కళ్ళ నుండి కూడా కన్నీళ్లు కారుతున్నాయి. “నేను కూడా సరిగ్గా చూడలేదు, తెలుసుకోలేదు, కానీ నా బంగారం. మనం బాగానే ఉన్నాం. మనం బాగానే ఉంటాం.”

ఆ రోజు పెళ్లి జరగలేదు. బదులుగా, మేము రిసెప్షన్ హాల్‌ను కృతజ్ఞత సమ్మేళనంగా మార్చాము. ఆ బైకర్లు, మమ్మల్ని కాపాడిన ఆ స్త్రీ పురుషులు, అక్కడే ఉన్నారు. వారు టేబుల్స్ చుట్టూ అనేక కథలు పంచుకున్నారు— బతికిన కథలు, బూడిద నుండి జీవితాలను తిరిగి నిర్మించుకున్న కథలు. మార్కస్ వీడియో కాల్ ద్వారా ఎమిలీని మాకు పరిచయం చేశాడు; ఆమె సురక్షితంగా, బలంగా ఉంది, ఆమె చిరునవ్వు ఆశకు చిహ్నం. సారా, ఎమిలీ గంటల తరబడి మాట్లాడుకున్నారు, పంచుకున్న బాధ, నిజం తెలిసిన ఊరటపై ఒక ఊహించని బంధాన్ని ఏర్పరచుకున్నారు.

తరువాత నెలల్లో, సారా తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఆమె గార్డియన్స్‌తో వాలంటీర్‌గా పనిచేసింది, ఇతర మహిళలు వేధింపుల పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి సహాయం చేసింది. మరియు మార్కస్… బాగా, అతను మా జీవితంలో ఒక భాగమయ్యాడు.

హడావిడిగా, అద్భుత కథలా కాకుండా, నెమ్మదిగా, తెల్లవారుజాములా. అతను సారాకు మోటార్‌సైకిల్ నడపడం నేర్పించాడు, బహిరంగ రహదారి స్వేచ్ఛను చూపించాడు. నా కూతురు మళ్లీ వికసించడం చూశాను, ఆమె నవ్వు తిరిగి వచ్చింది, ఆమె కళ్ళు ఏదో కొత్త చైతన్యంతో ప్రకాశిస్తున్నాయి.

ఒక సంవత్సరం తరువాత, ఓ సూర్యాస్తమయం సమయంలో ఒక చిన్న సరస్సు ఒడ్డున జరిగిన వేడుకలో— సారా ఒక సూట్‌లో ఉన్న లాయర్‌ను కాకుండా, గార్డియన్స్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ ద్వారా కలిసిన దయగల ఓ టీచర్‌ను పెళ్లి చేసుకుంది. మార్కస్ ఆమెను నడిపించి తీసుకువెళ్లాడు, అతని ఒంటి మీద గాయాలు గౌరవ చిహ్నాలు, అతని కళ్ళలో మళ్లీ కన్నీళ్లు— కానీ ఈసారి, అవి ఆనంద బాష్పాలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions