.
దాదాపు 5600 కోట్ల విలువైన పడవ… ఇప్పుడిది వార్తల్లోకి వచ్చింది… దీనిపేరు బ్రేక్ త్రూ… పేరుకు తగిన టెక్నాలజీ… ఇది ఎవరిదీ అంటే..? మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ది… అత్యంత విలాసవంతమైన ప్రయాణం కోసం, ముచ్చటపడి, అంత ఖరీదుతో నిర్మింప జేసుకున్నాడు…
ఆరేడేళ్లు పట్టింది దీని తయారీ లేదా నిర్మాణం… యాచ్ బ్రోకర్ ఎడ్మిస్టన్ అమ్మకానికి పెట్టాడు… డచ్ షిప్‌యార్డ్ ఫెడ్‌షిప్ నిర్మించింది… దీన్ని ప్రత్యేకంగా ఎందుకు పరిగణించాలంటే… పేరుకు తగినట్టే ఇంధన వినియోగంలో బ్రేక్ త్రూ… లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంగా నడుస్తుంది…
Ads
అంతేకాదు, లగ్జరీ… అడుగడుగునా విలాసం… ఇందులో 15 కేబిన్లు, 43 మంది సిబ్బంది, వాళ్లకు వసతి, 30 మంది అతిథులకు ఆ పడవ విలాసానికి తగినట్టుగా ఏర్పాట్లు, ఇందులోనే చిన్న హాస్పిటల్, లైబ్రరీ, లిఫ్టు, థియేటర్, స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్‌లు, బాస్కెట్ బాల్ కోర్ట్, స్టీమ్ రూమ్, జిమ్, యజమానుల కోసం టూబెడ్రూం డెక్, రెండు బాత్‌రూమ్‌లు, రెండు ఆఫీసులు, 14 స్లయిడ్ అవుట్ బాల్కనీలు… శాటిలైట్ కమ్యూనికేషన్స్…
ఎన్ని రోజులైనా అలా సముద్రంలో గడపడానికి వీలున్న విలాస నౌక… అయితే ఇక్కడ చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే…? అంత ఖర్చు పెట్టి, అంత ముచ్చట పడి నిర్మింపచేశాడు కదా… ఒక్కసారి కూడా అందులో తను ప్రయాణం చేయలేదు… అసలు అందులో అడుగు కూడా పెట్టలేదు…
ఇప్పుడిక దాన్ని అమ్మకానికి పెట్టాడు… మరెందుకు ఈ పడవ అంటారా..? అంతే… ప్రపంచ అత్యంత ధనికుల్లో ఒకడు తను… డబ్బు అలా ఖర్చు చేస్తుంటారు… అఫ్‌కోర్స్, వేల కోట్ల చారిటీ కూడా బిల్ గేట్స్‌కు అలవాటే… కానీ అంత ఇష్టపడి, ప్రపంచం అబ్బురపడే రీతిలో దాన్ని సమకూర్చుకుని, అస్సలు దాని మొహం ఎందుకు చూడలేదనేదే ఆసక్తికరమైన ప్రశ్న…
దీనిపై ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు… ఏవేవో పత్రికలు ఏం రాసినా పట్టించుకోలేదు… అసలు అది తనదే అని కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు… అంతా రహస్యం… మిస్టరీ… ఈ పడవ విషయంలో తన ఉద్దేశాల్లాగే… అంతా రహస్యం..!!
చెప్పనేలేదు కదూ… పోర్షే 958 లగ్జరీ కారు కొన్నాడు… ఎప్పుడు..? 1988లో… దాాన్ని డ్రైవ్ చేయడానికి, దాంట్లో ప్రయాణం చేయడానికి 13 ఏళ్లు వెయిట్ చేశాడు… రోజుకు 28 డాలర్ల జరిమానా కూడా కట్టాడు… ఎందుకు.,? బిల్ గేట్స్‌కు ఇలాంటి కథలు చాలా ఉన్నట్టున్నాయి అంటారా..? అదీ ఓసారి చెప్పుకుందాం, మరో కథనంలో..!
Share this Article